»   » టాక్ చెత్తగా ఉన్నా... రెండ్రోజుల్లో రూ. 31 కోట్లు!

టాక్ చెత్తగా ఉన్నా... రెండ్రోజుల్లో రూ. 31 కోట్లు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్లో అక్షయ్ కుమార్ ప్రధానపాత్రలో గతంలో వచ్చిన 'హౌస్ ఫుల్', 'హౌస్ ఫుల్-2' సినిమాలు భారీ విజయం సాధించాయి. తాజాగా 'హౌస్ ఫుల్-3' కూడా రిలీజైంది. ఈ చిత్రానికి సాజిద్-పర్హాద్ దర్శకత్వం వహించగా, సాజిద్ నడియావాలా 'నడియావాలా గ్రాండ్ సన్ ఎంటర్టెన్మెంట్' బేనర్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

జూన్ 3న గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమాకు ఓపెనింగ్స్ బాగా వచ్చాయి. అక్షయ్ కుమార్ హీరో కావడం, గత రెండు సీరిస్ చిత్రాలు మంచి విజయం సాధించడంతో ఈ సినిమాపై ముందు నుండి మంచి అంచనాలున్నాయి. అందుకే తొలి రెండు రోజుల్లోనే ఈ చిత్రం రూ. 31.51 కోట్లు వసూలు చేసింది. వరల్డ్ వైడ్ 3600 స్క్రీన్లలో ఈ సినిమాను రిలీజ్ చేసారు.

తొలి రోజు రూ. 15.21 కోట్లు వసూలు కాగా, రెండో రోజు రూ. 16.30 కోట్లు వసూలు చేసింది. అయితే సినిమా విడుదలైన రోజు నుండే టాక్ నెగెటివ్ గా ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు వసూళ్లు ఇలానే కొనసాగుతాయా? లేక డ్రాపవుతాయా? అనేది చర్చనీయాంశం అయింది.

Housefull 3 collects Rs 31.51 cr in two days

రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ముగ్గురు వ్యక్తుల చుట్టూ తిరుగుతుంది. వారే సాండీ (అక్షయ్ కుమార్), బంటీ (అభిషేక్ బచ్చన్), టెడ్డీ (రితేష్ దేశ్ ముఖ్). ఈ ముగ్గురు బటుక్ పటేల్ కూతుర్లతో ప్రేమలో పడతారు. వారే సారా పటేల్(నర్గీస్ ఫక్రి), జెన్నీ పటేల్ (లీసా హెడెన్), గ్రేసీ పటేల్ (జాక్వెలిన్ పెర్నాండెజ్). తండ్రి దృష్టిలో ఈ ముగ్గురు చాలా సంస్కారమైన అమ్మాయిలు. కానీ రియల్ లైఫ్ లో మాత్రం అందుకు పూర్తి వ్యతిరేకం.

బటుక్ పటేల్ తన కూతుర్లకు అసలు పెళ్లి అవసరం లేదనే ఆలోచనలో ఉంటాడు. ప్రపంచంలో ఇలాంటి ఆలోచన ఉన్న ఏకైక తండ్రి ఇతడే. ఒకరి తర్వాత ఒకరు సాండీ, బంటీ, టెడ్డీ బటుక్ పటేల్ కూతుర్ల బాయ్ ఫ్రెండ్స్ గా అతని ఇంట్లోకి ఎంటరవుతారు. అక్కడి నుండి ఫన్ డ్రామా మొదలవుతుంది. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను బాగా నవ్విస్తాయి. ఈ ముగ్గురు బటుక్ పటేల్ కూతుర్లకు సరైన జోడీ అని ఎలా నిరూపించుకుంటారు? అనేది మిగతా స్టోరీ.

English summary
Housefull 3, backed by a powerful ensemble led by Akshay Kumar, has taken off to a fantastic start at the box office. The film which released in around 3600 screens, witnessed 7.17% growth towards its collections and raked in Rs. 16.30 cr, making the total collections to Rs. 31.51 cr.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu