Pushpa in Russia అల్లు అర్జున్ మూవీకి ఊహించని కలెక్షన్లు.. రష్యాలో ఎంత వసూలు చేసిందంటే?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప చిత్రం భారీ విజయాన్ని అందుకొన్నది. పాన్ ఇండియా చిత్రంగా రూపొందిన ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో అదరగొట్టే విధంగా కలెక్షన్లను రాబట్టింది. అయితే పుష్ప 2 ప్రారంభానికి ముందు ఈ సినిమాను రష్యాలో భారీ ఎత్తున రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా ఆశించినంతగా వసూళ్లు రాబట్టలేకపోవడం అభిమానులను నిరాశపరిచింది. రష్యాలో పుష్ప పరిస్థితి ఏమిటంటే?

ప్రపంచవ్యాప్తంగా పుష్ప భారీ కలెక్షన్లు
పుష్ప చిత్రం ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 17వ తేదీన 2021 రిలీజైంది. తొలి ఆట నుంచే బ్లాక్ బస్టర్ టాక్‌ను సొంతం చేసుకొన్నది. ఈ సినిమా దేశ్యవ్యాప్తంగా 275 కోట్ల కలెక్షన్లు వసూలు చేస్తుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 370 కోట్ల వసూళ్లను సాధించింది. 2021 సంవత్సరంలో రిలీజైన చిత్రాల్లో రికార్డు కలెక్షన్లు సాధించిన చిత్రంగా ఘనతను సంపాదించుకొన్నది.

రష్యాలో భారీగా రిలీజ్
పుష్ప సినిమా రిలీజ్ అనంతరం దాదాపు ఏడాది తర్వాత అంటే డిసెంబర్ 8 తేదీన రష్యాలో భారీ ఎత్తున రిలీజ్ చేశారు. ఈ సినిమా కోసం అల్లు అర్జున్, దేవీ శ్రీ ప్రసాద్, సుకుమార్, నిర్మాతలు, రష్మిక మందన్న తదితరులు రష్యాలో పర్యటించారు. పలు ప్రదేశాల్లో ప్రమోషన్స్ భారీగా చేశారు. పుష్ప ప్రమోషన్స్ స్థానికుల నుంచి భారీగా రెస్పాన్స్ కూడా వచ్చింది.

రష్యాలో బాక్సాఫీస్ రిపోర్టు ఎలా ఉందంటే?
అయితే రష్యన్ భాషలో రిలీజైన పుష్ప రైజింగ్ సినిమాకు బాక్సాఫీస్ వద్ద అంతగా స్పందన కనిపించకపోవడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ డబ్బింగ్ చిత్రానికి పెద్దగా స్పందన కనిపించలేదు. అయితే సుకుమార్, అల్లు అర్జున్ చేసిన ప్రయత్నాలు పెద్దగా సానుకూలంగా మారకపోవడం యూనిట్‌ను కొంత ఆందోళనకు గురిచేసింది.

కలెక్షన్లు రాబట్టడంలో
రష్యాలో పుష్ప: ది రైజ్ రిలీజైన తర్వాత కూడా చిత్ర యూనిట్ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ సినిమా పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోవడం వల్లే.. రష్యా బాక్సాఫీస్ వద్ద లెక్కలను విడుదల చేయలేదని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఈ సినిమా ద్వారా రష్యా మార్కెట్‌లోకి వెళ్లడం సానుకూల పరిమాణం. పుష్ప 2 సినిమాకు ఈ మార్కెటింగ్ బాగా ఉపయోగపడుతుంది అని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

పుష్పకు రష్యాలో ప్రతికూల పరిస్థితులు
అయితే పుష్ప: ది రైజ్ సినిమా రష్యాలో ఆడకపోవడానికి స్థానికంగా ఉన్న పరిస్థితులే అని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. దేశంలో నెలకొన్న ఆర్థిక మాంద్యం పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థ ప్రతికూలంగా ఉండటం లాంటి కారణాలను వెల్లడిస్తున్నారు. ఉక్రేయిన్, రష్యా మధ్య నెలకొన్న సంబంధాలు, టెన్షన్ వాతావరణం ప్రేక్షకులను ఈ సినిమాకు రప్పించలేకపోయాయని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.


Click it and Unblock the Notifications











