»   »  డమరుకం కలెక్షన్స్ బీట్ చేసిన గ్రీకువీరుడు

డమరుకం కలెక్షన్స్ బీట్ చేసిన గ్రీకువీరుడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నాగార్జున, నయనతార జంటగా దశరథ్ దర్శకత్వంలో రూపొందిన 'గ్రీకు వీరుడు' చిత్రం యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద మంచి ఓపెనింగ్స్ సాధించింది. అమెరికాలో నాగార్జున కెరీర్లోనే భారీ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా 'గ్రీకువీరుడు' నిలిచింది. గతంలో నాగార్జున హీరోగా వచ్చిన 'డమరుకం', 'షిరిడి సాయి' చిత్రాల వీకెండ్ కలెక్షన్లను 'గ్రీకు వీరుడు' కేవలం రెండు రోజుల్లోనే సాధించింది.

నాగార్జున డిఫరెంట్ లుక్, నయనతార హీరోయిన్ గా నటించడం, క్లాస్ లవ్ స్టోరీ కావడంతో సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలే ఉన్నాయి. సినిమా విడుదలకు ముందు రోజు(గురువారం) ఈచిత్రం ప్రీమియర్ షో 43 లొకేషన్లలో ప్రదర్శించగా $29,822 వసూళ్లు సాధించింది.

సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ బిజినెస్‍‌పై ప్రభావం చూపలేదు. రెండో రోజు(శుక్రవారం)కు 48 లొకేషన్లలో ప్రదర్శితం అవుతూ $48,270 వసూలు చేసింది. శనివారం నాటికి ఈచిత్రం కలెక్షన్లు $55,995 చేరుకుంది. మూడు రోజుల్లో మొత్తం $134,086 (Rs 72.14 lakhs) వసూలు చేసింది. ఆదివారం బిజినెస్ వివరాలు తెలియాల్సి ఉంది.

ఇక నాగార్జున గత సినిమాల వసూళ్లు పరిశీలిస్తే... డమరుకం చిత్రం ఓపెనింగ్ వీకెండ్ 20 స్క్రీన్లలో ప్రదర్శితం అవుతూ $1,08,882 (Rs 60.47 lakhs), షిరిడి సాయి చిత్రం 45 స్క్రీన్లలో ప్రదర్శితం అవుతూ $1,70,958 (Rs 94.79 lakhs) వసూలు చేసింది. ఇప్పటికే $134,086 (Rs 72.14 lakhs) వసూలు చేసి గ్రీకు వీరుడు ఆదివారం కలెక్షన్లతో కలిపి రూ. కోటి దాటుతుందని అంచనా.

English summary

 Telugu film Greeku Veerudu starring Akkineni Nagarjuna and Nayantara in leads, has received superb opening at the USA Box Office. It has become the biggest opener of Nagarjuna in America. The Dasarath-directed movie has beaten the first weekend collection record of Nag's previous releases like Damarukam and Shirdi Sai in just two days.
Please Wait while comments are loading...