Jolly LLB 3 Day 1 Box Office: జాలీ ఎల్ఎల్‌బీ 3 కలెక్షన్స్.. అక్షయ్ కుమార్ మూవీకి ఫస్ట్ డే ఎన్ని కోట్లంటే?

బాలీవుడ్ సూపర్‌స్టార్ అక్షయ్ కుమార్ లేటెస్ట్ మూవీ జాలీ ఎల్ఎల్‌బీ 3. సూపర్‌ హిట్ కామెడీ ఫ్రాంచైజీ జాలీ ఎల్ఎల్‌బీ సిరీస్‌లో భాగంగా ఈ సినిమా తెరకెక్కింది. సుభాష్ కపూర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అర్ష్ వార్సీ, సౌరభ్ శుక్లా, హ్యుమా ఖురేషి, అమృతరావు, సీమా బిశ్వాస్, శిల్పా శుక్లా తదితరులు కీలకపాత్రలు పోషించారు. సెప్టెంబర్ 19న జాలీ ఎల్ఎల్‌బీ 3 వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయ్యింది. ఈ నేపథ్యంలో జాలీ ఎల్ఎల్‌బీ 3 బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? తొలిరోజు అక్షయ్ కుమార్ మూవీ ఎన్ని కోట్ల కలెక్షన్స్ రాబట్టిందో పరిశీలిస్తే..

జాలీ ఎల్ఎల్‌బీ 3 బడ్జెట్?
జాలీ ఎల్ఎల్‌బీ 3కి అమన్ పటేల్, అనురాగ్ సైకియా, విక్రమ్ మోన్‌ట్రోస్‌, మంగేష్ దక్డేలు సంగీతం అందించగా.. రంగరాజన్ రాంభద్రన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. స్టార్ స్టూడియో 18, కంగ్రా టాకీస్ బ్యానర్‌లపై అలోక్ జైన్, అజిత్ అంధారేలు సంయుక్తంగా జాలీ ఎల్ఎల్‌బీ 3ని నిర్మించారు. ముంబైతో, పలు దేశాల్లోని అందమైన లోకేషన్స్‌లోని ఈ సినిమా షూటింగ్ జరుపుకుంది. టాలెంటెడ్ టెక్నీషియన్స్ ఈ సినిమా కోసం భాగమయ్యారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రచార కార్యక్రమాలతో కలిపి జాలీ ఎల్ఎల్‌బీ 3 సినిమాకు సుమారు 120 కోట్ల బడ్జెట్ అయినట్లుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

Jolly LLB 3 Day 1 Expected Box Office Collections Worldwide Akshay Kumar s movie good start at GBOC

జాలీ ఎల్ఎల్‌బీ 3 బ్రేక్ ఈవెన్ టార్గెట్
జాలీ ఎల్ఎల్‌బీ, జాలీ ఎల్ఎల్‌బీ 2ల తర్వాత వస్తోన్న సినిమా కావడంతో పాటు టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో ఈ సినిమాపై చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి. కామెడీ కంటెంట్‌తో ఎప్పుడు వచ్చినా అక్షయ్ కుమార్ ఫెయిల్ కాలేదు. ఈ నేపథ్యంలో జాలీ ఎల్ఎల్‌బీ 3కి మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన సమాచారం తెలియాల్సి ఉంది.

అడ్వాన్స్ బుకింగ్‌లో అక్షయ్ దూకుడు
సాక్‌నిక్ డేటా ప్రకారం.. అడ్వాన్స్ బుకింగ్‌లో జాలీ ఎల్ఎల్‌బీ 3 హవా చూపిస్తోంది. మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఈ చిత్రం 3.23 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసినట్లు సాక్‌నిక్ తెలిపింది. అక్షయ్ కుమార్ మూవీకి ప్రీ సేల్స్‌లోనే 1.2 లక్షల టికెట్లు అమ్ముడైనట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇది జాలీ ఎల్ఎల్‌బీ 3కి శుభసూచికమని చెబుతున్నారు. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన సితారే జమీన్ పర్ రెండు నెలల క్రితం అడ్వాన్స్ బుకింగ్ ద్వారా 3.31 కోట్ల రూపాయల బుకింగ్స్‌ను నమోదు చేసింది.

జాలీ ఎల్ఎల్‌బీ 3 తొలి రోజు కలెక్షన్స్
జాలీ ఎల్‌ఎల్‌బీ 3కి తొలి రోజు బాగానే బుకింగ్స్ జరిగినట్లుగా నివేదికలు వస్తున్నాయి. పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్‌తో అక్షయ్ కుమార్ తన బాక్సాఫీస్ జర్నీ ప్రారంభించారు. ఈ సినిమా సాయంత్రం 4 గంటల వరకు అక్షయ్ కుమార్ మూవీకి 11 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లుగా సాక్‌నిక్ తెలిపింది. సాయంత్రం 4 గంటల వరకు ఢిల్లీలో 1012 షోలు, ముంబైలో 669 షోలు, పుణేలో 259 షోలు, అహ్మదాబాద్‌లో 541, సూరత్‌లో 292 షోలు ప్రదర్శితమయ్యాయి. ఫస్ట్ షో, సెకండ్ షోలకు బుకింగ్స్ అదిరిపోతాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో తొలిరోజు అక్షయ్ కుమార్ మూవీ వరల్డ్ వైడ్‌గా 15 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాబడుతుందని భావిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X