Jolly LLB 3 Box Office: 1500 కోట్ల రూపాయల టార్గెట్.. క్రేజీ రికార్డ్‌పై అక్షయ్ కుమార్ గురి!

హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు బాలీవుడ్ సూపర్‌స్టార్ అక్షయ్ కుమార్. ఏడాదికి ఖచ్చితంగా మూడు, నాలుగు సినిమాలతో ఆయన ఖచ్చితంగా పలకరిస్తారు. ఈ ఏడాది ఇప్పటికే స్కై ఫోర్స్, కేసరి చాప్టర్ 2, హౌస్‌ఫుల్ 5, కన్నప్ప చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. తాజాగా ఆయన నటించిన చిత్రం జాలీ ఎల్ఎల్‌బీ 3. సూపర్‌ హిట్ కామెడీ ఫ్రాంచైజీ జాలీ ఎల్ఎల్‌బీ సిరీస్‌లో భాగంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాతో ఓ బాక్సాఫీస్ రికార్డ్‌పై అక్షయ్ కన్నేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

సెప్టెంబర్ 19న జాలీ ఎల్ఎల్‌బీ 3
సుభాష్ కపూర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అర్ష్ వార్సీ, సౌరభ్ శుక్లా, హ్యుమా ఖురేషి, అమృతరావు, సీమా బిశ్వాస్, శిల్పా శుక్లా తదితరులు కీలకపాత్రలు పోషించారు. సెప్టెంబర్ 19న జాలీ ఎల్ఎల్‌బీ 3 వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయ్యింది. జాలీ ఎల్ఎల్‌బీ 3కి అమన్ పటేల్, అనురాగ్ సైకియా, విక్రమ్ మోన్‌ట్రోస్‌, మంగేష్ దక్డేలు సంగీతం అందించగా.. రంగరాజన్ రాంభద్రన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. స్టార్ స్టూడియో 18, కంగ్రా టాకీస్ బ్యానర్‌లపై అలోక్ జైన్, అజిత్ అంధారేలు సంయుక్తంగా జాలీ ఎల్ఎల్‌బీ 3ని నిర్మించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందోనని ట్రేడ్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

Jolly LLB 3 Box Office Akshay Kumar eyes on 1500 crore mark club for his comedy franchises

అడ్వాన్స్ బుకింగ్‌లో అక్షయ్ దూకుడు
సాక్‌నిక్ డేటా ప్రకారం.. అడ్వాన్స్ బుకింగ్‌లో జాలీ ఎల్ఎల్‌బీ 3 దుమ్మురేపుతోంది. మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా 5 కోట్ల రూపాయలను వసూలు చేసినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. బుకింగ్స్‌లో 24 గంటల్లోనే ఏకంగా 70 శాతం వృద్ధిని సాధించినట్లు నిపుణులు చెబుతున్నారు. రిలీజ్‌‌కు ముందు రోజు ఇండియా వైడ్‌గా ఏకంగా 66 వేలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. మొత్తం ప్రీ సేల్స్‌లో 30 శాతంతో ఢిల్లీ ముందంజలో ఉండగా.. మహారాష్ట్ర, గుజరాత్ తదితర చోట్ల కూడా సాలీడ్ బుకింగ్స్ జరుగుతున్నాయి. తొలిరోజు జాలీ ఎల్ఎల్‌బీ వరల్డ్ వైడ్‌గా 16 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.

ఐదు కామెడీ ఫ్రాంచైజీలతో జోష్
కెరీర్‌లో ఎన్నో చిత్రాల్లో నటించిన అక్షయ్ కుమార్.. ప్రస్తుతం ఐదు కామెడీ ఫ్రాంచైజీలను లీడ్ చేస్తున్నాడు. అవి హేరా ఫేరి, జాలీ ఎల్‌ఎల్‌బీ, ఓఎంజీ 2, వెల్కమ్, హౌస్‌ఫుల్. ఈ ఐదు ఫ్రాంచైజీలలో కలిపి 13 సినిమాలను అక్షయ్ విడుదల చేశారు. హేరా పేరి 12.36 కోట్ల రూపాయలు, పిర్ హేరా పేరి 41 కోట్ల రూపాయలు, ఓఎంజీ 81.5 కోట్ల రూపాయలు, ఓఎంజీ 2 రూ. 150 కోట్లు, జాలీ ఎల్ఎల్‌బీ 32 కోట్ల రూపాయలు, జాలీ ఎల్‌ఎల్‌బీ 2 రూ. 117 కోట్ల రూపాయలు, వెల్‌కమ్ రూ 71.25 కోట్ల రూపాయలు, వెల్‌కమ్ బ్యాక్ 97 కోట్ల రూపాయలు, హౌస్‌ఫుల్ 74.40 కోట్ల రూపాయలు, హౌస్‌ఫుల్ 2 రూ. 114 కోట్ల రూపాయలు, హౌస్‌ఫుల్ 3 రూ.107.70 కోట్ల రూపాయలు, హౌస్‌ఫుల్ 4 రూ. 206 కోట్ల రూపాయలు, హౌస్‌ఫుల్ 5 రూ.198.41 కోట్ల రూపాయలు వసూలు చేశాయి.

1500 కోట్ల రూపాయల టార్గెట్
మొత్తంగా ఈ 13 చిత్రాలు కలిపి వరల్డ్ వైడ్‌గా దాదాపు 1302 కోట్ల రూపాయలను వసూలు చేశాయి. మరో 200 కోట్ల రూపాయలు వసూళ్లు సాధిస్తే అక్షయ్ కుమార్ కామెడీ ఫ్రాంచైజీలు 1500 కోట్ల మార్క్‌ను అందుకుంటాయి. అయితే వీటిలో జాలీ ఫ్రాంచైజీలో కామెడీ పాళ్లు ఎక్కువగా ఉంటుందని విశ్లేషకులు చెబుతుంటారు. ఈ నేపథ్యంలో హిట్ టాక్ కనుక వస్తే జాలీ ఎల్ఎల్‌బీ 3 వసూళ్లను ఆపడం ఎవరి తరము కాదని అక్షయ్ కుమార్ అభిమానులు చెబుతున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ ఫుల్ స్వింగ్‌లో ఉండటంతో జాలీ ఎల్ఎల్‌బీ 3 నిర్మాతలు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X