For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఖర్చులు కూడా రావటం లేదంట..పెద్ద ఫ్లాప్

  By Srikanya
  |

  హైదరాబాద్:‘నువ్విలా' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై, ‘జీనియస్'తో తన లోని టాలెంట్ ని చూపిన యంగ్ హీరో హవీష్ చేసిన మరి లేటెస్ట్ మూవీ ‘రామ్ లీల'. హవీష్ తో పాటు అభిజిత్, నందిత నటీనటులుగా శ్రీపురం కిరణ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాని కోనేరు సత్యనారాయణ సమర్పణలో రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ కుమార్ నిర్మించాడు. ఈ శుక్రవారం విడుదలైన ఈ చిత్రం థియోటర్ ఖర్చులు కూడా రావటం లేదని ట్రేడ్ వర్గాల సమాచారం. దాంతో చాలా చోట్ల ఈ చిత్రాన్ని వచ్చే శుక్రవారం దాకా ఉంచాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  చిన్న సినిమా అయినప్పటికీ ని ప్రేక్షకులందరికీ రీచ్ అయ్యేలా చెయ్యాలని పలు కొత్త రకాల ఆలోచనలతో ప్రమోషన్స్ చేసారు. ఇప్పటికే శ్రేయాస్ మీడియా వారితో కలిసి బ్యాంకాక్ టూర్ అని ఓ కాంటెస్ట్ ని రన్ చేసింది. అయినా ఫలితం లేకుండా పోయింది. ట్రై యాంగిల్ లవ్ స్టొరీ అయిన ఈ సినిమా సక్సెస్ పై హవీష్ చాలా నమ్మకంగా ఉన్నాడు. మలేసియా నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథలో లవ్, కామెడీ, సెంటిమెంట్ ఇలా అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. కానీ ఏదీ ఆకట్టుకునే స్ధాయిలో పండకపోవటం మైనస్ అయ్యింది.

  చిత్రం కథేమిటంటే..

  Havish's Ram Leela Movie at Boxoffice

  కృష్ణ అలియాస్ క్రిష్(అభిజిత్) అమెరికాలో ఓ పెద్ద కంపెనీలో పనిచేస్తూంటాడుఓ రోజు మా టీవీ ఛానెల్ లో సస్య(నందిత)ని చూసి ప్రేమలో పడతాడు. వెంటనే క్రిష్ ఇండియా రావడం, సస్యని ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం చకచకా జరుగుతాయి. పెళ్లి తర్వాత క్రిష్ సస్యని తీసుకొని అమెరికా వెళ్ళకుండా, తన జాబుని మలేషియా షిఫ్ట్ చేయించుకొని అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన మొదటి రోజే సస్య తను ప్రేమించిన వాడి దగ్గరికి వెళ్లిపోతున్నానని లెటర్ రాసి పెట్టి వెళ్ళిపోతుంది.

  దాంతో బాగా డిప్రెస్ అయిన క్రిష్ సస్య జ్ఞాపకాలతో ఒంటరిగా హనీమూన్ కోసం అనుకున్న రోడ్ ట్రిప్ ప్లాన్ ని అమలు చేస్తాడు. ఈ రోడ్ ట్రిప్ లో క్రిష్ కి రామ్(హవిష్) పరిచయం అవుతాడు. మొదట్లో రామ్ అంటే అసహ్యించుకొనే క్రిష్ కి మెల్లగా రామ్ పై మంచి అభిప్రాయం కలుగుతుంది. అక్కడి నుంచి క్రిష్ లైఫ్ లో కొన్ని ఊహించని సంఘటనలు జరుగుతాయి. ఆ సంఘటనలు ఏమిటి.? అసలు రామ్ ఎవరు.? అకస్మాత్తుగా రామ్ ఎందుకు క్రిష్ లైఫ్ లోకి వచ్చాడు.? సస్య ప్రేమించిన వ్యక్తి ఎవరు.? రామ్, సస్యల మధ్య ఏదైనా రిలేషన్ ఉందా.? అన్న ఆసక్తిర విషయాల్ని మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

  English summary
  "Ram Leela" (Ramleela) starring Havish, Abhijeeth, Nanditha in the leads, has got negative reviews and poor ratings from film critics, who are upset with the movie's weak script and direction.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X