Hridayapoorvam Day 3 Collections: 3వ రోజు హృదయపూర్వం కలెక్షన్స్.. మోహన్ లాల్ సినిమాకు ఎన్ని కోట్లంటే?
సౌత్ దిగ్గజ నటుడు, మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ లేటెస్ట్ ఫిల్మ్ రొమాంటిక్ డ్రామా ఫిల్మ్ హృదయపూర్వం. ఆగస్టు 28న మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైంది. సత్యన్ అంతికాడ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ లో రూపుదిద్దుకుంది. నిర్మాత ఆంటోనీ పెరుంబవూర్ నిర్మించారు. మోహన్‌లాల్ తోపాటు ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ మాళవిక మోహనన్, సంగీత మాధవన్ నాయర్, సంగీత్ ప్రతాప్, సిద్ధిక్, లాలూ అలెక్స్, జనార్దనన్, సబితా ఆనంద్, బాబురాజ్, నిషాన్, ఎస్పీ చరణ్ కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ చిత్రం బడ్జెట్ ఎన్ని కోట్లు? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? 3వ రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎన్ని కోట్లనే విషయానికొస్తే..
హృదయపూర్వం మూవీ బడ్జెట్?
స్టార్ హీరో మోహన్ లాల్ తోపాటు పలువురు స్టార్ కాస్ట్ ఈ చిత్రంలో నటించడం, సీనియర్ టెక్నీషియన్లు నటించడంతో సినిమాకు ఓ స్థాయిలో బడ్జెట్ అయ్యింది. నిర్మాత ఆంటోనీ పెరుంబవూర్ రూ.30 కోట్ల బడ్జెట్ ను వెచ్చించినట్టు ట్రేడ్ నిపుణులు వెల్లడిస్తున్నారు. నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యునరేషన్లు, చిత్ర నిర్మాణ ఖర్చులు, ప్రచార ఖర్చులన్నీ కలుపుకొని సినిమాకు ఈ స్థాయిలో పెట్టుబడి అయ్యిందని తెలుపుతున్నారు.

హృదయపూర్వం బ్రేక్ ఈవెన్ పాయింట్?
బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బాస్టర్ హిట్స్ అందుకుంటూ వస్తున్న స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన చిత్రం కావడంతో సినిమాకు కేరళలో మంచి బిజినెస్ జరిగిందని, మిగితా స్టేట్స్, ఓవర్సీస్‌లో ఓ మాదిరిగానే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక సినిమాకు అడ్వాన్డ్స్ టికెట్స్ ద్వారా రూ.1.60 కోట్లు వసూలైంది. కాగా, ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే రూ.50 కోట్ల వరకు గ్రాస్ వసూల్ చేయాలని ట్రేడ్ నిపుణులు విలువ కట్టారు.
హృదయపూర్వం 3 రోజుల వసూళ్లు?
ఓపెనింగ్ డే ఈ చిత్రానికి రూ.3.8 కోట్ల ఇండియా నెట్, 2వ రోజు రూ.3 కోట్లు ఇండియా నెట్ వసూలైందని సాక్ నిక్ వెల్లడించింది. ఇక 3వ రోజు సాయంత్రం 6 గంటల వరకు 1.60 కోట్ల రూపాయల ఇండియా నెట్ వసూలైంది. ఇక మిగిలిన షోలు కలుపుకొని సినిమా రూ.3 కోట్ల వరకు ఇండియా నెట్ కలెక్ట్ చేసి ఉంటుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
వరల్డ్ వైడ్ గా..
ఇప్పటి వరకు 2 రోజుల్లో హృదయపూర్వం చిత్రం కన్నడలో రూ.45 లక్షలు, తెలంగాణ+ఏపీలో రూ.6 లక్షలు, తమిళనాడులో రూ.24 లక్షలు, కేరళలో రూ.5.65 కోట్లు, రెస్టాఫ్ ఇండియా రూ.30 లక్షలు వసూలైందని సాక్ నిక్ గణాంకాలు తెలుపుతున్నాయి. ఇక వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం రూ.15 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది. ఇందులో ఇండియా గ్రాస్ రూ.6.7 కోట్లు, ఓవర్సీస్ లో రూ.8.3 కోట్లు వసూళ్లు చేసిందని ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి.


Click it and Unblock the Notifications











