K Ramp Day 12 Collections: కే ర్యాంప్ షాకింగ్ వసూళ్లు.. కిరణ్ మూవీ 12 రోజు కలెక్షన్ ఎన్ని కోట్లంటే?

K Ramp Box Office Collection:టాలీవుడ్‌లో యంగ్ హీరోలలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో కిరణ్ అబ్బవరం మళ్లీ ఒకసారి తన సత్తా చాటుకున్నారు. విభిన్నమైన కథలు, రియలిస్టిక్ ఎమోషన్లతో ప్రేక్షకుల మనసు గెలుచుకునే ఈ హీరో తాజాగా నటించిన "కే ర్యాంప్ (K Ramp)" సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. కొత్త కాన్సెప్ట్‌, ఎనర్జిటిక్ ప్రెజెంటేషన్‌, రిచ్ టెక్నికల్ వర్క్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా ప్రస్తుతం అన్ని ఏరియాల్లో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో కే ర్యాంప్ మూవీ బడ్జెట్ ఎంత? వరల్డ్ వైడ్‌గా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? 12 వ రోజు ఈ సినిమా ఎన్ని కోట్ల రూపాయలు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే..

విభిన్నమైన కాన్సెప్ట్‌తో "కే ర్యాంప్"
యువ దర్శకుడు జైన్స్ నాని దర్శకత్వం వహించిన ఈ సినిమా యాక్షన్‌, కామెడీ, ఎమోషన్‌ల మేళవింపుగా సాగింది. కిరణ్ అబ్బవరం పాత్రలో ఎనర్జీ, మాస్‌, ఫన్‌ అన్నీ ఒకే సారి కనపడటం ప్రేక్షకులను బాగా కనెక్ట్‌ అయ్యేలా చేసింది. హీరో సరసన నటించిన యుక్తి తారేజ్‌ తన అందం, నటనతో ఆకట్టుకుంది. నరేష్‌, సాయికుమార్‌, వెన్నెల కిషోర్‌ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. వీరి ప్రెజెన్స్‌ సినిమాకు బలం చేకూర్చింది. సినిమాలోని రసవత్తరమైన సన్నివేశాలు, ఫ్యామిలీ ఎమోషన్లు, చక్కటి కామెడీ ప్రేక్షకులను థియేటర్లలో అలరించేలా చేశాయి. "కే ర్యాంప్" పేరుకి తగ్గట్టుగానే కథలో ఫ్యాషన్‌, కాంపిటీషన్‌, యూత్ డ్రీమ్స్ మేళవింపుగా ఉండటం సినిమాకు కొత్తదనం తీసుకొచ్చింది.

K Ramp Day 12 Expected Box Office Collections Worldwide Kiran Abbavaram s Movie face tough fight from Diwali movies

'కే ర్యాంప్'సినిమాను హాస్య మూవీస్, రుద్రాన్ష్ సెల్యూలాయిడ్స్ బ్యానర్లపై రాజేష్ దండా, బాలాజీ గుత్తా, శివాజీ బొమ్మక్ సంయుక్తంగా నిర్మించారు. సుమారు రూ. 4 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా విజువల్స్ పరంగా చాలా రిచ్‌గా కనిపించింది. సినిమాటోగ్రాఫర్ సతీష్‌ రెడ్డి మాసం తీసిన షాట్స్ ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉన్నాయి. ఎడిటర్ చోటా కె. ప్రసాద్ ఎడిటింగ్ సినిమాకు ఎంటర్‌టైన్‌మెంట్ రిథమ్‌ను అందించింది. మ్యూజిక్ విభాగంలో చైతన్ భరద్వాజ్ మరోసారి తన మేజిక్ చూపించాడు. ఆయన కంపోజ్ చేసిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు జీవం పోశాయి. ముఖ్యంగా థియేటర్లలో క్లైమాక్స్ సీక్వెన్స్‌కి చైతన్ అందించిన రీ-రికార్డింగ్ ప్రేక్షకులను కట్టిపడేసింది.

బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి బిజినెస్
"కే ర్యాంప్" సినిమా రిలీజ్‌కి ముందు నుంచే మంచి బిజినెస్ చేసింది. నైజాం రైట్స్ రూ. 2 కోట్లు, సీడెడ్ రైట్స్ రూ. 1.25 కోట్లు, ఆంధ్రా రైట్స్ రూ. 3 కోట్లు, కర్ణాటక & ఓవర్సీస్ రైట్స్ సుమారు రూ. 1.75 కోట్లు, ఇలా మొత్తం థియేట్రికల్ బిజినెస్ రూ. 8 కోట్లకు పైగా జరిగింది. లాభాల్లోకి రావాలంటే కనీసం రూ. 9 కోట్ల షేర్ (సుమారు రూ. 18 కోట్ల గ్రాస్) సాధించాల్సి ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. అక్టోబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన "కే ర్యాంప్" తొలి రోజునే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. యూత్ ఫాలోయింగ్‌, దీపావళి సీజన్ అడ్వాంటేజ్‌, స్ట్రాంగ్ వర్డ్ ఆఫ్ మౌత్ కలిసి సినిమాకు అద్భుతమైన ఆరంభం ఇచ్చాయి.

