Vikram Vedha day 2 collections హృతిక్ మూవీపై పొన్నియన్ సెల్వన్ దెబ్బ.. రెండో రోజు వసూళ్లు ఎంతంటే?
బాలీవుడ్ సూపర్ స్టార్లు హృతిక్ రోషన్, సైఫ్ ఆలీ ఖాన్ నటించిన విక్రమ్ వేద చిత్రం ఉత్తరాది ప్రేక్షకులపై పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నది. ఈ సినిమాపై సినీ విమర్శకులు సానుకూలంగా స్పందించినప్పటికి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించలేకపోతున్నది. తమిళంలో విజయవంతమైన విక్రమ్ వేదను హిందీలో రీమేక్ చేశారు. విజయ్ సేతుపతి, మాధవన్ చేసిన పాత్రలను హృతిక్, సైఫ్ ఆలీ ఖాన్ పోషించారు. ఈ సినిమా రెండో రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
ఫిల్మ్ క్రిటిక్స్ పాజిటివ్ రివ్యూలను ఇచ్చినప్పటికీ.. తొలి రోజు అంచనాలకు మించి కలెక్షన్లను సాధించలేకపోయింది. తొలి రోజున ఈ చిత్రం 10.58 కోట్ల వసూళ్లు రాబట్టింది. అయితే రెండో రోజు ఈ సినిమాకు పొన్నియన్ సెల్వన్ హిందీ వెర్షన్ గట్టిగానే దెబ్బ కొట్టింది.

విక్రమ్ వేద గత రెండు రోజుల్లో అమెరికాలో నమోదు చేసిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. రెండో రోజు 488 లొకేషన్లలో 310918 డాలర్లను రాబట్టింది. గత రెండు రోజుల్లో ప్రీమియర్లతో కలిపి ఈ సినిమా 680,403 డాలర్లు రాబట్టింది.
ఇక రెండో రోజున 30 శాతం వృద్దిని మాత్రమే సాధించి.. ప్రపంచవ్యాప్తంగా 13 కోట్లు రాబట్టంది. దాంతో గత రెండు రోజుల్లో 23.58 కోట్లు వసూలు చేసింది. అయితే ఈ సినిమా భారీ కలెక్షన్లు సాధిస్తుందనే ఆశించిన ట్రేడ్ పండితుల అంచనాలు తలకిందులయ్యాయి. ఆదివారం అడ్వాన్స్ బుకింగ్ కాస్త మెరుగ్గానే కనిపించింది. రానున్న రోజుల్లో మౌత్ టాక్ పెరిగి.. కలెక్షన్లు పెరుగుతాయో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











