»   » గోపీచంద్ 'జిల్‌' చిత్రం విడుదల తేదీ, ఆడియో తేదీ

గోపీచంద్ 'జిల్‌' చిత్రం విడుదల తేదీ, ఆడియో తేదీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :గోపీచంద్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'జిల్‌'. రాశీ ఖన్నా హీరోయిన్. యువీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్నారు. రాధా కృష్ణకుమార్‌ దర్శకుడు. చిత్రీకరణ దాదాపుగా పూర్తయింది. ఈనెల 12న ఈ చిత్రంలోని గీతాల్ని విడుదల చేస్తారు. మార్చి 27న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

దర్శకుడు మాట్లాడుతూ ''గోపీచంద్‌ అంటే యాక్షన్‌ ఘట్టాల్ని ఎక్కువగా ఆశిస్తారు. వాటితో పాటు ప్రేమకథ, వినోదం మిళితమైన చిత్రమిది. జిబ్రాన్‌ అందించిన పాటలు అందరినీ ఆకట్టుకొంటాయి''అన్నారు.

చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి ద‌గ్గ‌ర దర్శ‌కత్వ శాఖ‌లో ప‌నిచేసిన రాధా కృష్ణ కుమార్ ని దర్శకునిగా ప‌రిచయం చేస్తూ... నిర్మాత‌లు వంశి, ప్ర‌మోద్‌లు నిర్మిస్తున్న ఈ చిత్రం మూడు పాట‌లు మిన‌హా షూటింగ్ మెత్తం పూర్తిచేసుకుంది.

ఈ సంధ‌ర్బంగా నిర్మాత‌లు వంశి, ప్ర‌మోద్ లు మాట్లాడుతూ.. "యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ హీరోగా' మిర్చి' లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రంతో మా సంస్థ యు.వి.క్రియోష‌న్స్ ప్రారంభ‌మైంది, మా రెండ‌వ ప్ర‌య‌త్నం శ‌ర్వానంద్ హీరోగా'ర‌న్ రాజా ర‌న్'తో మ‌రోక బ్లాక్‌బ‌స్ట‌ర్ విజ‌యాన్ని సాధించాం. ఇప్పుడు మా మూడ‌వ చిత్రం' లౌక్యం' లాంటి సూప‌ర్‌డూప‌ర్ హిట్ చిత్రం త‌రువాత గోపిచంద్ హీరోగా, రాశిఖ‌న్నా హీరోయిన్ గా, రాధా కృష్ణ కుమార్ ని ద‌ర్శ‌కునిగా ప‌రిచ‌యం చేస్తూ తెర‌కెక్కిస్తున్న చిత్రం జిల్‌. ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌తో ల‌వ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ గా ఈ చిత్రాని ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించారు.

గోపిచంద్ గత చిత్రాల్లో లాగా యాక్ష‌న్ వుంటూ చ‌క్క‌టి ల‌వ్ అండ్ ఫ్యామిలి ఎంటర్ టైన‌ర్ గా గోపిచంద్ అభిమానుల్ని అల‌రిస్తుంది. అలాగే మా యు.వి.క్రియోష‌న్స్ బ్యాన‌ర్ వాల్యూని రెండింత‌లు చేసే చిత్రం గా జిల్ వుండ‌బోతుంది. గోపిచంద్ లుక్ ప‌రంగా ప‌క్కా కేర్ తీసుకున్నాము. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్ ఫోస్ట‌ర్స్ కి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ముఖ్యంగా టైటిల్ జిల్ కి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ చిత్రానికి త‌మిళం లో 'ఐ', హింది లో 'కిక్' చిత్రాల‌ని యాక్ష‌న్ అందించిన అణ‌ల్ అరుసు యాక్ష‌న్ కోరియోగ్ర‌ఫి చేయ్యగా గోపిచంద్ సూప‌ర్బ్ గా చేశాడు. రేపు ధియోట‌ర్స్ లో చూసిన ప్ర‌తిప్రేక్ష‌కుడు థ్రిల్ ఫీల‌వుతాడు. మా బ్యాన‌ర్ లో ర‌న్ రాజా ర‌న్ కి సూప‌ర్బ్ మ్యూజిక్ ని అందిచిన జిబ్రాన్ ఈ చిత్రానికి ఎక్స‌లెంట్ సంగీతాన్ని అందించాడు. " అని అన్నారు.

