Idly Kadai Day 4 Collections: కాంతార చాప్టర్ 1 ప్రభంజనంలోనూ నిలకడగా కలెక్షన్స్.. ఇడ్లీ కడాయ్‌‌కి ఎన్ని కోట్లంట

దక్షిణాదిలో నటుడిగా, సింగర్‌గా, నిర్మాతగా దూసుకెళ్తున్నారు ధనుష్. ఆయన దర్శకుడిగా మారి తెరకెక్కించిన చిత్రం ఇడ్లీ కడాయ్ తెలుగులో ఇడ్లీ కొట్టు. టాలెంటెడ్ నటి నిత్యమీనన్ ఇందులో ధనుష్‌కి హీరోయిన్‌గా నటించారు. అరుణ్ విజయ్, షాలిని పాండే, సత్యరాజ్, ఆర్ పార్తీబన్, పీ సముద్రఖని, రాజ్ కిరణ్ తదితరులు నటించారు. వంబర్‌బార్ ఫిల్మ్స్, డాన్ పిక్చర్స్ బ్యానర్‌పై ధనుష్, ఆకాశ్ భాస్కరన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. విజయదశమి కానుకగా అక్టోబర్ 1వ తేదీన ఇడ్లీ కడాయ్ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైంది. ఈ నేపథ్యంలో ఇడ్లీ కడాయ్ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? నాలుగో రోజు ఈ సినిమా ఎన్ని కోట్లు రాబట్టిందంటే?

ఇడ్లీ కడాయ్ బడ్జెట్ ఎంత?
ఇడ్లీ కడాయ్ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేశారు. కిరణ్ కౌశిక్ సినిమాటోగ్రఫి, ప్రసన్న జీకే ఎడిటింగ్ బాధ్యతలను అందించారు. ఈ సినిమాకు ధనుష్ స్వయంగా కథను అందించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి ఈ సినిమాకు 110 కోట్ల రూపాయల వ్యయమైంది. ఇడ్లీ కడాయ్ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 120 కోట్ల రూపాయల షేర్, 200 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టాలని ట్రేడ్ పండితులు వాల్యూ కట్టారు.

Idly Kadai Day 4 Box Office Collections Worldwide Dhanush Movie get good number

ఇడ్లీ కడాయ్ నాన్ థియేట్రికల్ బిజినెస్
ధనుష్ క్రేజ్, టీజర్, ట్రైలర్ల కారణంగా ఇడ్లీ కడాయ్ సినిమాకు నాన్ థియేట్రికల్ బిజినెస్ భారీగానే జరిగింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ దాదాపు 45 కోట్లకు పైగా వెచ్చించి దక్కించుకొన్నది. మ్యూజిక్ రైట్స్ 10 కోట్ల రూపాయలకు, శాటిలైట్ రైట్స్ 20 కోట్ల రూపాయలకు పైగా జరిగాయి. ఇడ్లీ కడాయ్‌పై ఉన్న అంచనాల నేపథ్యంలో ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 2100 థియేటర్‌లలో విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో 500 స్క్రీన్లు, తమిళనాడులో 600 స్క్రీన్లు, ఓవర్సీస్‌లో 1000 స్క్రీన్ల చొప్పున రిలీజ్ చేశారు.

ఇడ్లీ కడాయ్ మూడు రోజుల కలెక్షన్స్
ధనుష్ మూవీకి ఇండియాలో తొలి రోజున 11 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాగా.. రెండో రోజున 9.75 కోట్ల రూపాయలు, మూడో రోజున 5.6 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 6.15 కోట్ల రూపాయలు చొప్పున రాబట్టింది. దాంతో ఇండియాలో నాలుగు రోజుల్లో 26 కోట్ల రూపాయల నెట్.. 32.4 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది ఇడ్లీ కడాయ్. ఇక ఓవర్సీస్ కలెక్షన్స్ పరిశీలిస్తే.. నార్త్ అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూరప్, గల్ఫ్, యూకే తదితర దేశాలలో ఇడ్లీ కడాయ్‌కి 5 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఇడ్లీ కడాయ్ వసూళ్లు
ధనుష్‌కి తెలుగునాట ఉన్న ఫాలోయింగ్‌తో ఇడ్లీ కడాయ్‌కి చెప్పుకోదగ్గ కలెక్షన్స్ వచ్చాయి. అయితే పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ, రిషబ్ శెట్టి నటించిన కాంతార చాప్టర్ 1ల నుంచి ఈ సినిమాకు గట్టి పోటీ ఎదురుకావడంతో వసూళ్లు పడిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇడ్లీ కడాయ్‌కి తొలి రోజున 65 లక్షల రూపాయలు, రెండో రోజున 75 లక్షల రూపాయలు, మూడో రోజున 40 లక్షల రూపాయలు వచ్చాయి. ఇండియాలోని ప్రాంతాల వారీగా ఇడ్లీ కడాయ్ కలెక్షన్స్ పరిశీలిస్తే.. తమిళనాడులో 30.35 కోట్లు, తెలుగు రాష్ట్రాలో 2.15 కోట్లు రూపాయలు, ఓవర్సీస్‌లో 5 కోట్ల రూపాయలు, హిందీ + రెస్టాఫ్ ఇండియాలో 5 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి.

ఇడ్లీ కడాయ్ 4వ రోజు కలెక్షన్స్
దక్షిణాదిలో ఒక్క తమిళనాడులో మాత్రమే ఇడ్లీ కడాయ్ ఊపు చూపిస్తుండగా.. మిగిలిన ఏరియాలలో కాంతార చాప్టర్ 1, ఓజీ ప్రభావం బలంగా కనిపిస్తోంది. దీంతో ఇడ్లీ కడాయ్‌ కలెక్షన్స్‌పై ప్రభావం పడుతోంది. అయినప్పటికీ చెప్పుకోదగ్గ స్థాయిలో వసూళ్లు వస్తున్నాయి. నాలుగో రోజు తమిళనాడులో 5.8 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 35 లక్షల రూపాయలు చొప్పున ఇండియా వైడ్‌గా 6.15 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ధనుష్ చిత్రం నాలుగు రోజుల వరకు ఇండియాలో 32.5 కోట్ల రూపాయల నెట్, 38.4 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. వరల్డ్ వైడ్‌గా ఇప్పటి వరకు ఇడ్లీ కడాయ్ 43.4 కోట్ల రూపాయలు రాబట్టింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X