Kantara Chapter 1 Day 1 AP TG Collection: ఆంధ్రా, నైజాంలలో కాంతార కలెక్షన్స్.. ఫస్ట్ డే ఎన్ని కోట్లంటే?

కాంతార చిత్రానికి ప్రీక్వెల్‌గా రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కాంతార చాప్టర్ 1. గాంధీ జయంతి, విజయదశమి కానుకగా అక్టోబర్ 2వ తేదీన ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. గతంలో ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చి కాంతార బ్లాక్ బస్టర్ కావడంతో ఈ సినిమాపై ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రత్యేకించి తెలుగులో మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో కాంతార చాప్టర్ 1 ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? తొలి రోజు ఆంధ్రా, నైజాంలలో కాంతార చాప్టర్ 1 ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే..

కాంతార చాప్టర్ 1లో రిషబ్ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించగా.. జయరామ్, గుల్షన్ దేవయ్య, ప్రమోద్ శెట్టి, రాకేశ్ పూజారి, ప్రకాశ్ తుమినాడ్, దీపక్ రామ్ పనాజీ, హరిప్రసాద్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగదూర్, చాలువే గౌడలు దాదాపు రూ.125 కోట్ల భారీ బడ్జెట్‌తో కాంతార చాప్టర్ 1ను నిర్మించారు. ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీత సారథ్యం వహిస్తుండగా.. అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రాఫర్‌గా, సురేష్ మల్లయ్య ఎడిటింగ్ బాధ్యలు నిర్వర్తిస్తున్నారు.

Kantara Chapter 1 Andhra Telangana Day 1 Collection rishab Shetty s film Box Office Report in AP and TG

కాంతార చాప్టర్ 1 ప్రీ రిలీజ్ బిజినెస్
కాంతార చాప్టర్ 1పైనా తెలుగు రాష్ట్రాల్లో భారీ అంచనాలు నెలకొంది. దీనికి తగినట్లుగానే ఈ మూవీకి ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగినట్లుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం కాంతార చాప్టర్ 1 తెలుగు థియేట్రికల్ రైట్స్ 100 కోట్లకు పైగా పలుకుతున్నాయట. నైజాంలో 40 కోట్లు, ఆంధ్రలో 45 కోట్లు, సీడెడ్ ఏరియాలో 15 కోట్లుగా చెబుతున్నారు. కాంతార చాప్టర్ 1 తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ కావాలంటే 101 రూపాయల షేర్, 202 కోట్ల రూపాయలు గ్రాస్ రాబట్టాల్సి ఉంది.

కాంతార చాప్టర్ 1 బ్రేక్ ఈవెన్ టార్గెట్
ఇక కర్ణాటక థియేట్రికల్ రైట్స్ రికార్డు స్థాయిలో 169 కోట్ల రూపాయలు, తమిళనాడు హక్కులు 13 కోట్ల రూపాయలు, కేరళ రైట్స్ 20 కోట్ల రూపాయలు, నార్త్ ఇండియా రైట్స్ 96 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ రైట్స్ 44.5 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా సుమారుగా 440 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రిషబ్ శెట్టి మూవీ లాభాల్లోకి రావాలంటే.. బాక్సాఫీస్ వద్ద దాదాపు 850 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. భారీ అంచనాల మధ్య కాంతార చాప్టర్ 1 చిత్రాన్ని వరల్డ్ వైడ్‌గా 4400 థియేటర్‌లలో విడుదల చేశారు.

కాంతార చాప్టర్ 1 తొలి రోజు కలెక్షన్స్
కాంతార చాప్టర్ 1కి పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా వరల్డ్ వైడ్‌గా 43.87 కోట్ల రూపాయలు వచ్చాయి. తొలిరోజు వరల్డ్ వైడ్‌గా 90 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ లభించే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కడపటి వార్తలు అందేసరికి ఈ సినిమా హిందీలో 22 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 15 కోట్ల రూపాయలు, తమిళంలో 3 కోట్ల రూపాయలు, మలయాళంలో 3 కోట్ల రూపాయలు రాబట్టింది.

ఇక ఓవర్సీస్‌లో కాంతార చాప్టర్ 1 చిత్రం సరికొత్త రికార్డులు సృష్టించింది. నార్త్ అమెరికాలో ప్రీమియర్స్‌తో కలిపి 750k (భారత కరెన్సీలో 6 కోట్ల రూపాయలు) రాబట్టింది. ఇక న్యూజిలాండ్, యూకే, యూరప్, ఆస్ట్రేలియా, గల్ఫ్, మిడిల్ ఈస్ట్ తదితర దేశాలో కాంతార చాప్టర్ 1కు 3 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా కాంతారకు ఓవర్సీస్‌లో తొలి రోజు 10 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్లుగా తెలుస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో కాంతార తొలి రోజు కలెక్షన్స్
గతంలో కాంతార మూవీ సంచలనాలు సృష్టించిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాపై జనంలో ఆసక్తి నెలకొంది. ఆంధ్రా, నైజాంలలో పెయిడ్ ప్రీమియర్స్‌కు మంచి ఆదరణ లభించింది. ప్రీమియర్స్‌తో కలిసి తెలుగు రాష్ట్రాల్లో కాంతార చాప్టర్ 1కు తొలి రోజు 12 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. వీకెండ్‌లో రిషబ్ శెట్టి సినిమా మరిన్ని ప్రభంజనాలు సృష్టించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X