K Ramp Day 13 Collections: పడిపోయిన కే ర్యాంప్ కలెక్షన్స్.. కిరణ్ మూవీ 13 రోజు కలెక్షన్ ఎన్ని కోట్లంటే?

K Ramp Box Office Collection: టాలీవుడ్‌లో ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని వెతుక్కుంటూ ముందుకు సాగుతున్న యువ హీరోల్లో కిరణ్ అబ్బవరం పేరు ముందువరుసలో ఉంటుంది. ఈ యంగ్ హీరో తాజాగా "కే ర్యాంప్ (K Ramp)" సినిమాతో మరోసారి తన ప్రతిభను నిరూపించుకున్నాడు. విభిన్నమైన కథలు ఎంచుకుంటూ ఎప్పటికప్పుడు యూత్ మైండ్‌సెట్‌కి దగ్గరగా ఉండే పాత్రల్లో కనిపించే కిరణ్ అబ్బవరం ఈసారి భారీ సక్సెస్‌ను అందుకున్నారు. ఈ నేపథ్యంలో కే ర్యాంప్ మూవీ బడ్జెట్ ఎంత? వరల్డ్ వైడ్‌గా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? 13వ రోజు ఈ సినిమా ఎన్ని కోట్ల రూపాయలు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే..

అక్టోబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన "కే ర్యాంప్" సినిమా మొదటిరోజు నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. యాక్షన్, కామెడీ, ఎమోషన్‌ల మేళవింపుతో సాగిన ఈ సినిమా యూత్ ఆడియెన్స్‌ను థియేటర్లకు రప్పించింది. ఎనర్జిటిక్ ప్రెజెంటేషన్‌, స్టైలిష్ మేకింగ్‌, భావోద్వేగాలతో నిండిన సన్నివేశాలు సినిమాకు అదనపు బలాన్నిచ్చాయి. యువ దర్శకుడు జైన్స్ నాని దర్శకత్వం వహించిన ఈ సినిమా కమర్షల్ హంగులతో పాటు హృదయానికి హత్తుకునే కథాంశంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. హీరో కిరణ్ అబ్బవరం పాత్రలో కొత్తదనం కనిపించింది. అతని ఎనర్జీ, డైలాగ్ డెలివరీ, ఎమోషనల్ సీన్లలోని నటన ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది.

K Ramp Day 13 Expected Box Office Collections Worldwide Kiran Abbavaram s Movie face tough fight from Diwali movies

కిరణ్ అబ్బవరం సరసన నటించిన యుక్తి తారేజ్ తన అందం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఫ్రెష్ లుక్‌తో, స్క్రీన్‌పై కెమిస్ట్రీతో ఈ జంటను ప్రేక్షకులు బాగా రిసీవ్ చేశారు. నరేష్‌, సాయి కుమార్‌, వెన్నెల కిషోర్‌ తదితరులు తమ పాత్రల్లో అద్భుతంగా నటించారు. ముఖ్యంగా వెన్నెల కిషోర్ కామెడీ ట్రాక్ సినిమాకు పాజిటివ్ ఫ్యాక్టర్‌గా నిలిచింది. టెక్నికల్ పరంగా కూడా ఈ సినిమా రిచ్‌గా నిలిచింది. సినిమాటోగ్రాఫర్ సతీష్ రెడ్డి మాసం చూపించిన విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ప్రతి ఫ్రేమ్‌లోనూ సినిమాకు రిచ్‌నెస్ కనబడింది. ఎడిటర్ చోటా కె. ప్రసాద్ ఎడిటింగ్ సినిమాకు మంచి పేస్ ఇచ్చింది. సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్ అందించిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రాణం పోశాయి.

కే ర్యాంప్ సినిమాను హాస్య మూవీస్, రుద్రాన్ష్ సెల్యూలాయిడ్స్ బ్యానర్లపై రాజేష్ దండా, బాలాజీ గుత్తా, శివాజీ బొమ్మక్‌లు సంయుక్తంగా నిర్మించారు. సుమారు రూ.4 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమా ప్రెజెంటేషన్‌, లుక్స్ పరంగా మాత్రం పెద్ద బడ్జెట్ సినిమాల్లా రిచ్‌గా కనిపించింది. ఈ సినిమాకు రిలీజ్‌కు ముందే డిస్ట్రిబ్యూటర్లలో బలమైన బజ్ నెలకొంది. నైజాం రైట్స్ రూ.2 కోట్లు, సీడెడ్ రైట్స్ రూ.1.25 కోట్లు, ఆంధ్రా రైట్స్ రూ.3 కోట్లు, కర్ణాటక & ఓవర్సీస్ రైట్స్ రూ.1.75 కోట్లు ఉండగా, మొత్తం థియేట్రికల్ బిజినెస్ రూ.8 కోట్లకు పైగా జరిగింది. లాభాల్లోకి రావాలంటే కనీసం రూ.9 కోట్ల షేర్‌ (సుమారు రూ.18 కోట్ల గ్రాస్‌) వసూలు చేయాల్సి ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.

