Idly Kadai Advance Collections: షాకింగ్‌గా ధనుష్ మూవీ అడ్వాన్స్ బుకింగ్.. ఇడ్లీ కడాయ్ సినిమా కలెక్షన్లు ఎలా ఉన

టాలెంటెడ్ యాక్టర్ ధనుష్ నిర్మాతగా, దర్శకుడిగా మారి రూపొందించిన చిత్రం ఇడ్లీ కడాయ్ (తెలుగులో ఇడ్లీ కొట్టు). వంబర్‌బార్ ఫిల్మ్స్, డాన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో నిత్య మీనన్, అరుణ్ విజయ్, షాలిని పాండే, సత్యరాజ్, ఆర్ పార్తీబన్, పీ సముద్రఖని, రాజ్ కిరణ్ తదితరులు నటించారు. ధనుష్, ఆకాశ్ భాస్కరన్ కలిసి నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈ క్రమంలో ఇటీవల ఈ సినిమాను చెన్నైలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సినిమాపై సెన్సార్ బోర్డు అధికారులు వెల్లడించిన విషయాల్లోకి వెళితే..

ఎమోషనల్, ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. కిరణ్ కౌశిక్ సినిమాటోగ్రఫి, ప్రసన్న జీకే ఎడిటింగ్ బాధ్యతలను అందించారు. ఈ సినిమాకు కథను కూడా ధనుష్ అందించడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాను తమిళనాడులో రెడ్ జెయింట్ మూవీస్ రిలీజ్ చేస్తున్నది. ఈ సినిమా ప్రొడక్షన్ కాస్ట్, ధనుష్ రెమ్యునరేషన్, ఇతర యాక్టర్లు, సాంకేతిక నిపుణుల పారితోషికం అంతా కలిపి ఈ సినిమాను 110 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ చిత్రం 120 కోట్ల రూపాయల షేర్, 200 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్ల లక్ష్యంతో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.

Idly Kadai Advance Booking Collections

ఇక ఇడ్లీ కడాయ్ సినిమాకు నాన్ థియేట్రికల్ బిజినెస్ భారీగానే జరిగింది. ఈ సినిమాకు 45 కోట్ల రూపాయల మేర ఓటీటీ రైట్స్ అమ్ముడుపోయాయి. ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకొన్నది. మ్యూజిక్ రైట్స్ కూడా భారీగా అంటే 10 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. శాటిలైట్ రైట్స్ సుమారుగా 20 కోట్ల రూపాయల మేర జరిగాయి అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఈ సినిమా థియేట్రికల్ రైట్స్‌ను భారీగానే వాల్యూ కట్టారు. ఈ సినిమాను పలు భాషల్లో కమిషన్ బేస్ మీద రిలీజ్ చేస్తున్నట్టు సమాచారం.

అయితే ఈ సినిమా రిలీజ్‌కు ముందు కరూర్‌లో విజయ్ సభలో తీవ్ర విషాదం చోటుచేసుకొని 40 మంది వరకు చనిపోవడం అత్యంత విషాదంగా మారింది. ప్రజలంతా ఓ రకమైన ఎమోషన్‌కు గురై ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల రిలీజైన విజయ్ ఖుషీ రీ రిలీజ్ కూడా పండుగలా జరుపుకోలేకపోయారు. అలాగే వచ్చే సినిమాలపై కూడా అసక్తి చూపించే పరిస్థితి కనిపించడం లేదు. ఆ ఎఫెక్ట్ ప్రస్తుతం ఇడ్లీ కడై సినిమాపై పండిందనే విషయాన్ని ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్నది. ఇక కర్ణాటకలో కాంతార చాప్టర్ 1, తెలుగులో ఓజీ సినిమా ప్రభావం ఎక్కువగా కనిపిస్తున్నది.

ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇడ్లీ కడాయ్ చిత్రం బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. తమిళనాడులో ఈ చిత్రం 3.35 కోట్ల రూపాయలు, కేరళలో 7 లక్షలు, కర్ణాటకలో 19 లక్షలు, ఆంధ్రాలో 19 లక్షలు, తెలంగాణలో 13 లక్షలు, ఇతర ప్రాంతాల్లో 3 లక్షల రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వసూలు చేసింది. దాంతో సుమారుగా ఈ చిత్రం 4 కోట్ల రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఓవర్సీస్‌లో కూడా ధనుష్ మూవీ ప్రభావం చూపలేకపోయింది. ఈ చిత్రాన్ని 70 లోకేషన్లలో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేయగా.. 88 షోల ద్వారా 680 టికెట్లు అమ్మడం ద్వారా 10 వేల డాలర్లు అంటే.. 9 లక్షల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ప్రీమియర్లకు కూడా పెద్దగా స్పందన కనిపించడం లేదని పేర్కొన్నారు.

అయితే ఈ సినిమా రిలీజ్‌కు ముందు అంతగా ఆశాజనకంగా కనిపించలేదు. ఒకవేళ ఈ చిత్రం రిలీజైతే పబ్లిక్ టాక్ పాజిటివ్‌గా మారితే.. ఈ సినిమా కలెక్షన్లు పుంజుకొనే అవకాశం ఉంది. ఈ చిత్రం ధనుష్ కెరీర్‌లో ఎలాంటి ఫలితాన్ని నమోదు చేస్తుందనే విషయంపై ట్రేడ్ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X