For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  జగ్గూభాయ్ అస్సలు తగ్గట్లేదుగా.. ఒకేసారి 9 సినిమాలు.. రెమ్యునరేషన్ ఎంతంటే?

  |

  తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం విలక్షణ నటుడిగా మంచి క్రేజ్ సంపాదించుకుంటున్న నటులలో జగపతి బాబు టాప్ లో ఉన్నారని చెప్పవచ్చు. తన తండ్రి ప్రఖ్యాత నిర్మాత విబి రాజేంద్ర ప్రసాద్ ఆశీస్సులతో మొదట హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన జగపతిబాబు ఎన్నో హిట్ సినిమాలతో ఫ్యామిలీ ఆడియెన్స్ కు దగ్గరయ్యాడు. మొదటి సినిమా స్వప్న లోకం సినిమా ద్వారా వెండితెరకి తెరంగేట్రం చేసిన జగపతి బాబు, ఆ మూవీతోనే మంచి పేరు అందుకున్నారు. అక్కడి నుండి తన సొంత టాలెంట్ తోనే మిగతా ప్రొడక్షన్ లలో కూడా సినిమా అవకాశాలు అందుకుంన్నారు.

  తెలుగు ప్రేక్షకుల మనసును చాలా దగ్గరైన మంచి నటులలో జగపతి బాబు ఒకరు. ముఖ్యంగా శుభలగ్నం, శుభాకాంక్షలు వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి ఫ్యామిలీ ఆడియన్స్ లో తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు అందుకున్నారు. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో ఆయన విలన్స్ సపోర్టింగ్ రోల్స్ తో జనాలకు మరింత దగ్గరవుతున్నారు. ఇక ప్రస్తుతం ఆయన 9 సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. ఇక ఆ సినిమాలకు రెమ్యునరేషన్ కూడా గట్టిగానే అందుకుంటున్నట్లు తెలుస్తోంది.

  Chiranjeevi lovely kiss to Pawan Kalyan: తమ్ముడిపై అంచంచలమైన ప్రేమను కురిపించిన మెగాస్టార్

  ఆ సినిమాతో భారీ క్రేజ్

  ఆ సినిమాతో భారీ క్రేజ్

  కొన్నేళ్లపాటు హీరోగానే కొనసాగిన జగపతి బాబు, 2014లో నటసింహం నందమూరి బాలయ్య హీరోగా బోయపాటి శ్రీను తీసిన బ్లాక్ బస్టర్ మూవీ లెజెండ్ లో విలన్ గా, జితేంద్ర పాత్రలో అద్భుతంగా నటించి ఆడియన్స్ లో ఒక విభిన్నమైన క్రేజ్ ను అందుకున్నాడు. ఇక ఆ తరువాత నుండి అటు నెగటివ్ పాత్రలతో పాటు కొన్ని సహాయక పాత్రలతో కూడా ఆకట్టుకున్న జగపతి బాబు ఎన్టీఆర్ హీరోగా వచ్చిన నాన్నకు ప్రేమతో, సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన విన్నర్, అలానే సూపర్ స్టార్ మహేష్ తో శ్రీమంతుడు, మహర్షి వంటి సినిమాల్లో అద్భుతమైన నటనతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నాడు.

  పాన్ ఇండియా సినిమాల్లో పవర్ఫుల్ రోల్స్

  పాన్ ఇండియా సినిమాల్లో పవర్ఫుల్ రోల్స్

  ఇక రామ్ చరణ్ హీరోగా సుకుమార్ తీసిన రంగస్థలం తరువాత జగపతిబాబు ఇండస్ట్రీలో మరింత బిజీగా మారారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సినిమాల్లో నటించిన జగపతి ప్రస్తుతం ఏకంగా తొమ్మిది బడా సినిమాల్లో అవకాశాలు అందుకోవడం సినిమా పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.

  ముందుగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ తీస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా సలార్ లో రాజమనార్ అనే నెగటివ్ రోల్ లో ఆయన నటించనున్నారు. ఇక నాని హీరోగా శివ నిర్వాణం తీస్తున్న ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ టక్ జగదీశ్ లో నాని కి పెద్దన్నయ్య పాత్రలో ఆయన కనిపించనున్నాడు.

  యువ హీరోలతో కూడా

  యువ హీరోలతో కూడా

  మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా యువ దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందుతున్న స్పోర్ట్స్ యక్షన్ మూవీ గనిలో కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. ఇక మరొక యువ దర్శకడు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా ఫస్ట్ టైం వెండితెరకు పరిచయం అవుతున్న మూవీలో కూడా పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. శ్రీమురళి హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా కన్నడలో తెరకెక్కుతున్న మదగజ మూవీ లో సైతం జగ్గూభాయ్ నెగటివ్ రోల్ చేస్తున్నారు.

  రజనీకాంత్ సినిమాలో పవర్ఫుల్ విలన్

  రజనీకాంత్ సినిమాలో పవర్ఫుల్ విలన్

  అలానే తొలిసారిగా సిద్దార్థ, శరవణన్ కలిసి ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి తీస్తున్న యాక్షన్, మాస్ ఎంటర్టైనర్ మహాసముద్రంలో ఒక కీలక రోల్ లో కనిపించనున్నట్లు ఇదివరకే క్లారిటీ ఇచ్చారు. యంగ్ హీరో నాగ శౌర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ లక్ష్యలో కూడా ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నట్లు ఒక పోస్టర్ ద్వారా తెలియజేశారు. అలానే మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ - దేవా కట్టా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పొలిటికల్ యాక్షన్ డ్రామా రిపబ్లిక్ లో కూడా నెగిటివ్ పాత్రలో నటిస్తున్నారట.ఇక వీటన్నిటితో పాటు సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ప్రముఖ దర్శకుడు శివ తీస్తున్న భారీ సినిమా అన్నాత్తే లో భయంకరమైన విలన్ పాత్ర చేయడానికి ఒప్పుకున్నాడు.

  మొత్తం 9 సినిమాలతో బిజీబిజీగా

  మొత్తం 9 సినిమాలతో బిజీబిజీగా

  ఇలా మొత్తంగా ప్రస్తతం జగ్గూ భాయ్ చేతిలో అయితే తొమ్మిది సినిమాలు ఉన్నాయి. నెవర్ బిఫోర్ అనేలా సూపర్ క్యారెక్టర్స్ లో నటిస్తున్న జగపతిబాబు ఈ పాత్రల ద్వారా మరింతగా గుర్తింపు దక్కించుకుని ఆపై మార్కెట్ స్థాయిని కూడా పెంచుకోవడం ఖాయం అని అంటున్నారు. నిర్మాతగా హీరోగా వరుస పరాజాయిలు అందుకోవడంతో ఆ మధ్య ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న జగపతి బాబు ఇప్పుడు మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్టుగా మాత్రం గట్టిగానే సంపాదిస్తున్నారు.

  Recommended Video

  Bazaar Rowdy Movie Heroine Maheshwari Exclusive Interview | Part 3
  రెమ్యునరేషన్ ఎంతంటే

  రెమ్యునరేషన్ ఎంతంటే

  డైలీ పేమెంట్ లెక్కన రెమ్యునరేషన్ అందుకున్న జగపతిబాబు ఒక్కో సినిమాకు మొత్తంగా కోటి నుంచి మూడు కోట్ల మధ్యలో ఆదాయాన్ని అందుకుంటున్నట్లు సమాచారం. మరోవైపు జగ్గు భాయ్ ఒక్కసారిగా ఇన్ని భారీ ఛాన్స్ లు అందుకోవడంతో వీటితో ఆయన మంచి సక్సెస్ లు అందుకోవాలని కోరుతూ ప్రత్యేకంగా పలువురు ప్రేక్షకులు, అభిమానులు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా శుభాభినందనలు తెలియచేస్తున్నారు.

  English summary
  Jagapathi babu goal movies in hands and remuneration per movie
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X