Hridayapoorvam Day 2 Collections: మోహన్ లాల్ హృదయపూర్వం రికార్డు.. 2వ రోజు కలెక్షన్లు ఎన్ని కోట్లంటే?

మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన లేటెస్ట్ రొమాంటిక్ డ్రామా ఫిల్మ్ హృదయపూర్వం. ఈ చిత్రాన్ని సత్యన్ అంతికాడ్ దర్శకత్వం వహించడం విశేషం. ఈ మలయాళ రొమాంటిక్ డ్రామాను ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ లో నిర్మాత ఆంటోనీ పెరుంబవూర్ నిర్మించారు. మోహన్‌లాల్ లో పాటు మాళవిక మోహనన్, సంగీత మాధవన్ నాయర్, సంగీత్ ప్రతాప్, సిద్ధిక్, లాలూ అలెక్స్, జనార్దనన్, సబితా ఆనంద్, బాబురాజ్, నిషాన్, ఎస్పీ చరణ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఆగస్టు 28 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా సినిమా బడ్జెట్? ప్రీ రిలీజ్ బిజినెస్? 2వ రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎన్ని కోట్లనే విషయానికొస్తే..

హృదయపూర్వం మూవీ బడ్జెట్?
స్టార్ హీరో మోహన్ లాల్ తోపాటు మలయాళ చిత్ర పరిశ్రమలో పేరొందిన నటీనటులు ఈ చిత్రంలో నటించడం. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించడంతో పాటు టాప్ టెక్నీషియన్లు పని చేశారు. సినిమాటోగ్రఫీగా అను మూతెడత్, ఎడిటర్‌గా కే రాజగోపాల్ వ్యవహరించడం విశేషం. నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యునరేషన్లు, నిర్మాణ ఖర్చులు, ప్రచార ఖర్చులన్నీ కలుపుకొని సినిమాకు రూ.30 కోట్ల బడ్జెట్ అయ్యిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు.

Hridayapoorvam Day 2 Box Office Collections Worldwide

హృదయపూర్వం మూవీ ప్రీరిలీజ్ బిజినెస్?
హృదయపూర్వం సినిమాకు అడ్వాన్డ్స్ టికెట్స్ ద్వారా రూ.1.60 కోట్లు కలెక్ట్ అయ్యిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. మరోవైపు ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ ద్వారా రూ.50 కోట్ల వరకు గ్రాస్ వసూల్ చేస్తే లాభాల్లోకి వస్తుందని ట్రేడ్ పండితులు వెల్లడిస్తున్నారు.

2 రోజుల్లో హృదయపూర్వం కలెక్షన్స్?
మలయాళం చిత్రం హృదయపూర్వం ఆగస్టు 28న మలయాళంతో పాటు కర్ణాటక, ఏపీ+తెలంగాణ, కేరళ తమిళనాడులో విడుదలైంది. ఓపెనింగ్ డే ఈ చిత్రానికి రూ.3.8 కోట్ల ఇండియా గ్రాస్, రూ.3.25 కోట్ల ఇండియా నెట్ వసూలైందని, ఓవర్సీస్ లో రూ.4.2 కోట్ల గ్రాస్ వసూలైందని సాక్ నిక్ రిపోర్ట్ ఇచ్చింది. టోటల్ గా రూ.8 కోట్ల గ్రాస్ వసూల్ చేయడం విశేషం. ఇక 2వ రోజు సాయంత్రం 6 గంటల వరకు రూ.2 కోట్ల ఇండియా నెట్ వసూలైందని, మిగిలిన షోలు కలుపుకొని రూ.5 కోట్ల వరకు ఇండియా నెట్, రూ.8 కోట్ల వరకు గ్రాస్ వసూల్ చేసి ఉంటుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

స్టేట్ వైజ్ గా..
హృదయపూర్వం చిత్రం ఆగస్టు 28న తెలంగాణ + ఏపీ లో రూ.3 లక్షలు, కర్ణాటకలో రూ.20 లక్షలు, తమిళనాడులో రూ.12 లక్షలు, మలయాళంలో రూ.3.3 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ.15 లక్షలు వసూలైందని సాక్ నిక్ రిపోర్ట్ ఇచ్చింది. టోటల్ గా రూ.3.8 కోట్ల నెట్ వసూలవ్వడం విశేషం.

మలయాళంలో రికార్డు..
మోహన్ లాల్ నటించిన హృదయపూర్వం రికార్డు క్రియేట్ చేసింది. మలయాళంలో మోహన్ లాల్ నటించిన చిత్రాల్లో హృదయపూర్వం టాప్ 5లో నిలిచింది. ఎల్2 : ఎంపురాన్ రూ.21 కోట్లు, తుడురమ్ రూ.5.30 కోట్లు, హృదయపూర్వం రూ.3.25 కోట్లు, బజూకా రూ.3.20 కోట్లు, అలప్పుజా జింఖానా రూ.2.75 కోట్లు మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు చేయడం విశేషం. హృదయపూర్వం టాప్ 3లో నిలిచింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X