»   » డేట్ ఫిక్స్: గోపిచంద్‌ కి 'సౌఖ్యం' దొరికేది అప్పుడే

డేట్ ఫిక్స్: గోపిచంద్‌ కి 'సౌఖ్యం' దొరికేది అప్పుడే

Written By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: గోపీచంద్‌, రెజీనా జంటగా ఏఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'సౌఖ్యం'. ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 25న క్రిస్‌మస్‌ కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.

గోపిచంద్‌ నటించిన 'లౌక్యం' చితాన్ని నిర్మించిన భవ్య క్రియేషన్స్‌ సంస్థే ఈ చిత్రాన్నితెరకెక్కించింది. 'లౌక్యం'తో హిట్‌ అందుకున్న గోపీచంద్‌ 'సౌఖ్యం'తో ప్రేక్షకులను మెప్పిస్తాడో లేదో వేచి చూడాలి.

soukyam

ఆపదలో ఆదుకొనేవాడే ఆప్తుడు. మన సౌఖ్యం కోరుకొనే వాడే స్నేహితుడు. అలా స్నేహితుడిగా వచ్చి, ఆప్తుడిగా మారిన ఓ యువకుడి కథే 'సౌఖ్యం' అంటున్నారు గోపీచంద్‌. ఎ.ఎస్‌.రవికుమార్‌ చౌదరి దర్శకుడు. వి.ఆనంద్‌ ప్రసాద్‌ నిర్మాత. ఇటీవల స్విట్జర్లాండ్‌లో మూడు పాటల్ని తెరకెక్కించారు.

దర్శకుడు మాట్లాడుతూ ''వినోదం, యాక్షన్‌, కుటుంబ బంధాలతో సాగే చిత్రమిది. రామజోగయ్య శాస్త్రి రాసిన 'ఓనా సిండ్రెల్లా ముద్దొచ్చే ఏంజెల్లా', 'నాకేం తోచదే తోచదే' పాటలతో పాటు భాస్కరభట్ల రచించిన 'ఆ ఇవ్వమ్మ ఇవ్వమ్మ' గీతాన్ని తెరకెక్కించాము''అన్నారు.

soukyam2

ఇద్దరు మ‌నుషులు ఎదురైన‌ప్పుడు పెదాల మీద చిరున‌వ్వుతో పాటు మ‌న‌సులోనుంచి వ‌చ్చే మాటే `సౌఖ్యంగా ఉన్నారా` అని. ఎదుటివారి సౌఖ్యాన్ని గురించి ఆలోచించేది ఆత్మీయులే. అలాంటి ఆత్మీయులంద‌రూ సౌఖ్యంగా ఉండాల‌నుకునే వ్యక్తి క‌థ‌తో తెర‌కెక్కుతున్న సినిమా `సౌఖ్యం`.

గోపీచంద్‌, రెజీనా జంట‌గా న‌టిస్తున్న ఈ సినిమాలో షావుకారు జాన‌కి, బ్రహ్మానందం, పోసాని కృష్ణ ముర‌ళి, జ‌య‌ప్రకాష్ రెడ్డి, జీవా, ర‌ఘుబాబు, కృష్ణభ‌గ‌వాన్‌, ముఖేష్ రుషి, దేవా, పృథ్వి, ర‌ఘు, శివాజీరాజా, సురేఖావాణి, స‌త్యకృష్ణ‌, స‌త్యం రాజేష్ ఇత‌ర కీల‌క పాత్రల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమాకు క‌థ‌, మాట‌లు; శ్రీధ‌ర్ సీపాన‌, సంగీతం: అనూప్ రూబెన్స్, స్క్రీన్‌ప్లే: కోన వెంక‌ట్‌, గోపీ మోహ‌న్‌, కెమెరా: ప‌్రసాద్ మూరెళ్ళ‌, ఎడిట‌ర్‌: గౌతంరాజు, ఆర్ట్ : వివేక్‌, నిర్మాత‌: వి.ఆనంద్‌ప్రసాద్‌.

English summary
Gopichand 's “Soukyam” makers are planning to release in December 25th on the occasion of Christamas festival.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu