Hridayapoorvam Day 1 Collections: హృదయపూర్వం బాక్సాఫీస్ కలెక్షన్లు.. మోహన్‌లాల్ మూవీకి ఎన్ని కోట్లంటే?

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన తాజా చిత్రం హృదయపూర్వం. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి సత్యన్ అంతికాడ్ దర్వకత్వం వహించారు. డైరెక్టర్ కుమారుడు అఖిల్ సత్యన్ రాసిన కథకు సోను టీపీ స్క్రీన్ ప్లే అందించారు. ఈ సినిమాను ఆశ్వీరాద్ సినిమాస్ బ్యానర్‌పై అంటోని పెరంబవూర్ నిర్మించారు. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, సంగీత్ ప్రతాప్, సంగీత మాధవన్ నాయర్, సిద్దిఖీ, లాలు అలెక్స్, జనార్ధన్, సబితా ఆనంద్, బాబురాజ్, నిషాన్, ఎస్పీ చరణ్ తదితరులు నటించారు. మీరా జాస్మిన్, బాసిల్ జోసెఫ్ అతిథి పాత్రల్లో కనిపించారు.

ఈ సినిమా సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. అను మోథేదాత్ సినిమాటోగ్రఫిని, కే రాజ్‌గోపాల్ ఎడిటింగ్, జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ బాధ్యతలను నిర్వహించారు. ఇక ఈ సినిమాకు పనిచేసిన నటీనటులు (మోహన్‌లాల్ పారితోషికం మినహాయించి), సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులన్నీ కలిపి 35 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఇక ఈ సినిమాను ఇండియాలో భారీగా రిలీజ్ చేశారు.

Hridayapoorvam Day 1 collections

మోహన్ లాల్ ఈ ఏడాది నటించిన ఎంపురాన్ 2, తుడరం సినిమాలు భారీ విజయం సాధించడంతో హృదయపూర్వం సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దాంతో ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 50 కోట్ల రూపాయల షేర్, 100 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా వాల్యూ కట్టారు. ఇక ఈ సినిమాకు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రపంచవ్యాప్తంగా 850 నుంచి 900 స్క్రీన్లలో రిలీజ్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఓనమ్ పండుగ సందర్భంగా రిలీజైన ఇక ఈ చిత్రానికి కేరళలో మంచి స్పందన లభించింది. ఈ సినిమాకు ఓవరాల్‌గా 40 శాతం ఆక్యుపెన్సీ తొలి రోజు నమోదైంది. కొట్టాయంలో అత్యధికంగా 70 శాతం, కొల్లాంలో 45 శాతం, త్రిచూరులో 45 శాతం, కోచిలో 35 శాతం, అలెప్పీలో 30 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. హైదరాబాద్‌లో 10 శాతం ఆక్యుపెన్సీ కనిపించింది. మిగితా ప్రాంతాల్లో 20 శాతాని కంటే తక్కువగా ఆక్యుపెన్సీ నమోదైంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

హృదయపూర్వం సినిమా మలయాళంలో మంచి ఓపెనింగ్స్ నమోదు అయ్యాయి. కేరళ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీకి సుమారుగా 3 కోట్ల రూపాయలు, తమిళనాడులో 50 లక్షలు, కర్ణాటకలో 25 లక్షల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 20 లక్షల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఓవర్సీస్‌ కలెక్షన్ల వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ఈ సినిమా సుమారుగా 6 కోట్ల రూపాయలు ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమా రానున్న రోజుల్లో ఏ రేంజ్ లాభాలను సాధిస్తుందో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X