Don't Miss!
- Finance
ధనిక దేశంలో ఇంధన సంక్షోభం.. గ్యాస్ బిల్లులు చెల్లించేందుకూ అవస్థలు
- News
చైనాకు అమెరికా భారీ షాక్ - కూల్చివేత..!!
- Sports
విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ మధ్య విభేదాలు నిజమే: మాజీ ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Avatar 2 Day 2 Collections: కొనసాగుతున్న 'అవతార్ 2' కలెక్షన్ల సునామీ.. తొలి రోజుకు మించి వసూళ్లు!
అవతార్ అనే సినిమాతో యావత్ ప్రపంచం మొత్తం దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు లెజండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్. 2009లో విడుదలైన ఈ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పండోరా అనే సరికొత్త గ్రహాన్ని సృష్టించి.. వింతలు, అద్భుతాలతో ఆద్యంతం విజువల్ వండర్ గా తెరకెక్కించారు. ఇప్పుడు సినీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న అవతార్ సీక్వెల్ మూవీ Avatar: The Way Of Water (Avatar 2) ఎట్టకేలకు విడుదల అయింది. మంచి టాక్ తోపాటు కలెక్షన్ల పరంగా దూసుకుపోతున్న అవతార్ 2 రెండో రోజు ఎంత రాబట్టగలదనే వివరాల్లోకి వెళితే..

రెండో రోజు ఆక్యుపెన్సీ వివరాలు..
అవతార్ 2 సినిమా ఇండియాలో తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో 3D, 2D ఇలా వివధ టెక్నాలజీతో గ్రాండ్ గా విడుదలైంది. ఈ సినిమా ఇండియాలో రెండో రోజు తెలుగు 3D థియేటర్ ఆక్యుపెన్సీ ఉదయం 44.69%, మధ్యాహ్నాం 60.92%, సాయంత్రం 78.15% గా నమోదైనట్లు తెలుస్తోంది. అంటే షోలు పెరిగే కొద్ది ఆక్యూపెన్సీ శాతం కూడా క్రమంగా పెరుగుతోందని అర్థమవుతోంది. అలాగే హైదరాబాద్ లో 75%, బెంగళూరులో 49.67%, చెన్నై 100%, వరంగల్ 39.67%, కరీంనగర్ 56%, నిజమాబాద్ 59.67% శాతంగా ఆక్యూపెన్సీ నమోదు అయినట్లు సమాచారం.

ఇంగ్లీషు భాషలో ఆక్యుపెన్సీ డీటెయిల్స్..
ఇక ఇంగ్లీష్ భాషలో ఐమాక్స్ 3D ఆక్యూపెన్సీ ముంబై 86.50%, పూణె 81%, బెంగళూరు 92.50, కోల్ కతా 89%, చెన్నై 90% శాతంగా రెండో రోజు ఉండనుంది. అలాగే ఉదయం షోలు 88.50% కాగా, మధ్యాహ్నం వచ్చేసరికి 90.58 శాతంగా నమోదైనట్లు తెలుస్తోంది. ఇక Avatar: The Way Of Water మూవీ దానికున్న క్రేజ్ ని బట్టి ఇండియాలో సుమారు 4500 స్క్రీన్స్ లలో విడుదల చేసినట్లు సమాచారం.

ఇండియాలో రెండో రోజు వచ్చేది..
చంద్రగ్రహంల కనిపించే పండోరా గ్రహంపై ఉన్న సహజవనరులను కొల్లగొట్టాలనే ప్లాన్‌తో అమెరికా సైన్యం స్థానిక నావీ తెగపై దాడులకు పాల్పడే కథకు కొనసాగింపుగా అవతార్: ది వే ఆఫ్ ది వాటర్ సినిమా తెరకెక్కింది. ఈ అవతార్ 2 ఇండియాలో రెండో రోజు అంటే శనివారం రోజున రూ. 41 కోట్లకుపైగా వసూళ్లు సాధించనుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తంగా భారతదేశంలో అవతార్ 2 సినిమా రెండు రోజుల్లో రూ. 86 కోట్లకుపైగా వసూళ్లను సాధించనునుందని సమాచారం.

భారత్ లో తొలి రోజు కలెక్షన్స్..
అవతార్ 2 సినిమా తొలి రోజు ఆట నుంచి పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ యాత్రను ప్రారంభించింది. ఇండియాలో ఇంగ్లీష్ వెర్షన్ రూ. 20 కోట్లు, హిందీ రూ. 10 కోట్లు కలెక్ట్ చేయగా తెలుగులో రూ. 5 కోట్లు, తమిళంలో కోటి రూపాయల షేర్ సాధించింది. మొత్తంగా తొలి రోజు దేశవ్యాప్తంగా రూ. 38 కోట్ల షేర్ సాధించింది. అయితే అవెంజర్స్ సాధించిన కలెక్షన్లను మాత్రం అధిగమించలేక పోవడం గమనార్హం.

ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ డే వసూళ్లు..
జేమ్స్ కామెరాన్ మరో అద్భుత సృష్టి అవతార్ 2 సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను నమోదు చేసింది. ఉత్తర అమెరికాలో తొలి రొజున 55 మిలియన్ డాలర్లు అంటే.. రూ. 455 కోట్లు, మిగతా దేశాల్లో సుమారు రూ. 400 కోట్లు, చైనాలో 27 మిలియన్ డాలర్లు అంటే.. రూ. 200 కోట్ల మేరకు వసూళ్లు సాధించింది. దీంతో అవతార్ 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా 136 మిలియన్ డాలర్లు కలెక్షన్లను అంటే దాదాపుగా రూ. 1,116 కోట్ల వసూళ్లను సాధించడం రికార్డుగా మారింది.