Jolly LLB 3 Day 10 Box Office: 10 రోజుల్లో జాలీ ఎల్ఎల్‌బీ కలెక్షన్లు.. అక్షయ్ కుమార్ మూవీకి నష్టాలు.. ఎన్ని క
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని అగ్ర హీరో అక్షయ్ కుమార్ లేటెస్ట్ ఫిల్మ్ జాలీ ఎల్ఎల్‌బీ 3. ఈ చిత్రం జాలీ ఎల్ఎల్‌బీ కామెడీ ఫ్రాంఛైజీ నుంచి గతంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన జాలీ ఎల్ఎల్‌బీ 2కి సీక్వెల్‌గా రూపుదిద్దుకుంది. ఈ ఫ్రాంఛైజీకి ప్రేక్షకల నుంచి మంచి ఆదరణ దక్కుతోంది. కాగా ఈ మూవీలో అక్షయ్ కుమార్, అర్షద్ వార్సీ ప్రధాన పాత్రలు పోషించారు. సుభాష్ కుమార్ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 19న వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల మార్క్ ను దాటింది. కాగా ఈ చిత్రం బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? 10 రోజుల్లో ఎన్ని కోట్ల వసూళ్లను సాధించింది? ఇంకెన్ని కోట్లు రాబట్టాల్సి ఉందనే వివరాల్లోకి వెళితే..
జాలీ ఎల్ఎల్‌బీ 3 బడ్జెట్? బ్రేక్ ఈవెన్ టార్గెట్?
బాలీవుడ్ స్టార్ కాస్ట్ అక్షయ్ కుమార్, అర్షద్ వార్సీ, సౌరభ్ శుక్లా, హ్యుమా ఖురేషి, అమృతరావు, సీమా బిశ్వాస్, శిల్పా శుక్లా వంటి ప్రముఖులు నటించడం, టాప్ టెక్నీషియన్లు రంగరాజన్ రాంభద్రన్ సినిమాటోగ్రఫీగా, చంద్ర శేఖర్ ప్రజాపాటి ఎడిటింగ్ బాధ్యతలను చూశారు. అమన్ పటేల్, అనురాగ్ సైకియా, విక్రమ్ మోన్‌ట్రోస్ సాంగ్స్ అందించగా, మంగేష్ దక్డేలు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందించడం విశేషం.

స్టార్ స్టూడియో 18, కంగ్రా టాకీస్ బ్యానర్‌లపై నిర్మాతలు అలోక్ జైన్, అజిత్ అంధారేలు గ్రాండ్ గా నిర్మించారు. ఈ చిత్రానికి రూ.120 కోట్ల బడ్జెట్ ను ఖర్చు చేశారని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే వరల్డ్ వైడ్ గా రూ.200 కోట్ల గ్రాస్ వసూల్ చేయాల్సి ఉంటుందని ట్రేడ్ నిపుణులు విలువ కట్టారు.
10 రోజుల్లో జాలీ ఎల్ఎల్‌బీ 3 కలెక్షన్స్..
ఓపెనింగ్ డే రూ.12.5 కోట్ల ఇండియా నెట్, 2వ రోజు రూ.20 కోట్లు, 3వ రోజు రూ.21 కోట్లు, 4వ రోజు రూ.5.5 కోట్లు, 5వ రోజు రూ.6.5 కోట్లు, 6వ రోజు రూ.4.5 కోట్లు, 7వ రోజు రూ.4 కోట్లు, 8వ కోట్లు రూ.3.75 కోట్లు, 9వ రోజు రూ.6.5 కోట్లు, 10వ రోజు రూ.6.25 కోట్ల ఇండియా నెట్ వసూల్ చేసిందని సాక్ నిక్ గణాంకాలు తెలుపుతున్నాయి. ఇలా 10 రోజుల్లో ఇండియా నెట్ రూ.91 కోట్లకు చేరుకుంది.
వరల్డ్ వైడ్ గా..
జాలీ ఎల్ఎల్‌బీ 3 చిత్రం మొదటి 5 రోజుల్లోనే రూ.102 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ ను వసూల్ చేసింది. ఇక ఆ తర్వాత నుంచి 5 రోజులు వసూళ్లు భారీగా తగ్గాయి. మళ్లీ 2వ వీకెండ్ వసూళ్లు జోరు పెరిగింది. డే వైజ్ కలెక్షన్లు చూస్తే అర్థమవుతంది. ఇక 10 రోజుల్లో ఈ చిత్రం ఇండియా నెట్ రూ.91 కోట్లకు చేరుకోగా, ఇండియా గ్రాస్ రూ.110 కోట్లు, ఓవర్సీస్ లో రూ.27 కోట్లు గ్రాస్ వసూల్ చేసిందని సాక్ నిక్ గణాంకాలు తెలుపుతున్నాయి. దీంతో ఇండియా గ్రాస్ + ఓవర్సీస్ వసూళ్లు కలుపుకొని రూ.137 కోట్ల వరకు వరల్డ్ వైడ్ గా గ్రాస్ వసూలైంది. ఇక ఈ చిత్రం నష్టాలను తప్పించుకోవాలంటే ఇంకా రూ.65 కోట్ల వరకు గ్రాస్ వసూల్ చేయాలని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు.


Click it and Unblock the Notifications











