»   » 11 సంవత్సరాల తర్వతా హిట్ కాంబినేషన్ రిపీట్

11 సంవత్సరాల తర్వతా హిట్ కాంబినేషన్ రిపీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : 11 సంవత్సరాల క్రితం తనకు 'యజ్ఞం' రూపంలో హిట్ ఇచ్చి కెరీర్ మొదలెట్టిన రవి కుమార్ చౌదరితో గోపిచంద్ తన తదుపరి చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. కోన వెంకట్, గోపీ మోహన్ స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ చిత్రానికి ఘటికాచలం రచయిత, శ్రీధర్ పీసన డైలాగ్స్ రైటర్.రెజీనా హీరోయిన్ గా ఎంపికైన ఈ చిత్రం షూటింగ్ కొద్ది రోజుల క్రితమే ప్రారంభమైంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

దర్శకుడు మాట్లాడుతూ.... చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని,స్ట్రాంగ్ గా ఉండే ఎమోషన్ కంటెంట్ తో నడుస్తుందని చెప్పారు. అలాగే క్రిసమస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల చేస్తామని అన్నారు.

దర్శకుడు కంటిన్యూ చేస్తూ.. ‘‘యజ్ఞం' సినిమా వచ్చిన పదకొండేళ్ల్లకు గోపీచంద్‌తో మళ్లీ సినిమా చెయ్యడం ఆనందంగా ఉంది. వినూత్నమైన కథతో తెరకెక్కుతోంది. చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనరిది. నా తాలుక ఎమోషన్స్‌ మిస్‌ కాకుండా ఉంటుంది. హిట్‌ సినిమాకు కావలసిన అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. కథ డిమాండ్‌ మేరకు ఇందులో చాలా పాత్రలుంటాయి. ప్రతి పాత్రకు తెరపై ప్రాధాన్యత కనిపిస్తుంది'' అని అన్నారు.

Gopichand - A.S.Ravikumar Chowdary film for Christmas

‘‘యజ్ఞం'తో సూపర్‌హిట్‌ కాంబినేషన్‌ అనిపించుకున్న గోపీచంద్‌, రవికుమార్‌తో ఈ సినిమా చెయ్యడం హ్యాపీగా ఉంది. ఈ నెల 25 నుంచి తాజా షెడ్యూల్‌ ప్రారంభమవుతుంది. డిసెంబర్‌ 25న చిత్రాన్ని విడుదల చేస్తాం'' అని ఆనంద్‌ ప్రసాద్‌ తెలిపారు.

అలానే 'యజ్ఞం'లాంటి హిట్ చిత్రాన్ని ఇచ్చిన రవి దర్శకత్వంలో మళ్ళీ నటించడం ఆనందంగా ఉందని గోపీచంద్ చెబుతున్నారు. గోపీచంద్ తో ఏర్పడిన అనుబంధం ఈ సినిమాతో మరింత బలపడుతుందని, రచయిత శ్రీధర్ సీపాన దర్శకత్వంలోనూ త్వరలో ఓ చిత్రాన్ని నిర్మిస్తానని ఆనంద ప్రసాద్ తెలిపారు.

దర్శకుడిగా రవికుమార్ చౌదరికి తొలి అవకాశాన్ని ఇచ్చింది భవ్య క్రియేషన్స్ అధినేత ఆనంద ప్రసాదే. అయితే... తొలి విజయాన్ని మాత్రం గోపీచంద్ 'యజ్ఞం'తో సొంతం చేసుకున్నారు రవికుమార్ చౌదరి. ఇప్పుడు మరోసారి గోపీచంద్ చిత్రానికి వర్క్ చేయడం, ఆ అవకాశం భవ్య క్రియేషన్స్ ద్వారా రావడం ఆనందంగా ఉందన్నారు. '

షావుకారు జానకి, నాజర్‌, పృథ్వీ, రఘుబాబు, జె.పి., అశుతోష్‌ రాణా, ప్రదీప్‌ రావత్‌, సురేఖావాణి, సత్యకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: శ్రీధర్‌ సీపాన, స్క్రీప్లే: కోన వెంకట్‌, గోపీ మోహన్, రచన: ఘటికాచలం. కెమెరా: ప్రసాద్‌ మూరెళ్ల, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌.

English summary
After 11 years, A.S.Ravikumar Chowdary and Gopichand, who earlier worked together for 'Yagnam', have teamed up once again. This film is being produced by V.Anand Prasad on Bhavya Creations banner. Kona Venkat provided the screenplay and Ghatikachalam is the writer. Sridhar Seepana is the dialogue writer.
Please Wait while comments are loading...