twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Pakka Commercial Collections: వీకెండ్‌లో గోపీచంద్ హవా.. 3రోజుల్లోనే అన్ని కోట్లు.. ఇంకెంత రావాలంటే!

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన చిత్రాలతో ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుని.. సుదీర్ఘ కాలంగా టాలీవుడ్‌లో వరుస సినిమాలతో సందడి చేస్తున్నాడు మ్యాచో స్టార్ గోపీచంద్. కెరీర్ ఆరంభంలోనే పలు విజయాలను అందుకున్న అతడు.. ఆ తర్వాత చాలా కాలం పాటు పరాజయాల పరంపరతో ఇబ్బందులు పడ్డాడు. ఇలాంటి పరిస్థితుల్లోనూ విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా గోపీచంద్ 'పక్కా కమర్షియల్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలతో గత శుక్రవారమే విడుదలైన ఈ సినిమాకు టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా 3 రోజుల్లో ఎంత వసూలు చేసింది? ఇంకెత వస్తే హిట్ అవుతుంది? అనేవి చూద్దాం పదండి!

    పక్కా కమర్షియల్‌గా వచ్చేశాడుగా

    పక్కా కమర్షియల్‌గా వచ్చేశాడుగా

    గోపీచంద్ హీరోగా స్టార్ డైరెక్టర్ మారుతి తెరకెక్కించిన చిత్రమే 'పక్కా కమర్షియల్'. ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటించింది. అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, జీఏ3 బ్యానర్లపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. జాక్స్ బెజాయ్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు. ఇందులో సత్యరాజ్, రావు రమేష్ సహా పలువురు ప్రముఖులు కీలక పాత్రలు పోషించారు.

    బీచ్‌లో నిక్‌తో ప్రియాంక చోప్రా రొమాన్స్: వాళ్ల బట్టలు, ఫోజులు చూశారంటే!బీచ్‌లో నిక్‌తో ప్రియాంక చోప్రా రొమాన్స్: వాళ్ల బట్టలు, ఫోజులు చూశారంటే!

    పక్కా కమర్షియల్ బిజినెస్ ఇలా

    పక్కా కమర్షియల్ బిజినెస్ ఇలా

    గోపీచంద్ - మారుతి కలయికలో వచ్చిన 'పక్కా కమర్షియల్' మూవీ నైజాంలో రూ. 4 కోట్లు, సీడెడ్‌లో రూ. 2 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 7.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 13.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 50 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.30 కోట్లతో కలిపి ఈ సినిమా ఓవరాల్‌గా రూ. 15.30 కోట్ల బిజినెస్ చేసుకుంది.

    3వ రోజు ఎక్కడ.. ఎంతొచ్చింది

    3వ రోజు ఎక్కడ.. ఎంతొచ్చింది


    'పక్కా కమర్షియల్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 3వ రోజు వసూళ్లు కాస్త తక్కువగా వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 43 లక్షలు, సీడెడ్‌లో రూ. 20 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 21 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 11 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 9 లక్షలు, గుంటూరులో రూ. 11 లక్షలు, కృష్ణాలో రూ. 12 లక్షలు, నెల్లూరులో రూ. 7 లక్షలతో.. రూ. 1.34 కోట్లు షేర్, రూ. 2.15 కోట్లు గ్రాస్ వచ్చింది.

    అషు రెడ్డి ప్రైవేటు భాగంలో పవన్ టాటూ: మరోసారి డ్రెస్ తీసేసి చూపించిన బ్యూటీఅషు రెడ్డి ప్రైవేటు భాగంలో పవన్ టాటూ: మరోసారి డ్రెస్ తీసేసి చూపించిన బ్యూటీ

    3 రోజులకు కలిపి ఎంతొచ్చింది

    3 రోజులకు కలిపి ఎంతొచ్చింది

    ఏపీ, తెలంగాణలో 'పక్కా కమర్షియల్' మూవీకి 3 రోజుల్లో మంచి వసూళ్లే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 1.73 కోట్లు, సీడెడ్‌లో రూ. 86 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 86 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 50 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 40 లక్షలు, గుంటూరులో రూ. 44 లక్షలు, కృష్ణాలో రూ. 41 లక్షలు, నెల్లూరులో రూ. 29 లక్షలతో.. రూ. 5.49 కోట్లు షేర్, రూ. 9.05 కోట్లు గ్రాస్ దక్కింది.

    ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

    ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది


    3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ. 5.49 కోట్లు షేర్ రాబట్టిన 'పక్కా కమర్షియల్' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగా అంతగా రాణించలేదు. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 26 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 72 లక్షలు వసూలు చేసింది. వీటితో కలిపి 3 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా గోపీచంద్ సినిమాకు రూ. 6.47 షేర్‌తో పాటు రూ. 11.00 కోట్లు గ్రాస్‌ వసూలు అయింది.

    హాట్ సెల్ఫీతో షాకిచ్చిన దేత్తడి హారిక: అసలు ఇది డ్రెస్సేనా.. చూస్తే అవాక్కవుతారు!హాట్ సెల్ఫీతో షాకిచ్చిన దేత్తడి హారిక: అసలు ఇది డ్రెస్సేనా.. చూస్తే అవాక్కవుతారు!

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

    క్రేజీ కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'పక్కా కమర్షియల్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 15.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 16 కోట్లుగా నమోదైంది. ఇక, 3 రోజుల్లో దీనికి రూ. 6.47 కోట్లు వచ్చాయి. అంటే మరో 9.53 కోట్లు వస్తేనే ఇది హిట్ స్టేటస్‌ను అందుకుంటుంది.

    పక్కా కమర్షియల్ నిర్మాతలు సేఫ్

    పక్కా కమర్షియల్ నిర్మాతలు సేఫ్

    'పక్కా కమర్షియల్' మూవీకి పబ్లిసిటీతో కలిసి రూ. 35 కోట్లు బడ్జెట్ అయింది. అయితే, నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారానే నిర్మాతలకు రూ. 32 కోట్లు వచ్చేశాయి. దీంతో ఈ సినిమాను సొంతంగా రిలీజ్ చేసుకున్నారు. ఫలితంగా ఈ సినిమా వీకెండ్‌లోనే టార్గెట్‌ను పూర్తి చేసుకుంది. దీంతో నిర్మాతలు సేఫ్ అయిపోయారు. రానున్న రోజుల్లో దీనికి వచ్చేదంతా లాభమే అని తెలుస్తోంది.

    English summary
    Gopichand Did Pakka Commercial movie Under Maruthi Direction. This Movie Collects Rs 6.47 Crores in 3 Days
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X