Gopichand's JIL To Release In March 27th

ద‌ర్శ‌కుడు రాధా కృష్ణ కుమార్ మాట్లాడుతూ.... 'మిర్చి', 'ర‌న్ రాజా ర‌న్' లాంటి రెండు బ్లాక్‌బ‌స్ట‌ర్స్ చిత్రాల్ని అందిచిన నిర్మాణ సంస్ధ యు.వి.క్రియోష‌న్స్ లో నిర్మాత‌లు వంశి, ప్ర‌మోద్ లు హ్య‌ట్రిక్ ఫిల్మ్ గా నాకు అవ‌కాశం ఇచ్చినందుకు నా స్పెష‌ల్ థ్యాంక్స్‌. ఈ చిత్రం లో గోపిచంద్‌, రాశిఖ‌న్నాలు జంట‌గా న‌టిస్తున్నారు. క‌థ గా ఏమి రాసుకున్నామో అలాగే ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాం. ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా ఈ చిత్రాన్ని చేశాము. దీనికి నిర్మాత‌లు వంశి, ప్రమెద్ లు అందించిన స‌పోర్ట్ మ‌రచిపోలేనిది. గోపిచంద్ గారు ఈ చిత్రం లో కొత్త‌గా క‌నిపిస్తారు. ముఖ్యంగా యాక్ష‌న్ వైవిధ్యంగా వుంటుంది. జిబ్రాన్ సంగీతం ఒన్ ఆఫ్ ది హైలెట్ గా నిలుస్తుంది. వ‌చ్చే వారంలో షూట్ చేస్తే పాట‌ల‌తో టోట‌ల్ చిత్రం పూర్త‌వుతుంది. అని అన్నారు.

''ఇటీవల స్పెయిన్‌లో పాటల్ని తెరకెక్కించాం. గోపీచంద్‌ కెరీర్‌లో ఇదో వైవిధ్యభరితమైన చిత్రం అవుతుందన్న నమ్మకం ఉంది''అని నిర్మాత తెలిపారు. నటీనటులు- గోపిచంద్, రాశిఖ‌న్నా, చ‌ల‌ప‌తిరావు, బ్ర‌హ్మ‌నందం, పోసాని కృష్ణ‌ముర‌ళి,సంప‌త్‌, క‌బీర్, హ‌రీష్ ఉత్త‌మ‌న్‌, అవ‌స‌రాల శ్రీనివాస్‌, అమిత్ ,ప్ర‌భాస్ శీను, ఫ‌నికాంత్‌, మాస్ట‌ర్ నిఖిల్‌, బేబి అంజ‌లి, క‌ల్ప‌ల‌త‌, మౌళిక మెద‌ల‌గువారు న‌టించారు.

కాస్ట్యూమ్ డిజైన‌ర్ - తోట విజ‌య్ భాస్క‌ర్‌, ఆర్ట్ డైర‌క్ట‌ర్ - ఏ.య‌స్.ప్ర‌కాష్‌, యాఓన్ డైర‌క్ట్ - అన‌ల్ అరుసు, ఎడిట‌ర్‌- కోట‌గిరి వెంక‌టేశ్వ‌రావు, డైర‌క్ట‌ర్ ఆఫ్ ఫోటోగ్రఫి- శ‌క్తి శ‌ర‌వ‌ణ‌న్‌, పి.ఆర్వో- ఎస్.కె.ఎన్‌, ఏలూరు శీను, సంగీతం- జిబ్రాన్‌, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌- సందీప్‌, నిర్మాత‌లు- వంశి, ప్ర‌మోద్‌, క‌థ‌-స్ర్కీన్‌ప్లే-మాట‌లు-ద‌ర్శ‌క‌త్వం - రాధా కృష్ణ కుమార్‌.

English summary
Gopi Chand’s new movie “Jil” is all set to release. After his recent hit with Lowkyam, he was ready to repeat the same result with Jil. Radha Krishna Kumar who was an apprentice of Chandrasekhar yeleti is directing the movie .Raashi Khanna was sharing screen with Gopi in this movie.
Please Wait while comments are loading...