K Ramp Day 10 Collections:‌ దుమ్మురేపుతోన్న కిరణ్ అబ్బవరం.. కే ర్యాంప్ 10 వ రోజు కలెక్షన్ ఎన్ని కోట్లంటే?

K Ramp Box Office Collection: టాలీవుడ్‌లో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మరోసారి తన సత్తా చాటుకున్నారు. ఎప్పుడూ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకుల మనసు గెలుచుకునే ఈ యువ హీరో, తాజాగా విడుదలైన "కే ర్యాంప్ (K Ramp)" సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించారు. అక్టోబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుని, దీపావళి సీజన్ అడ్వాంటేజ్, కిరణ్ అబ్బవరం యూత్ ఫాలోయింగ్, స్ట్రాంగ్ వర్డ్ ఆఫ్ మౌత్ కలిసి సినిమాకు అద్భుతమైన కలెక్షన్లు తెచ్చాయి. ఈ నేపథ్యంలో కే ర్యాంప్ మూవీ బడ్జెట్ ఎంత? వరల్డ్ వైడ్‌గా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? 10వ రోజు ఈ సినిమా ఎన్ని కోట్ల రూపాయలు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే..

ఈ సినిమాను యువ దర్శకుడు జైన్స్ నాని తెరకెక్కించారు. ఆయన దర్శకత్వం యాక్షన్, కామెడీ, ఎమోషన్‌ల మేళవింపుతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా సాగింది. కిరణ్ అబ్బవరం సరసన యుక్తి తారేజ హీరోయిన్‌గా నటించగా, సీనియర్ నటులు నరేష్, సాయికుమార్, వెన్నెల కిషోర్ తదితరులు నటించారు. వీరి నటన కూడా సినిమాకు మరింత బలం చేకూరింది. సినిమా అంతటా రసవత్తరమైన సన్నివేశాలు, చక్కటి భావోద్వేగాలు ప్రేక్షకులను థియేటర్‌కు కట్టిపడేస్తున్నాయి.

K Ramp Day 10 Expected Box Office Collections Worldwide

"కే ర్యాంప్" సినిమాను హాస్య మూవీస్, రుద్రాన్ష్ సెల్యూలాయిడ్స్ బ్యానర్లపై రాజేష్ దండా, బాలాజీ గుత్తా, శివాజీ బొమ్మక్ లు సంయుక్తంగా నిర్మించారు. సినిమాటోగ్రాఫర్ సతీష్ రెడ్డి మాసం చూపించిన విజువల్స్ అద్భుతంగా ఉండగా, ఎడిటర్ చోటా కె. ప్రసాద్ ఎడిటింగ్ సినిమాకు మంచి పేస్ ఇచ్చింది. సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్ అందించిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రాణం పోశాయి.

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, "కే ర్యాంప్" సినిమా సుమారు రూ. 4 కోట్ల బడ్జెట్‌తో రూపొందించబడింది. ఇందులో నటీనటుల పారితోషికాలు, మార్కెటింగ్, ప్రమోషన్ ఖర్చులు కూడా చేర్చబడ్డాయి. అయితే, సినిమా విడుదలకు ముందే ప్రీ-రిలీజ్ బిజినెస్ అద్భుతంగా జరిగింది. నైజాం రైట్స్ రూ. 2 కోట్లు, సీడెడ్ రూ. 1.25 కోట్లు, ఆంధ్రా రూ. 3 కోట్లు, కర్ణాటక, ఇతర రాష్ట్రాల రైట్స్ రూ. 0.60 కోట్లు, ఓవర్సీస్ రైట్స్ రూ. 1.30 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. మొత్తం థియేట్రికల్ బిజినెస్ రూ. 8.15 కోట్ల వరకు జరిగిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. లాభాల్లోకి రావాలంటే కనీసం రూ. 9 కోట్ల షేర్ అంటే సుమారు రూ. 18 కోట్ల గ్రాస్ అవసరమని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

