Idly Kadai Day 2 Collections: నెగిటివ్ ట్రెండ్‌లో ఇడ్లీ కడాయ్ షాకింగ్ కలెక్షన్లు.. ధనుష్ మూవీకి ఎన్ని కోట్లంటే
టాలెంటెడ్ యాక్టర్ ధనుష్ నిర్మాతగా, దర్శకుడిగా మారి రూపొందించిన చిత్రం ఇడ్లీ కడాయ్ (తెలుగులో ఇడ్లీ కొట్టు). వంబర్‌బార్ ఫిల్మ్స్, డాన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో నిత్య మీనన్, అరుణ్ విజయ్, షాలిని పాండే, సత్యరాజ్, ఆర్ పార్తీబన్, పీ సముద్రఖని, రాజ్ కిరణ్ తదితరులు నటించారు. ధనుష్, ఆకాశ్ భాస్కరన్ కలిసి నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈ క్రమంలో ఇటీవల ఈ సినిమాను చెన్నైలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సినిమాపై సెన్సార్ బోర్డు అధికారులు వెల్లడించిన విషయాల్లోకి వెళితే..
ఎమోషనల్, ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. కిరణ్ కౌశిక్ సినిమాటోగ్రఫి, ప్రసన్న జీకే ఎడిటింగ్ బాధ్యతలను అందించారు. ఈ సినిమాకు కథను కూడా ధనుష్ అందించడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాను తమిళనాడులో రెడ్ జెయింట్ మూవీస్ రిలీజ్ చేస్తున్నది. ఈ సినిమా ప్రొడక్షన్ కాస్ట్, ధనుష్ రెమ్యునరేషన్, ఇతర యాక్టర్లు, సాంకేతిక నిపుణుల పారితోషికం అంతా కలిపి ఈ సినిమాను 110 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ చిత్రం 120 కోట్ల రూపాయల షేర్, 200 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్ల లక్ష్యంతో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.

ఇక ఇడ్లీ కడాయ్ సినిమాకు నాన్ థియేట్రికల్ బిజినెస్ భారీగానే జరిగింది. ఈ సినిమాకు 45 కోట్ల రూపాయల మేర ఓటీటీ రైట్స్ అమ్ముడుపోయాయి. ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకొన్నది. మ్యూజిక్ రైట్స్ కూడా భారీగా అంటే 10 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. శాటిలైట్ రైట్స్ సుమారుగా 20 కోట్ల రూపాయల మేర జరిగాయి అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఈ సినిమా థియేట్రికల్ రైట్స్‌ను భారీగానే వాల్యూ కట్టారు. ఈ సినిమాను పలు భాషల్లో కమిషన్ బేస్ మీద రిలీజ్ చేశారు.
ఇడ్లీ కడాయ్ చిత్రం ఫాదర్ సెంటిమెంట్ చిత్రంగా రూపొందింది. అయితే ఈ సినిమా నేటితరం ప్రేక్షకుల అభిరుచికి దూరంగా ఉందనే ఓపినియన్ నెటిజన్లు, క్రిటిక్స్ నుంచి వినిపించింది. ఫస్టాఫ్‌లో భావోద్వేగ సన్నివేశాలు ఆకట్టుకొనేలా ఉన్నాయి. కానీ సెకండాఫ్ అంతా రొటీన్, రెగ్యులర్, మూస ఫార్మాట్‌లో సాగడం ఈ సినిమాకు ప్రతికూలమైన అంశంగా మారింది అనే అభిప్రాయం వ్యక్తమైంది.
ధనుష్ నటించిన ఫ్యామిలీ డ్రామా చిత్రం తొలి రోజు టాక్‌తో సంబంధం లేకుండా గౌరవ ప్రదమైన వసూళ్లను నమోదు చేసింది. తొలి రోజు తమిళంలో 10.5 కోట్ల రూపాయలు, తెలుగులో 1 కోటి రూపాయలు, కన్నడలో 50 లక్షలు, కేరళలో 30 లక్షలు, ఇతర ప్రాంతాల్లో 10 లక్షలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం తొలి రోజున ఇండియాలో 12.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
ఇక రెండో రోజు కూడా ఇడ్లీ కడాయ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా నిలిచింది. తమిళంలో 10 కోట్ల రూపాయలు, తెలుగులో 1 కోటి రూపాయలు, వసూలు చేసింది. కన్నడలో 30 లక్షలు, కేరళలో 20 లక్షలు, ఇతర ప్రాంతాల్లో 20 లక్షల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం రెండో రోజు 11.7 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా రెండు రోజుల్లో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 24.2 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అయితే ఓవర్సీస్ డేటా ఇంకా అందాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











