Just In
Don't Miss!
- Lifestyle
మంగళవారం దినఫలాలు : ఈరోజు తొందరపాటు నిర్ణయం వల్ల మీరు ఆర్థికంగా నష్టపోవచ్చు...!
- News
మహారాష్ట్ర పంచాయతీ ఎన్నికలు: తెలంగాణలో కలుస్తామన్నవారే సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలుపు
- Finance
బంగారం ధర పెరిగింది, కానీ ఆ మార్క్‌కు దిగువనే: రూ.66,300 వద్ద వెండి ధరలు
- Sports
శెభాష్ సిరాజ్.. నీ ఆటను చూసి మీ తండ్రి గర్వపడుతాడు: మంత్రి కేటీఆర్
- Automobiles
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
‘ఐ’ మూవీ 5 రోజు కలెక్షన్ (ఏరియా వైజ్)
హైదరాబాద్: శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా వచ్చిన ‘ఐ' మూవీ... యావరేజ్ రివ్యూల రేటింగులోనూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. శంకర్ సినిమాలకు, విక్రమ్ పెర్ఫార్మెన్స్, ఏఆర్ రెహమాన్ సంగీతం లాంటి అంశాల మేళవింపు ఉండటంతో సినిమాను చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ చిత్రానికి ఆదరణ బాగా లభిస్తోంది. తొలి ఐదు రోజుల్లో ఈచిత్రం రూ. 20 కోట్లకుపైగా షేర్ సాధించడమే ఇందుకు నిదర్శనం. పండగ హాలిడేస్, గోపాల గోపాల మినహా బరిలో ఇతర పెద్ద సినిమాలేవీ లేక పోవడం కూడా సినిమా కలెక్షన్లు పెరగడానికి బాగా తోడ్పడ్డాయి.
శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విక్రమ్, అమీ జాక్సన్ హీరోయిన్లుగా నటించారు. ఆస్కార్ రవిచంద్రన్ నిర్మాత. ఆస్కార్ ఫిలింస్, మెగా సూపర్ గుడ్ పిలింస్ సంయుక్తంగా ఈచిత్రాన్ని తెలుగులో విడుదల చేసాయి. ఏఆర్ రెహమాణ్ అందించిన సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోరు, పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ సినిమాకు హైలెట్.

ఏరియా వైజ్ షేర్ వివరాలు
నైజాం: 7.10 కోట్లు
వైజాగ్: 1.85 కోట్లు
ఈస్ట్ : 1.73 కోట్లు
వెస్ట్: 1.50 కోట్లు
కృష్ణ: 1.31 కోట్లు
గుంటూరు: 1.97 కోట్లు
నెల్లూరు: 1.05 కోట్లు
సీడెడ్: 4.32 కోట్లు
తొలిరోజు షేర్: 7.29 కోట్లు
రెండో రోజు షేర్: 4.92 కోట్లు
మూడో రోజు షేర్: 3.53 కోట్లు
నాలుగో రోజు షేర్: 2.88 కోట్లు
ఐదో రోజు షేర్: 2.22 కోట్లు
ఐదురోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సాధించిన షేర్: 20.85 కోట్లు