Don't Miss!
- News
mother: కూతురితో కలిసి ఆత్మహత్య చేసుకున్న తల్లి, అంగన్ వాడి టీచర్ ఇంట్లో ?
- Finance
7th cpc: ప్రభుత్వ ఉద్యోగులకు పెరగనున్న జీతాలు.. ఎప్పుడు, ఏమేమి పెరుగుతాయో తెలుసా..!
- Sports
అయ్యర్ స్థానంలో అతన్ని ఆడించండి.. శుభ్‌మన్ గిల్ మాత్రం వద్దు: దినేశ్ కార్తీక్
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Avatar 2 Day 4 Collections: అవతార్ 2కి కూడా సోమవారం ఎఫెక్ట్.. సగానికి పడిపోయిన కలెక్షన్స్!
సాధారణంగానే హాలీవుడ్ చిత్రాలకు భారీ స్థాయిలో స్పందన దక్కుతూ ఉంటుంది. అందులోనూ గ్రాఫిక్స్, హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్ తో రూపొందిన సినిమాలను ప్రేక్షకులు మరింతగా ఆదరిస్తుంటారు. అలా పదమూడేళ్ల క్రితం వచ్చి సంచలన విజయాన్ని అందుకున్న సినిమా 'అవతార్'. ప్రపంచవ్యాప్తంగా రికార్డులు కొల్లగొట్టిన ఈ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిందే 'అవతార్: ది వే ఆఫ్ వాటర్'. వరల్డ్ వైడ్‌గా ఊహించని రీతిలో బజ్‌ను ఏర్పరచుకున్న ఈ మూవీకి అనుకున్నట్లుగానే రెస్పాన్స్ దక్కుతోంది. ఫలితంగా దీనికి వసూళ్లు పోటెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో 'అవతార్ 2' 4 రోజుల కలెక్షన్ల అంచానపై ఓ లుక్కేస్తే!

అవతార్ 2 బడ్జెట్ ఎంతంటే?
అవతార్ అనే సినిమాతో యావత్ ప్రపంచం మొత్తం దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు లెజండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్. పండోరా అనే సరికొత్త గ్రహాన్ని సృష్టించి.. వింతలు, అద్భుతాలతో ఆద్యంతం విజువల్ వండర్ గా తెరకెక్కించారు. ఇప్పుడు సినీ లవర్స్ ఎంతగానో ఎదురుచూసిన అవతార్ సీక్వెల్ మూవీ Avatar: The Way Of Water (Avatar 2) ఎట్టకేలకు విడుదల అయింది. విజువల్ వండర్‌గా తెరకెక్కిన ఈ సినిమా దాదాపుగా 350 నుంచి 400 మిలియన్ డాలర్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కింది.

4వ రోజు ఆక్యుపెన్సీ వివరాలు..
అవతార్
2
సినిమా
ఇండియాలో
తెలుగు,
తమిళం,
కన్నడ,
హిందీ,
ఇంగ్లీష్
భాషల్లో
3D,
2D
ఇలా
వివధ
టెక్నాలజీతో
గ్రాండ్
గా
విడుదలైంది.
ఈ
సినిమా
ఇండియాలో
నాలుగో
రోజు
తెలుగు
3D
థియేటర్
ఆక్యుపెన్సీ
ఉదయం
14.23%,
మధ్యాహ్నాం
23.33%,
సాయంత్రం
40.66%
గా
నమోదైనట్లు
తెలుస్తోంది.
అయితే
సోమవారం
కారణంగా
ఆక్యుపెన్సీ
శాతం
కాస్త
తగ్గినట్లు
తెలుస్తోంది.
అలాగే
హైదరాబాద్
లో
29%,
బెంగళూరులో
8.67%,
చెన్నై
28%,
వరంగల్
20.33%,
గుంటూరు
37%,
కరీంనగర్
36%,
నిజమాబాద్
23.67%
శాతంగా
ఆక్యూపెన్సీ
నమోదు
అయినట్లు
సమాచారం.

ఇంగ్లీషు భాషలో ఆక్యుపెన్సీ డీటెయిల్స్..
ఇక ఇంగ్లీష్ భాషలో ఐమాక్స్ 3D ఆక్యూపెన్సీ ముంబై 13.33%, పూణె 15.67%, బెంగళూరు 16%, హైదరాబాద్ 28.33%, కోల్ కతా 16.67%, చెన్నై 39.33% శాతంగా నాలుగో రోజు ఉండనుంది. అలాగే ఉదయం షోలు 12.81% కాగా, మధ్యాహ్నం వచ్చేసరికి 17.41 శాతంగా, సాయంత్రం 24.42%, నమోదైనట్లు తెలుస్తోంది. ఇక Avatar: The Way Of Water మూవీ దానికున్న క్రేజ్ ని బట్టి ఇండియాలో సుమారు 4500 స్క్రీన్స్ లలో, ప్రపంచవ్యాప్తంగా 17000 లొకేషన్లలో విడుదల చేసినట్లు సమాచారం.

ఇండియాలో నాలుగో రోజు వచ్చేది..
చంద్రగ్రహంల కనిపించే పండోరా గ్రహంపై ఉన్న సహజవనరులను కొల్లగొట్టాలనే ప్లాన్‌తో అమెరికా సైన్యం స్థానిక నావీ తెగపై దాడులకు పాల్పడే కథకు కొనసాగింపుగా అవతార్: ది వే ఆఫ్ ది వాటర్ సినిమా తెరకెక్కింది. ఈ అవతార్ 2 ఇండియాలో నాలుగో రోజు అంటే సోమవారం రోజున రూ. 18.50 కోట్లకుపైగా వసూళ్లు సాధించనుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తంగా భారతదేశంలో అవతార్ 2 సినిమా నాలుగు రోజుల్లో రూ. 147.30 కోట్లకుపైగా నెట్ కలెక్షన్స్ సాధించనునుందని సమాచారం.

భారత్ లో 4 రోజుల వసూళ్లు..
హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో రూపొందిన 'అవతార్ ది వే ఆఫ్ వాటర్' సినిమాకు భారతదేశవ్యాప్తంగా భారీ రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా దీనికి మొదటి రోజు రూ. 41 కోట్లు, రెండో రోజు రూ. 45 కోట్లు, మూడో రోజు రూ. 43.40 కోట్లు వచ్చాయి. ఇలా 3 రోజుల్లో రూ. 129.40 కోట్లు నెట్ కలెక్షన్లు వచ్చాయి. అంతేకాదు, రూ. 151.44 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసి రికార్డులు నమోదు చేసుకుంది.

వరల్డ్ వైడ్ గా 4 రోజుల్లో వచ్చింది ఎంతంటే?
హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరాన్ తెరకెక్కించిన 'అవతార్ ది వే ఆఫ్ వాటర్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు పోటెత్తుతున్నాయి. ఫలితంగా వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా వీకెండ్‌లోనే రూ. 3500 కోట్ల మైలురాయిని దాటింది. ఇలా మూడు రోజుల్లో 435 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 3597.87 కోట్లు వసూలు చేసింది. తద్వారా రూ. 3448 కోట్లు నెట్‌ను రాబట్టింది.