కే ర్యాంప్ విడుదలైన రోజు నుంచే పాజిటివ్ టాక్ కిరణ్ అబ్బవరం యూత్ ఫాలోయింగ్ కలిసి సినిమాకు ఘనమైన ఆరంభాన్ని ఇచ్చాయి. ఫస్ట్ డే నెట్ కలెక్షన్ రూ.2.1 కోట్లు కాగా, గ్రాస్ కలెక్షన్ రూ.2.8 కోట్ల నుండి రూ.4.5 కోట్ల వరకు వసూలు చేసింది. రెండో రోజు కూడా అదే జోరు కొనసాగి రూ.2.85 కోట్లు రాబట్టింది. మూడో రోజు కలెక్షన్లు కాస్త తగ్గినా స్థిరంగా నిలిచి రూ.2.35 కోట్ల వద్ద నిలిచాయి. నాలుగో రోజు రూ.1.85 కోట్లు, ఐదో రోజు రూ.1.3 కోట్లు, ఆరవరోజు రూ.1 కోటి, ఏడవ రోజు రూ.88 లక్షలు వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొదటి వారం ముగిసే సరికి "కే ర్యాంప్" ఇండియా వైడ్ గ్రాస్ రూ.11.68 కోట్లు దాటింది.

కే ర్యాంప్ వీకెండ్ రోజుల్లో సినిమా మరింత దూసుకుపోయింది. ఎనిమిదో రోజు శనివారం రూ.1.8 కోట్లు, తొమ్మిదో రోజు కూడా అదే స్థాయిలో రూ.1.8 కోట్లు వసూలు చేసింది. దీంతో తొమ్మిది రోజుల్లో ఇండియా వైడ్ గ్రాస్ రూ.16 కోట్లు చేరగా, వరల్డ్‌వైడ్ గ్రాస్ రూ.23 కోట్లకు చేరింది. తరువాత వర్కింగ్ డేస్‌లో వసూళ్లు కాస్త తగ్గినా థియేటర్లలో హోల్డింగ్ బలంగా ఉంది. 10వ రోజు రూ.70 లక్షలు, 11వ రోజు రూ.60 లక్షలు, 12వ రోజు రూ.50 లక్షలు మాత్రమే వసూలు చేసింది.

ఇక కే ర్యాంప్ 13వ రోజు ఆక్యుపెన్సీ ఘోరంగా పడిపోయింది. ఉదయం షోలకు 13%, మధ్యాహ్నం 15% మాత్రమే ఉండగా, రాత్రి షోలు కూడా అంతే స్థాయిలో కొనసాగాయి. ట్రేడ్ అంచనాల ప్రకారం 13వ రోజు వసూళ్లు రూ.50-60 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. ఈ లెక్కల ప్రకారం మొత్తం 13 రోజుల్లో ఇండియా వైడ్ గ్రాస్ రూ.18 నుంచి 18.5 కోట్లు, వరల్డ్‌వైడ్ గ్రాస్ రూ.28 కోట్ల మార్క్ దాటుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.

మూవీ మేకర్స్ ప్రకటించిన లెక్కల ప్రకారం కే ర్యాంప్ సినిమా కేవలం మూడు రోజుల్లోనే రూ.17.5 కోట్ల గ్రాస్ వసూలు చేసి బ్రేక్ ఈవెన్ పాయింట్ చేరుకుంది. వారం రోజుల్లో రూ.28 కోట్ల వరల్డ్‌వైడ్ గ్రాస్ నమోదు చేసినట్లు నిర్మాతలు తెలిపారు. ఈ లెక్కల ప్రకారం సినిమా కనీసం రూ.13 కోట్ల నుండి రూ.15 కోట్ల వరకు లాభం సాధించిందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. తక్కువ బడ్జెట్‌తో భారీ లాభాలు తెచ్చిన హిట్‌గా ఇది నిలిచింది.

"కే ర్యాంప్"తో కిరణ్ అబ్బవరం తన కెరీర్‌లోనే అత్యధిక గ్రాస్ కలెక్షన్లు సాధించారు. ఈ సినిమా ద్వారా మాస్, ఫ్యామిలీ ఆడియెన్స్ రెండింటికీ చేరువయ్యారు. ఇప్పటివరకు యూత్ హీరోగా ఉన్న కిరణ్, ఈ సినిమాతో కమర్షియల్ హీరోగా నిలిచారు. బలమైన కథ, పాజిటివ్ టాక్‌, ఎనర్జిటిక్ ప్రెజెన్స్ ఆయన కెరీర్‌కు కొత్త దిశకు తీసుకెళ్లాలి. తక్కువ బడ్జెట్‌తో భారీ లాభాలు సాధించిన "కే ర్యాంప్" కిరణ్ అబ్బవరం మార్కెట్ విలువను పెంచింది. ఆయన కెరీర్ కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X