»   »  జై లవకుశ కలెక్షన్ల మోత.. వంద కోట్ల దిశగా దూసుకెళ్తున్న ఎన్టీఆర్

జై లవకుశ కలెక్షన్ల మోత.. వంద కోట్ల దిశగా దూసుకెళ్తున్న ఎన్టీఆర్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Jai Lava Kusa will cross Rs 100crore mark over the weekend

జై లవకుశ చిత్రం రిలీజైన రెండో రోజు కూడా కలెక్షన్ల మోత మోగించింది. ఎన్టీఆర్ చేసిన త్రిపాత్రాభినయానికి, ముఖ్యంగా జై పాత్రకు లభిస్తున్న విశేష ఆదరణతో వసూళ్లపరంగా జై లవకుశ దూసుకెళ్తున్నది. ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లను సాధించే చిత్రంగా నమోదయ్యే అవకాశం కనిపిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి మంచి స్పందన కనిపిస్తున్నది. రెండో రోజు అందిన రిపోర్టుల ప్రకారం ఈ చిత్రం త్వరలోనే వంద కోట్ల క్లబ్‌లో చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

మిలియన్ మార్క్

మిలియన్ మార్క్

అమెరికాలో జై లవకుశ భారీ వసూళ్లను సాధిస్తున్నది. తొలి మెట్టుగా ఒక మిలియన్ డాలర్ వసూళ్ల మార్కును అధిగమించింది. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ కెరీర్‌లో వరుసగా నాలుగో హిట్ నమోదైంది. శని, ఆదివారాల్లో ఈ చిత్రం మరిన్ని వసూళ్లను సాధిస్తే రెండు మిలియన్ డాలర్లను అధిగమించడం ఖాయం.

బాహుబలి, ఖైదీ నంబర్ 150

బాహుబలి, ఖైదీ నంబర్ 150

ఈ ఏడాది రిలీజైన బాహుబలి2, ఖైదీ నంబర్ 150 చిత్రాల సరసన జై లవకుశ నిలువనున్నది. తొలిరోజున భారీ వసూళ్లను సాధించిన ఈ చిత్రం రెండో రోజునాటికి మొత్తంగా 80 కోట్ల రూపాయలను వసూళు చేసినట్టు ట్రేడ్ అనలిస్టులు పేర్కొంటున్నారు.

 100 కోట్ల దిశగా..

100 కోట్ల దిశగా..

బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి. తొలి వారాంతం ముగిసే సమయానికి ఈ చిత్రం 100 కోట్ల మార్కును అధిగమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే ఎన్టీఆర్ కెరీర్‌లో అతి వేగంగా వంద కోట్లను సాధించిన చిత్రంగా జై లవకుశ ఓ రికార్డును సొంతం చేసుకుంటుంది.

తొలిరోజున..

తొలిరోజున..

జై లవకుశ మొదటి రోజు కలెక్షన్లు ఇలా ఉన్నాయి. ఏపీ, తెలంగాణలో 21 కోట్లు షేర్ నమోదు కాగా, కర్ణాటకలో 3.83 కోట్లు, అమెరికాలో 2.64 కోట్లు, తమిళనాడులో 40 లక్షలు, మిగితా రాష్ట్రాల్లో 50 లక్షలు, మిగితా దేశాల్లో 1.10 కోట్లు వచ్చాయి. మొత్తం కలిపి తొలి రోజున రూ.30.12 కోట్లు (నికరం) వచ్చినట్టు సమాచారం.

మూడు పాత్రల్లో..

మూడు పాత్రల్లో..

జై, లవ, కుశ మూడు పాత్రలతో అలరించిన ఎన్టీఆర్ సరసన రాశీ ఖన్నా, నివేదా థామస్ హీరోయిన్లుగా నటించారు. తమన్నా ఐటెం పాటలో మెరిసింది. బాలీవుడ్ నటుడు రోనిత్ రాయ్ విలన్‌గా కనిపించాడు.

English summary
Jai Lava Kusa has received a fantastic response at the box office, Reports suggested that The film has raced past the Rs 50-crore mark at the domestic box office, and reports suggest that it has raked in over Rs 80 crore worldwide. Jai Lava Kusa has already crossed $1 million at the US box office, becoming Jr NTR's fifth film to do so, after Baadshah, Temper, Nannaku Prematho and Janatha Garage. It remains to be seen if the film will cross the Rs 100-crore mark over the weekend.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu