Jolly LLB 3 Day 6 Box Office: 5 రోజుల్లోనే 100 కోట్లు.. జాలీ ఎల్ఎల్‌బీ 3 6వ రోజు కలెక్షన్లు.. మొత్తం ఎన్ని కోట
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ జాలీ ఎల్ఎల్‌బీ 3. జాలీ ఎల్ఎల్‌బీ కామెడీ ఫ్రాంఛైజీలో జాలీ ఎల్ఎల్‌బీ 2కి సీక్వెల్‌గా రూపుదిద్దుకున్న చిత్రమే ఇది. స్టార్ హీరో అక్షయ్ కుమార్, అర్షద్ వార్సీ ప్రధాన పాత్రల్లో నటించారు. డైరెక్టర్ సుభాష్ కుమార్ దర్శకత్వం వహించడం విశేషం. ఈ చిత్రం సెప్టెంబర్ 19న వరల్డ్ వైడ్‌గా భారీ స్థాయిలో విడుదలైంది. ఈ క్రమంలో జాలీ ఎల్ఎల్‌బీ 3 మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? 6వ రోజు ఎన్ని కోట్ల కలెక్షన్స్ వచ్చాయనే వివరాల్లోకి వెళితే..
జాలీ ఎల్ఎల్‌బీ 3 బడ్జెట్ ఎంత?
ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, అర్షద్ వార్సీతో పాటు సౌరభ్ శుక్లా, హ్యుమా ఖురేషి, అమృతరావు, సీమా బిశ్వాస్, శిల్పా శుక్లా ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి అమన్ పటేల్, అనురాగ్ సైకియా, విక్రమ్ మోన్‌ట్రోస్, మంగేష్ దక్డేలు సంగీతం అందించారు. రంగరాజన్ రాంభద్రన్ సినిమాటోగ్రఫీని అందించారు. స్టార్ స్టూడియో 18, కంగ్రా టాకీస్ బ్యానర్‌లపై నిర్మాతలు అలోక్ జైన్, అజిత్ అంధారేలు రూపొందించారు. వరల్డ్ వైడ్‌గా 3500 స్క్రీన్‌లలో రిలీజ్ చేశారు. ఇలా నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యునరేషన్లు, నిర్మాణ ఖర్చులు, ప్రచార వ్యయం కలుపుకొని సినిమాకు రూ.120 కోట్ల బడ్జెట్ అయ్యిందని బాలీవుడ్ ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు.

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?
అక్షయ్ కుమార్ వంటి స్టార్ హీరో, జాలీ ఎల్ఎల్‌బీ మూవీ క్రేజ్ తోపాటు ప్రమోషనల్ మెటీరియల్ టీజర్, ట్రైలర్ అదిరిపోవడంతో జాలీ ఎల్ఎల్‌బీ 3పై మంచి బజ్ ఏర్పడింది. దీంతో మూవీకి వరల్డ్ వైడ్‌గా ప్రీ రిలీజ్ బిజినెస్ అయ్యిందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. మొత్తానికి సినిమా లాభాల్లోకి రావాలంటే రూ.200 కోట్ల రూపాయల గ్రాస్ వసూల్ చేయాలని బాక్సాఫీస్ లక్ష్యం నిర్ణయించారు.
5 రోజుల్లో జాలీ ఎల్ఎల్‌బీ 3 కలెక్షన్స్..
తొలిరోజు ఈ జాలీ ఎల్ఎల్‌బీ 3 చిత్రానికి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ దక్కడం విశేషం. దీంతో థియేట్రికల్ రన్ ఆశించిన స్థాయిలోనే జరుగుతోంది. ఇదే స్థాయిలో బాక్సాఫీస్ వసూళ్లు కూడా అందుతున్నాయి. ఓపెనింగ్ డే రూ.12.5 కోట్ల ఇండియా నెట్, 2వ రోజు రూ.20 కోట్లు, 3వ రోజు రూ.21 కోట్లు, 4వ రోజు రూ.5.5 కోట్లు, 5వ రోజు రూ.6.5 కోట్ల ఇండియా నెట్ వసూలైందని సాక్ నిక్ గణంకాలు తెలుపుతున్నాయి.
6వ రోజు వసూళ్లు..
సెప్టెంబర్ 24న బుధవారం వర్కింగ్ డే అయినప్పటికీ ఈ చిత్రానికి ఓ మాదిరి రెస్పాన్స్ దక్కుతోంది. మార్నింగ్ షోస్ 7%, ఆఫ్టర్‌నూన్ షోస్ 11% థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు కావడం విశేషం. ఈ క్రమంలో రెండు ఆటలకు కలిపి రూ.1.50 కోట్ల ఇండియా నెట్ వసూలైందని సాక్ నిక్ ఏర్లీ బాక్సాఫీస్ రిపోర్ట్ తెలుస్తోంది. ఇక మిగితా రెండు ఆటలు కలుపుకొని 6వ రోజు రూ.4 కోట్ల ఇండియా నెట్, రూ.6 కోట్ల ఇండియా గ్రాస్ వసూల్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
వరల్డ్ వైడ్ గా ఎంత వసూలైందంటే?
ఈ చిత్రం కేవలం 5 రోజుల్లోనే రూ.101.5 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ ను వసూల్ చేసింది. ఇందులో ఇండియా నెట్ రూ.65.5 కోట్లు, ఇండియా గ్రాస్ రూ.78.5 కోట్లు, ఓవర్సీస్ లో రూ.23 కోట్లు గ్రాస్ వసూల్ చేసిందని సాక్ నిక్ వెల్లడించింది.


Click it and Unblock the Notifications











