»   » పవన్ రికార్డ్ బ్రేక్, మహేష్ ది కష్టం

పవన్ రికార్డ్ బ్రేక్, మహేష్ ది కష్టం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బ్యాడ్ మౌత్ టాక్, ఏవరేజ్ రివ్యూలతో ఉన్నా ఎన్టీఆర్ తాజా చిత్రం "నాన్నకు ప్రేమతో" భాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ గా ఉంది. ఓవర్ సీస్ మార్కెట్ లో తన స్టామినా ఏంటో ఆయన చూపారు. యుఎస్ లో ధర్డ్ హైయిస్ట్ గ్రాసర్ గా ఈ చిత్రం నిలిచింది.

పవన్ కళ్యాణ్ ..అత్తారింటికి దారేది చిత్రం రికార్డ్ లను యుఎస్ లో బ్రద్దలు కొట్టింది. అత్తారింటికి దారేది..1.89 మిలియన్ డాలర్స్ తో రికార్డ్ క్రియేట్ చేయగా, నాన్నకు ప్రేమతో చిత్రం ఆదివారం సాయింత్రం నాటికే 1.89 మిలియన్ డాలర్లను రీచ్ అయ్యింది. అంటే ఈ రోజు నుంచి వచ్చే కలెక్షన్స్ రికార్డ్ ని బ్రేక్ చేసిన తర్వాత వచ్చినవే అని చెప్పచ్చు.


అయితే ట్రేడ్ లో అందుతున్న అంచనాలు ప్రకారం...మహేష్ బాబు చిత్రం "శ్రీమంతుడు" రికార్డ్ అయిన $2.81ని బ్రద్దలు కొట్టడం కష్టమోమో అంటున్నారు. అమెరికాలో మంచు తుఫాన్ రాకపోతే ...సాధ్యమయ్యేది అంటున్నారు. అలాగే బాహుబలి రికార్డ్ లను కూడా ఈ చిత్రం బ్రద్దలు కొట్టలేదని చెప్తున్నారు.


Jr NTR beats Pawan, falls behind Mahesh, Prabhas

తను నటించిన ‘నాన్నకు ప్రేమతో' చిత్రం ఇంత విజయం సాధించడానికి నాలుగు మూలస్తంభాలు వున్నాయని, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, సుకుమార్, నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్‌లే ఆ నలుగురు అని, వారు లేకపోతే ఈ చిత్రం ఇంత గొప్పగా రూపొందేది కాదని, అంతే విజయాన్ని సాధించేది కాదని హీరో ఎన్టీఆర్ తెలిపారు.


సుకుమార్ దర్శకత్వంలో శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర ఎల్.ఎల్.పి పతాకంపై రకుల్‌ప్రీత్‌సింగ్, ఎన్టీఆర్ జంటగా రూపొందిన ‘నాన్నకు ప్రేమతో' విడుదలైంది.


ఎన్టీఆర్ మాట్లాడుతూ... సుకుమార్, తాను ఒక మంచి సినిమా జీవితాంతం గుర్తుండిపోయేలా చేయాలనుకున్నామని, తన 25వ చిత్రం ఇంత మంచి అనుభూతి మిగిల్చినందుకు సంతోషంగా వుందని తెలిపారు. సినిమా హిట్ అయిందా లేదా, ఎంత కలెక్ట్ చేసిందని కాకుండా, వెనక్కితిరిగి చూసుకుంటే ఓ మంచి సినిమా తీశామన్న గర్వం వుండాలని, ఆ కోవకు ఈ చిత్రం చెందుతుందని ఆయన అన్నారు. దేవిశ్రీ తన సంగీతంతో, విజయ్ తన విజువల్స్‌తో ప్రాణం పోశారని, రాజీవ్ కనకాల, అవసరాల శ్రీనివాస్ లాంటి వాళ్లు ఇచ్చిన సపోర్టు ముఖ్యంగా ఈ చిత్రానికి ప్లస్ అయిందని ఆయన అన్నారు.

English summary
"Nannaku Prematho" smashed Pawan Kalyan's Attarintiki Daaredi records in America.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu