twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘బాలీవుడ్’ బాక్సాఫీస్ ప్రభంజనం..

    |

    ముంబై: యూత్ ఫుల్ కలెక్షన్లతో బాలీవుడ్ బాక్సాఫీస్ జులై మాసానికి గాను బంపర్ రికార్డును సొంతం చేసుకుంది. జూలైలో అభిమానులు ముందుకు వచ్చని ఢిల్లీ బెల్లీ, జందగీ నా మైల్ దొబారా, మర్డర్ - 2, సింఘం చిత్రాలు బాలీవుడ్ ను లాభాల బాట నడిపించాయి. ఒక్క జూలై నెలలోనే బాలీవడ్ బాక్సాఫీస్ కలెక్షన్లు రూపంలో రూ. 210 కోట్లు వసూలు చేసింది.

    జూన్ లో విడుదలైన రెడీ, డబుల్ దమాల్ సినిమాలు హిట్ టాక్ తెచ్చుకోవటంతో వాటి కలెక్షన్ల వర్షం జూలైలోనూ కొనసాగుతోంది. ఒక్క జూలై నెలలోనే రూ.210కోట్లు కలెక్షన్లు వసూలు చేయటం బాలీవుడ్ బాక్సాఫీస్ చరిత్రలో రికార్డని విశ్లేషకుడు సునీల్ వాద్వా అన్నాడు. కలెక్షన్ల శాతం జూలై 2010లో 80 శాతం ఉంటే జులై 2011 మాత్రం 105 శాతం కలెక్షన్లను వసూలు చేసి కొత్త రికార్డును సృష్టించింది.

    2011 మొదటి హాఫ్ కలెక్షన్లలో 40 శాతం వసూళ్లు రాబట్టిన సల్మాన్ ఖాన్ చిత్రం 'రెఢీ" జూలైలో 26 శాతం వసూళ్లను రాబట్టేందకు సహకరించింది. పెద్ద వారికే మాత్రమే అన్న ఫిల్మ్ బోర్డు నిబంధనలతో విడుదలైన అమీర్ ఖాన్ ఢిల్లీ బెల్లీ, మోహిత్ సూరి మర్డర్ -2 , పూరి జగన్నాధ్ బుడ్డా హోగా తెరా బాప్ చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది.

    జూలైలో చోటు చేసుకున్న ముంబయ్ దాడులు బాలీవుడ్ పై అంతగా ప్రభావం చూపలేదు. 'జిందగీ నా మిలేగా దొబారా" , 'హ్యారీ పోర్టర్" వంటి సినిమాలను విడుదల చేసేందకు నిర్మాతులు, ఎగ్జిబిటర్లు కాస్త బయపడ్డారు. అయితే అనూహ్య పరిణామాల మధ్య విడుదలైన ఈ చిత్రాలు కలెక్షన్ల వర్షం కురిపించాయి.

    సిని వర్గ విశ్లేషకుడు తరణ్ ఆదర్ష్ మాట్లాడుతూ జూలైలో విడుదలైన ప్రతి సినిమా రికార్డులు తిరిగరాసిందన్నారు. ఈ నెల వారాంతపు కలెక్షన్లను పరిశీలిస్తే రూ.120 కోట్లకు తగ్గకుండా ఉన్నాయని విశ్లేషించారు. సినిమాలకు ఉన్న ఆదరణ నేపధ్యంలో టికెట్టు ధరలు 15శాతం పెరిగినప్పటికి ప్రేక్షకుల స్పందన ఏ మాత్రం తగ్గటం లేదు.

    జూలై మాసానికి సంబంధించి అని మల్టీ ప్లెక్స్ హాళ్లు మొదటి మూడ వారాల్లోనే తమ టార్గెట్ లను పూర్తి చేసాయని. 4వ వారంలో వచ్చే కలెక్షన్లన్ని వారికి లాభాలేనని ఆపరేషన్ హెడ్ విశాల్ ఆనంద్ తెలిపారు. కలెక్షన్ల పరంగా జూలై నెలకు ఢిల్లీ బెల్లీ తొలి స్థానంలో ఉండగా మిగిలిన సినిమాలు అందకు సహకరించాయని ఆయన తెలిపారు.

    English summary
    No July in Bollywood's box-office history has raked in as much profits as this month has. Peg it to the youthful appeal of Delhi Belly and Zindagi Na Mile Dobara or the bloody rage of Murder 2 and Singham, but July 2011 brought business worth Rs 210 crore.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X