twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ 'దూకుడు' కలెక్షన్స్ డ్రాప్?

    By Srikanya
    |

    మహేష్ బాబు దూకుడు చిత్రం చాలా చోట్ల కలెక్షన్స్ డ్రాప్ అంటూ వార్తలు వస్తున్నాయి. ఫిల్మ్ సర్క్లిల్స్ లోనూ, పలు వెబ్ సైట్స్ లోనూ ఈ విషయమై చర్చలు కూడా జరుగుతున్నాయి. మహేష్ అభిమానులు ఓ ప్రక్క ఖండిస్తూంటే..మిగతా హీరోల అభిమానులు కాదు..అంటూ రుజువులు చూపెడతాం అంటున్నారు. మరో ప్రక్క మగధీరను క్రాస్ చేసింది వార్త నిజం కాదంటున్నారు. అయితే నిజానికి దూకుడు సినిమాను ఎక్కువ ధియోటర్స్ లో విడుదల చేయటంతో దాదాపు మొదటి రెండు వారాల్లోనే చాలా మంది చూడటం జరిగింది. ఆ తర్వాత రిపీట్ ప్రేక్షకులు స్టార్ట్ అయ్యారు.దానకి తోడు ఊసరవెల్లి చిత్రం డ్రాప్ అవ్వటం కూడా దూకుడుకి అనూహ్యంగా కలిసి వచ్చింది. దీపావళి సీజన్ లో సైతం తెలుగులో పెద్ద సినిమాలు విడుదల కాలేదు.సూర్య సెవెంత్ సెన్స్, షారూఖ్ రావన్ విడదలైనా అవి భాక్సాఫీస్ వద్ద నిలబడలేదు.

    దాంతో కలెక్షన్స్ కొంత మేరకు తగ్గినా పూర్తిగా డ్రాప్ కాలేదు. అయితే ఈ రోజుల్లో వంద రోజుల వరకూ కలెక్షన్స్ నిలబడి, అన్ని ధియోటర్స్ అలాగే ఉంచాలంటే కేవలం రికార్డుల కోసం భరించాలే తప్ప కలెక్షన్స్ ఉండవనేది అందరికి తెలిసిన సత్యం. రికార్డుల కోసం ఉంచిన ధియోటర్ ఉన్న చోట్ల అప్పటికే చూడవలిసిన వారు అంతా రిపీట్ గా సైతం చూడటం జరిగింది. దాంతో మెల్లిగా కలెక్షన్స్ డ్రాప్ అవ్వటం సహజంగా జరిగుతోంది.అయితే విడుదల అయిన రోజునుంచి దూకుడు టీమ్ ఎగ్రిసివ్ గా కలెక్షన్స్ ప్రకటిస్తూ వచ్చారు. దానికి తోడు మహేష్ సైతం ట్విట్టర్ లో ఈ సినిమానే హైయిస్ట్ గ్రాసర్ అని ట్వీట్ చేయటంతో అందరి దృష్టి ఈ చిత్రం కలెక్షన్స్ పైనే కాన్సర్టేట్ అయ్యింది. ఇక ఈ చిత్రం యాఙై రోజుల పంక్షన్ ని విజయవాడలో జరపనున్నారు.దాని ఏర్పాట్లు గ్రాండ్ గా చేయటానికి నిర్మాతలు ఆ పనిలో నిమగ్నమయ్యారు.

    English summary
    Trade sources in film industry say that many Dookudu theatres haven’t recorded housefuls are running with a capacity of 50 to 45% occupancy.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X