ఇక కె ర్యాంప్ కలెక్షన్ల విషయానికి వస్తే.. "కే ర్యాంప్" సినిమా మొదటి రోజు నుంచే కలెక్షన్ల వర్షం కురిపించింది. ఫస్ట్ డే నెట్ కలెక్షన్ రూ. 2.1 కోట్లు, గ్రాస్ రూ. 2.8 కోట్ల నుంచి రూ. 4.5 కోట్ల వరకు చేరింది. రెండో రోజు రూ. 2.85 కోట్లు, మూడో రోజు రూ. 2.35 కోట్లు, నాలుగో రోజు రూ. 1.85 కోట్లు, ఐదో రోజు రూ. 1.3 కోట్లు, ఆరవ రోజు రూ. 1 కోటి, ఏడవ రోజు రూ. 88 లక్షలు వసూళ్లు చేసింది. ఈ లెక్కల ప్రకారం తొలి వారం మొత్తం గ్రాస్ కలెక్షన్ ఇండియా వైడ్‌గా రూ. 11.68 కోట్లకు చేరింది.

వీకెండ్ దుమ్మురేపిన కే ర్యాంప్
ఎవ్వరూ ఊహించని విధంగా, "కే ర్యాంప్" సినిమా వీకెండ్ లో దూసుకెళ్లింది. 8వ రోజు శనివారం థియేటర్లలో 26 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. దీంతో 8 వ రోజు దేశవ్యాప్తంగా గ్రాస్ రూ. 3.32 కోట్లు వసూలు చేయగా.. 9వ రోజు 24 శాతం ఆక్యుపెన్సీతో రూ. 3.5 కోట్లు వసూలు చేసింది. ఈ లెక్కల ప్రకారం, "కే ర్యాంప్" 9 రోజుల్లో ఇండియా వైడ్ గ్రాస్ రూ. 19.5 కోట్లు చేరినట్టు తెలుస్తోంది. అలాగే.. వరల్డ్‌వైడ్ గ్రాస్ రూ. 23 కోట్లకు చేరినట్టు తెలుస్తోంది.

ఇక 10వ రోజు కలెక్షన్స్ వివరాల్లోకెళ్లే.. వీకెండ్ లో కే ర్యాంప్ దుమ్మురేపింది. కానీ, సోమవారం వర్కింగ్ డే కాబట్టి కలెక్షన్స్ తగ్గాయి. ఉదయం షోలలో 18 శాతం, మధ్యాహ్నం 21 శాతం ఆక్యుపెన్సీ ఉండగా, సాయంత్రం, రాత్రి షోలలో ఇదే విధంగా కొనసాగేలా ఉంది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం 10వ రోజు వసూళ్లు రూ. 1 కోటి వరకు నమోదయ్యే అవకాశముంది. ఈ లెక్కల ప్రకారం "కే ర్యాంప్" 10రోజుల్లో ఇండియా వైడ్ గ్రాస్ రూ. 20 కోట్లు నుంచి రూ. 20.5 కోట్లకు చేరే అవకాశం ఉందట. ఇక వరల్డ్‌వైడ్ గ్రాస్ రూ. 25 కోట్లు దాచే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనాలున్నాయి.

ఇదిలా ఉంటే.. మూవీ మేకర్స్ లెక్కల ప్రకారం, "కే ర్యాంప్" సినిమా కేవలం మూడు రోజుల్లోనే ₹17.5 కోట్ల గ్రాస్ వసూలు చేసి బ్రేక్ ఈవెన్ సాధించింది. ఏడు రోజుల్లోనే సినిమా ₹28 కోట్ల వరల్డ్‌వైడ్ గ్రాస్ సాధించినట్టు నిర్మాతలు ప్రకటించారు. మొత్తానికి కే ర్యాంప్ మూవీ కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ కారణంగా వీకెండ్‌లో కలెక్షన్లు 35% పెరిగాయి. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ గ్రాస్ చేసిన ఈ మూవీ.. లాభాల బాటలో నడుస్తోంది. చిన్న సినిమాగా మొదలై, పెద్ద బ్లాక్‌బస్టర్‌గా మారిన "కే ర్యాంప్" మూవీ కిరణ్ అబ్బవరం కెరీర్ మరో మైలురాయి గా మారింది.

More from Filmibeat

Read more about: kiran abbavaram
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X