»   » జై లవకుశ నాన్ బాహుబలి రికార్డులు బ్రేక్.. వసూళ్ల దూకుడు..

జై లవకుశ నాన్ బాహుబలి రికార్డులు బ్రేక్.. వసూళ్ల దూకుడు..

Posted By:
Subscribe to Filmibeat Telugu
Jai Lava Kusa first day Collections ready to beat Baahubali బాహుబలికి ధీటుగా..

టాక్ ఎలా ఉన్నా, సమీక్షకుల రివ్యూలను పట్టించుకోకుండా జై లవకుశ చిత్రం కలెక్షన్ల పరంగా దూసుకుపోతున్నది. జై పాత్రలో అద్భుతమైన నటనను ప్రదర్శించిన ఎన్టీఆర్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ చిత్రం నాన్ బాహుబలి రికార్డులను తిరగరాస్తున్నది. దసరా పండుగ బరిలో దూకిన ఈ చిత్రం తొలుత డివైడ్ టాక్ సంపాదించుకున్నా ఆ తర్వాత కలెక్షన్ల పరంగా పుంజుకుంటున్నది.

130 కోట్ల వసూళ్లు

130 కోట్ల వసూళ్లు

జై లవకుశ చిత్రం విజయవంతంగా మూడోవారంలోకి ప్రవేశించింది. ఇప్పటికే సుమారు 130 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. ఎన్టీఆర్ కెరీర్‌లోనే రికార్డు కలెక్షన్లు సాధించిన జనతా గ్యారేజ్ వసూళ్లపై జై లవకుశ దృష్టిపెట్టింది. జనతా గ్యారేజ్ చిత్రం 134.8 కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే.

జీఎస్టీ తర్వాత 80 కోట్లు

జీఎస్టీ తర్వాత 80 కోట్లు

జై లవకుశ చిత్రం మరో ఘనతను సాధించింది. జీఎస్టీ తర్వాత అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రాల్లో జై లవకుశ ఒకటిగా నిలిచింది. జీఎస్టీ బిల్లు తర్వాత సుమారు 80 కోట్లు సాధించి నాన్ బాహుబలి రికార్డులను తుడిచిపెట్టింది.

జై లవకుశ కలెక్షన్లు ఏరియా వారీగా

జై లవకుశ కలెక్షన్లు ఏరియా వారీగా

జై లవకుశ చిత్రం సాధించిన రెండు వారాల కలెక్షన్లు ట్రేడ్ అనలిస్టులను నివ్వెరపాటుకు గురిచేస్తున్నాయి. తాజాగా లభ్యమవుతున్న రిపోర్టుల ప్రకారం జై లవకుశ చిత్రం నైజాంలో 16 కోట్లు, సీడెడ్‌లో 12 కోట్లు, ఉత్తరాంధ్రలో 7 కోట్లు, పశ్చిమ గోదావరి 4 కోట్లు, తూర్పు గోదావరిలో 6 కోట్లు, నెల్లూరులో 2.5 కోట్లు వసూలు చేసింది.

వందకోట్లకు చేరువలో..

వందకోట్లకు చేరువలో..

ఇక మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో జై లవకుశ కలెక్షన్లను పరిశీలిస్తే.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి చిత్రం గ్రాస్ 87 కోట్లు సాధించింది. కర్ణాటకలో 10 కోట్లు, అమెరికాలో 5 కోట్లు, ఇతర దేశాలలో 3 కోట్లు సాధించింది.

 150 కోట్ల క్లబ్‌లో..

150 కోట్ల క్లబ్‌లో..

కలెక్షన్లపరంగా ఇదే ఊపును జై లవకుశ కొనసాగిస్తే త్వరలోనే 150 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం లేకపోలేదు. అదే నిజమైతే, ఎన్టీఆర్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ గ్రాసర్‌గా జై లవకుశ ఓ రికార్డు సొంతం చేసుకొనే అవకాశం ఉంది. ఈ నెల 13 తేదీ వరకు భారీ చిత్రాలు లేకపోవడం జై లవకుశకు కలిసి వచ్చే అంశం. అప్పటివరకు ఇదే ఊపు కొనసాగితే జై లవకుశ డిస్టిబ్యూటర్లు లాభాల్లోకి చేరుకొనే అవకాశం కనిపిస్తున్నది.

English summary
Jai Lava Kusa collections looking good around the globe. This movie has joined in 100 crores club. This movie doing good in US business too. This movie reached tollywoods land mark. Jai Lava kusa emerged as biggest hit in NTR career.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu