Jolly LLB 3 Day 2 Box Office: రెండో రోజు అక్షయ్ హవా.. జాలీ ఎల్‌ఎల్‌బీ 3 కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?
సుభాష్ కుమార్ దర్శకత్వంలో ఖిలాడీ అక్షయ్ కుమార్ హీరోగా నటించిన చిత్రం జాలీ ఎల్ఎల్‌బీ 3. సూపర్ హిట్ కామెడీ ఫ్రాంచైజీ జాలీ ఎల్ఎల్‌బీ సిరీస్‌లో భాగంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో అర్షద్ వార్సీ, సౌరభ్ శుక్లా, హ్యుమా ఖురేషి, అమృతరావు, సీమా బిశ్వాస్, శిల్పా శుక్లా తదితరులు కీలకపాత్రలు పోషించారు. సెప్టెంబర్ 19న జాలీ ఎల్ఎల్‌బీ 3 ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో జాలీ ఎల్ఎల్‌బీ 3 బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? 2వ రోజు అక్షయ్ కుమార్ మూవీ ఎన్ని కోట్ల కలెక్షన్స్ రాబట్టిందో పరిశీలిస్తే..
జాలీ ఎల్ఎల్‌బీ 3 బడ్జెట్?
జాలీ ఎల్ఎల్‌బీ 3కి అమన్ పటేల్, అనురాగ్ సైకియా, విక్రమ్ మోన్‌ట్రోస్, మంగేష్ దక్డేలు సంగీతం అందించగా.. రంగరాజన్ రాంభద్రన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. స్టార్ స్టూడియో 18, కంగ్రా టాకీస్ బ్యానర్‌లపై అలోక్ జైన్, అజిత్ అంధారేలు సంయుక్తంగా జాలీ ఎల్ఎల్‌బీ 3ని నిర్మించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రచార కార్యక్రమాలతో కలిపి జాలీ ఎల్ఎల్‌బీ 3 సినిమాకు సుమారు 120 కోట్ల బడ్జెట్ అయినట్లుగా బాలీవుడ్ వర్గాలు తెలిపాయి.

జాలీ ఎల్ఎల్‌బీ 3 బ్రేక్ ఈవెన్ టార్గెట్
కామెడీ కంటెంట్‌తో పాటు టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో జాలీ ఎల్ఎల్‌బీ 3పై చిత్ర పరిశ్రమలో మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ఈ నేపథ్యంలో జాలీ ఎల్ఎల్‌బీ 3కి వరల్డ్ వైడ్‌గా మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. అక్షయ్ కుమార్ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు. జాలీ ఎల్ఎల్‌బీ 3పై ఉన్న అంచనాల నేపథ్యంలో ఈ మూవీని వరల్డ్ వైడ్‌గా 3500 స్క్రీన్‌లలో రిలీజ్ చేయగా.. తొలిరోజున ఏకంగా 12000 షోలు ప్రదర్శితమయ్యాయి.
జాలీ ఎల్ఎల్‌బీ 3 తొలి రోజు కలెక్షన్స్
అక్షయ్ కుమార్ మూవీకి తొలి రోజున అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఏకంగా 3.50 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి. మొదటి రోజు జాలీ ఎల్ఎల్‌బీ 3 మూవీకి వరల్డ్ వైడ్‌గా 16 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ వచ్చాయి. తద్వారా కోవిడ్ 19 తర్వాత విడుదలైన అక్షయ్ కుమార్ మూవీస్‌లో టాప్ 10 బెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రాల్లో జాలీ ఎల్ఎల్‌బీ 3 7వ స్థానంలో నిలిచింది. సూర్యవంశీ 26.29 కోట్ల కలెక్షన్స్‌తో ఈ లిస్ట్‌లో టాప్‌లో నిలిచింది.
జాలీ ఎల్ఎల్‌బీ 3 రెండో రోజు కలెక్షన్స్
పాజిటివ్ రివ్యూలు, మౌత్‌తో టాక్‌తో రెండో రోజు అక్షయ్ కుమార్ మూవీకి మంచి బుకింగ్స్ జరుగుతున్నట్లు నివేదికలు వస్తున్నాయి. వీకెండ్ కావడంతో యువత, ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. దాంతో శనివారం జాలీ ఎల్ఎల్‌బీ 3 చిత్రానికి మరో 1000 షోలు అదనంగా పెంచినట్లుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దాంతో రెండో రోజు జాలీ ఎల్ఎల్‌బీ 3 మూవీకి 11,430 షోలు ప్రదర్శితమవుతాయని భావిస్తున్నారు. శనివారం అక్షయ్ కుమార్ సినిమాకు సాయంత్రం 7 గంటల వరకు 25 శాతం మేర థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లుగా సాక్‌నిక్ తెలిపింది. జాలీ ఎల్ఎల్‌బీ 3 మూవీ రెండో రోజు వరల్డ్ వైడ్‌గా 17 కోట్ల రూపాయల గ్రాస్ రాబడుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో రెండ్రోజుల వరకు అక్షయ్ కుమార్ మూవీకి 32 కోట్ల రూపాయల వసూళ్లు వస్తాయని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











