K Ramp Day 4 Collections: బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోన్న కిరణ్ అబ్బవరం.. కే ర్యాంప్ 4 రోజు కలెక్షన్ ఎన్ని కో
K-Ramp Box Office Collection: యువ హీరో కిరణ్ అబ్బవరం మరోసారి తన సత్తా చాటారు. బాక్సాఫీస్ వద్ద తన మార్క్ చూపిస్తున్నాడు. గత సంవత్సరం దీపావళి సీజన్‌లో విడుదలైన "క" సినిమా మంచి వసూళ్లు సాధించిన నేపథ్యంలో, ఈ ఏడాది కూడా అదే టైమ్‌లో ఆయన నటించిన తాజా చిత్రం "కే ర్యాంప్" ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అక్టోబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం, విడుదల మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో కే ర్యాంప్ మూవీ బడ్జెట్ ఎంత? వరల్డ్ వైడ్‌గా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? నాలుగవ రోజు ఈ సినిమా ఎన్ని కోట్ల రూపాయలు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే..
యంగ్ డైరెక్టర్ జైన్స్ నాని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్-ఎంటర్టైనర్‌లో కిరణ్ సరసన యుక్తి తారేజ హీరోయిన్‌గా నటించింది. ప్రధాన పాత్రల్లో నరేష్, సాయికుమార్, వెన్నెల కిషోర్ వంటి సీనియర్ నటులు తమదైన నటనతో మెప్పించారు. హాస్య మూవీస్, రుద్రాన్ష్ సెల్యూలాయిడ్స్ బ్యానర్లపై రాజేష్ దండా, బాలాజీ గుత్తా, శివాజీ బొమ్మక్ కలిసి నిర్మించిన ఈ సినిమాకు చైతన్ భరద్వాజ్ సంగీతం అందించగా, సతీష్ రెడ్డి మాసం సినిమాటోగ్రఫీ, చోటా కే ప్రసాద్ ఎడిటింగ్ అందించారు.

బడ్జెట్ & ప్రీ-రిలీజ్ బిజినెస్
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం "కే ర్యాంప్" బడ్జెట్ సుమారు రూ. 4 కోట్లు దాటింది. ఇందులో నటీనటుల పారితోషికాలు, మార్కెటింగ్, ప్రమోషనల్ ఈవెంట్స్ ఖర్చులు అన్నీ కలిపి ఉన్నాయి. సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ అంచనాలు ఇలా ఉన్నాయి. నైజాం రైట్స్ రూ. 2 కోట్లు, సీడెడ్ రైట్స్ రూ. 1.25 కోట్లు, ఆంధ్రా రైట్స్ రూ. 3 కోట్లు, కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా రూ. 0.60 కోట్లు, ఓవర్సీస్ రైట్స్ రూ.1.30 కోట్లు ఇలా మొత్తం థియేట్రికల్ బిజినెస్ రూ. 8.15 కోట్లు. ట్రేడ్ విశ్లేషకుల ప్రకారం.. సినిమా లాభాల బాట పట్టాలంటే కనీసం రూ. 9 కోట్లు షేర్, అంటే సుమారు రూ. 18 కోట్లు గ్రాస్ రాబట్టాలి.
ఓపెనింగ్స్ అద్భుతం
దీపావళి సీజన్ అడ్వాంటేజ్‌తో "కే ర్యాంప్" థియేటర్లలో రికార్డ్ స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ సాధించింది. ముఖ్యంగా హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నం ప్రాంతాల్లో ఫస్ట్ డే షోలు హౌస్‌ఫుల్‌గా నడిచాయి. అమెరికాలో కూడా ప్రీమియర్ షోలకే మంచి స్పందన లభించింది. సాక్‌నిక్ రిపోర్ట్స్ ప్రకారం ఫస్ట్ డే నెట్ కలెక్షన్ రూ. 2.1 కోట్లు, గ్రాస్ కలెక్షన్ రూ. 2.8 కోట్లు, అయితే ప్రొడ్యూసర్‌ల లెక్కల ప్రకారం తొలి రోజు మొత్తం రూ. 4.5 కోట్లు గ్రాస్ వరకు చేరినట్లు సమాచారం. ఇక రెండో రోజు వసూళ్లు కూడా పెరిగాయి. రెండో రోజు రూ. 2. 85 కోట్లు, మూడో రోజు రూ. 2. 33 కోట్లు కలెక్షన్స్ వసూలు చేసినట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. కిరణ్ అబ్బవరం 'కే ర్యాంప్' మూవీ హౌస్ ఫుల్ షోలతో దూసుకు వెళుతోంది. రోజు రోజుకూ పెరుగుతున్న కలెక్షన్లతో బ్లాక్ బస్టర్ హిట్ దిశగా పరుగులు పెడుతోంది. ఈ సినిమా మూడు రోజుల్లో రూ. 17.5 కోట్లు కలెక్ట్ చేసి బ్రేక్ ఈవెన్ సాధించినట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు.
ఇక నాలుగవ రోజు కూడా "కే ర్యాంప్" కలెక్షన్ల అదే జోరు కొనసాగిస్తోంది. సాక్‌నిక్ అంచనాల ప్రకారం మంగళవారం ఉదయం షోలలో 23% ఆక్యుపెన్సీ, మధ్యాహ్నం 26% థియేట్రికల్ ఆక్యుపెన్సీ నమోదైనట్లు తెలుస్తోంది. సాయంత్రం, రాత్రి షోల్లో ట్రెండ్ కొనసాగితే కల్లా మొత్తం రూ.2 కోట్ల వరకు నేషనల్ వైడ్ గ్రాస్ కలెక్షన్, వరల్డ్ వైడ్‌గా రూ.3 నుండి రూ. 3.5 కోట్లు వరకు గ్రాస్ వసూలు చేసే అవకాశం ఉందని అంచనా. ఈ లెక్కలను చూస్తే.. నాలుగురోజుల్లోనే ఇండియా వైడ్ గ్రాస్ రూ. 9 కోట్ల నుంచి 10 కోట్ల వరకూ గ్రాస్ వసూలు చేసే అవకాశముంది. సిటీలు మాత్రమే కాదు, బీ & సీ సెంటర్లలో కూడా "కే ర్యాంప్"కు ప్రేక్షకాదరణ పెరుగుతోంది.


Click it and Unblock the Notifications











