రాఘవ లారెన్స్ ‘గంగ’ కలెక్షన్స్ రూ. 50 కోట్లు దాటింది

By Bojja Kumar

హైదరాబాద్: రాఘవ లారెన్స్ దర్శకత్వంలో కాంచన మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిన కాంచన-2 (తెలుగులో ‘గంగ') చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాలను రాబట్టింది. కామెడీ అండ్ హారర్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ చిత్రం తమిళ వెర్షన్ తాజాగా రూ. 50 కోట్ల మార్కును అందుకుంది.

తమిళనాడు, కేరళ, కర్నాటకలో రెండు వారాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ భారీ మొత్తంలో వసూళ్లు చేసి లాభాలు తేవడంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీగా ఉన్నారు. తెలుగు వెర్షన్ ‘గంగ' కూడా వసూళ్లు పరంగా డిస్ట్రిబ్యూటర్లకు సంతృప్తిని మిగిల్చింది. మొత్తం కలిపితే ఈ వసూళ్లు రూ. 50 కోట్ల పైనే ఉంటుందని అంచనా.

Kanchana-2 touches the 50 crore mark

ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేని లారెన్స‌తో పాటు తాప్సీకి కూడా ఈ చిత్ర విజయం మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది. సినిమాలో కామెడీ ఎలిమెంట్స్, హారర్ ఎలిమెంట్స్ ఆకట్టుకునే విధంగా ఉండటంతో సినిమా చూడటానికి థియేటర్లకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది. సినిమా చూసిన వారంతా మంచి వినోదాత్మక చిత్రంగా ప్రశంసిస్తున్నారు.

ఈ సినిమా విజయం సాధించడంతో...దీనికి సీక్వెల్ గా మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు లారెన్స్. రాఘవ లెరెన్స్, తాప్సీ జంటగా నటించిన ఈ భారీ చిత్రానికి ఫోటోగ్రఫీ: కిచ్చా, సంగీతం: థమన్, సమర్పణ: మల్టీ డైమన్షన్ ఎంటర్ టైన్మెంట్స్, నిర్మాతలు: బెల్లంకొండ సురేష్, బెల్లకొండ గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-కొరియోగ్రఫీ-దర్శకత్వం: రాఘవ లారెన్స్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X