Kantara 1 North America Adv Collections: కాంతార చాప్టర్ 1 అడ్వాన్స్ బుకింగ్ హంగామా.. కలెక్షన్లు ఎంతంటే?

దక్షిణాదిలో అగ్ర సినీ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మాత విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న చిత్రం కాంతార చాప్టర్ 1. రిషబ్ శెట్టి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

సీనియర్ నటులు జయరాం, గుల్షన్ దేవయ్య, రాకేష్ పూజారీ తదితరులు నటిస్తున్నారు. ఈ మూవీకి ఛాలువే గౌడ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రఫిని, కేఎం ప్రకాశ్, శోభిత్ శెట్టి ఎడిటింగ్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. అజనీష్ లోక్‌నాథ్ బీ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ట్రైలర్ రిలీజ్ చేశారు. అక్టోబర్ 2వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్ క్రేజీగా మొదలైంది. ఈ బిజినెస్ వ్యవహారాలు, అడ్వాన్స్ బుకింగ్ వ్యవహారాల్లోకి వెళితే..

Kantara 1 North America Adv Collections

కాంతార చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజై సంచలన విజయం సాధించడం తెలిసిందే. ఆ సినిమాకు ప్రీక్వెల్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల అభిరుచి, పెరిగిన అంచనాలకు తగినట్టుగా హోంబలే ఫిల్మ్స్ భారీగా నిర్మించింది. ఈ సినిమాను సుమారుగా 125 నుంచి 150 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించారనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో సుమారుగా 125 కోట్ల రూపాయలు చెల్లించి సొంతం చేసుకొన్నదని ట్రేడ్ వర్గాల్లో టాక్ ప్రచారంలో ఉంది.

ఇక ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులు కూడా ఫ్యాన్సీ రేటుకు అమ్ముడుపోయాయి. ఆంధ్రా, సీడెడ్, నైజాం హక్కులు సుమారుగా 70 కోట్ల మేర వాల్యూ కట్టినట్టు బిజినెస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. అయితే ఈ సినిమాను తెలుగులో రాష్ట్రాల్లో నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేస్తుండగా, సీడెడ్‌లో శిల్పకళా ఎంటర్‌టైన్‌మెంట్, ఉత్తరాంధ్రలో విఘ్నేశ్వర, ఈస్ట్, వెస్ట్ గోదావరి జిల్లాలో గీతా ఆర్ట్స్, గుంటూరులో వారాహి, కృష్ణా జిల్లాలో కేఎస్ఎన్, నెల్లూరు జిల్లాలో ఎస్వీ సంస్థలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయి. ఈ సినిమాను అడ్వాన్స్ బేస్ మీద పంపిణీ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి.

ఓవర్సీస్‌లో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ రికార్డు ధరకు అమ్ముడుపోయాయి. ఈ చిత్రాన్ని నార్త్ అమెరికాలో ప్రత్యాంగీరా సినిమాస్ రిలీజ్ చేస్తున్నది. మిడిల్ ఈస్ట్‌ దేశాల్లో ఫార్స్ ఫిల్మ్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో డ్రీమ్ స్క్రీన్స్ ఇంటర్నేషనల్, యూకేలో డ్రీమ్జ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు రిలీజ్ చేస్తున్నాయి అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇక ఈ సినిమా ప్రీ సేల్స్ నార్త్ అమెరికాలో ఘనంగా ప్రారంభమైంది. కడపటి సమాచారం ప్రకారం.. ఈ సినిమాను సుమారుగా 400 లోకేషన్లలో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి 1850 షోలకు అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభించారు. ఇప్పటి వరకు 5000 టికెట్లు అమ్మడం ద్వారా 120K డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో 11 లక్షల రూపాయలు వసూలు చేసింది అని నార్త్ అమెరికా ట్రేడ్ అనలిస్టులు వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X