ఇలా కే ర్యాంప్ ఫస్ట్ డే నెట్ కలెక్షన్ రూ. 2.1 కోట్లు అందుకోగా.. గ్రాస్ కలెక్షన్ రూ.2.8 కోట్ల నుండి రూ.4.5 కోట్ల వరకు వసూలు చేసింది. రెండో రోజు కూడా అదే వేగం కొనసాగి రూ.2. 85 కోట్లు రాబట్టింది. మూడో రోజు కలెక్షన్లు కాస్త తగ్గినా స్థిరంగా నిలిచి రూ.2. 35 కోట్ల వద్ద నిలిచాయి. దీని తర్వాత నాలుగో రోజు రూ.1.85 కోట్లు, ఐదో రోజు రూ.1.3 కోట్లు, ఆరవ రోజు రూ.1 కోటి, ఏడవ రోజు రూ.88 లక్షలు వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇలా మొదటి వారం ముగిసే సరికి "కే ర్యాంప్" ఇండియా వైడ్ గ్రాస్ రూ. 11.68 కోట్లు దాటింది.

వీకెండ్ దుమ్మురేపిన "కే ర్యాంప్"
కే ర్యాంప్ మూవీ వీకెండ్ రోజుల్లో దుమ్మురేపింది. 8వ రోజు శనివారం రూ. 1.8 కోట్లు వసూలు చేసింది. 9వ రోజు కూడా అదే స్థాయిలో రూ. 1.8 కోట్లు రాబట్టింది. దీని ఫలితంగా 9 రోజుల్లో ఇండియా వైడ్ గ్రాస్ రూ. 16 కోట్లు చేరినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. వరల్డ్‌వైడ్ గ్రాస్ మాత్రం రూ. 23 కోట్లకు చేరినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఇక వర్కింగ్ డేస్ నుంచి కలెక్షన్లు పడిపోయాయి. 10వ రూ.70 లక్షలు వసూలు చేయగా, 11వ రోజు 60 లక్షలు మాత్రమే వసూళ్లు చేయగలిగింది.

కే ర్యాంప్ 12 వ రోజు కలెక్షన్ల వివరాల్లోకెళ్లే.. బుధవారం థియేటర్ ఆక్యుపెన్సీ ఘోరంగా పడిపోయింది. ఉదయం షోలకు 15%, మధ్యాహ్నం 16% సాయంత్రం, రాత్రి షోలు కూడా దాదాపు అదే పరిస్థితి ఉండేలా ఉంది. ట్రేడ్ అంచనాల ప్రకారం 12వ రోజు వసూళ్లు రూ 50 లక్షల 70 లక్షల మధ్య ఉంటాయని అంచనా. ఈ లెక్కల ప్రకారం మొత్తం 11 రోజుల్లో ఇండియా వైడ్ గ్రాస్ రూ. 17.5 నుంచి 18 కోట్ల వరకు చేరే అవకాశం ఉంది. వరల్డ్‌వైడ్ గ్రాస్ రూ. 27 కోట్ల మార్క్ దాటుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.

మూవీ మేకర్స్ ప్రకటించిన లెక్కల ప్రకారం, "కే ర్యాంప్" సినిమా కేవలం మూడు రోజుల్లోనే రూ. 17.5 కోట్ల గ్రాస్ వసూలు చేసి బ్రేక్ ఈవెన్ పాయింట్‌ చేరుకుంది. వారం రోజుల్లో రూ. 28 కోట్ల వరల్డ్‌వైడ్ గ్రాస్ నమోదు చేసినట్లు నిర్మాతలు తెలిపారు. ఈ లెక్కల ప్రకారం సినిమా కనీసం రూ. 12 కోట్ల నుంచి రూ. 14 కోట్ల వరకు లాభం సాధించిందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. "కే ర్యాంప్"తో కిరణ్ అబ్బవరం తన కెరీర్‌లోనే అత్యధిక గ్రాస్ కలెక్షన్లు సాధించిన హిట్ అందుకున్నారు. మొత్తం మీద "కే ర్యాంప్" సినిమా కిరణ్ అబ్బవరం కెరీర్‌లో ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పడంలో సందేహం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X