twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఊపందుకొన్న టాలీవుడ్ ఐదునెలల్లో ఎనిమిది హిట్లు..!

    By Sindhu
    |

    2011 తెలుగు సినిమాకు బాగానే ఉన్నట్లు ఉంది. ఈ ఏడాదిలో విడుదలైన పెద్ద హీరోల చిత్రాలు 'పరమవీర చక్ర", 'శక్తి", 'తీన్ మార్" ఘోరంగా నిరాశపరిచినప్పటికీ ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఏడెనిమిది చిత్రాలు ఘన విజయం సాధించి చిత్ర పరిశ్రమకు కొత్త ఊపిరినిచ్చాయి. 'అలా మొదలైంది" మొదలుకుని 'మిరపకాయ్", ప్రేమకావాలి", 'అహ నా పెళ్లంట" చిత్రాలు విజయవంతం కావడంతోపాటు, తాజాగా 'మిస్టర్ ఫర్ ఫెక్ట్", '100% లవ్" చిత్రాలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి..

    అంతే కాదు, నిన్న విడుదలైన స్ట్రెయిట్ సినిమా 'సీమటపాకాయ్"తో పాటు 'రంగం"అనే అనువాద చిత్రం కూడా హిట్ టాక్ తెచ్చుకోవడం పరిశ్రమ మేలు కోరేవారందరికీ సంతోషాన్నిస్తోంది. 'అలా మొదలైంది" చిత్రంతో నందినిరెడ్డి దర్శకురాలిగా పరిచయం కాగా, నిత్యామీనన్ హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయ్యింది కూడా ఆ చిత్రంతోనే. అలాగే 'ప్రేమకావాలి" చిత్రంతో సాయికుమార్ తనయుడు 'ఆది" అనే హీరో పరిచయం కావడంతోపాటు ఇషాచావ్లా అనే హీరోయిన్ తెలుగు తెరంగేట్రం చేసింది. అదేవిధంగా 'అహ నా పెళ్లంట" చిత్రం ద్వార వీరభద్రం అనే దర్శకుడు పరిచయం కాగా, అదే చిత్రం ద్వారా రీతూ బర్మేచా అనే భామ తెలుగు తెరపై తళుక్కుమంది.

    ఇక 'మిస్టర్ ఫర్ ఫెక్ట్" తో దశరథ్, '100% లవ్" తో సుకుమార్, 'సీమటపాకాయ్"తో జి నాగేశ్వర్ రెడ్డి ఫామ్ లోకి రావడం మరో విశేషం. కాబట్టి ఇప్పటివరకు చూస్తే టాలీవుడ్ లో ఎక్కువ శాతం మంచి జరిగినట్టేనని విశ్లేషకులు అంచనా....

    English summary
    Few years back, Telugu Film Industry used to make more money and more films than any other language in India. With over 150 films per year and 10% to 20% of hits, TFI used to be in the news….!
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X