Kantara: Chapter 1 Closing Collection: కాంతార చాప్టర్ 1 క్లోజింగ్ కలెక్షన్స్..రిషబ్ మూవీకి ఎన్ని కోట్ల లాభమంటే
హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్, చాలువే గౌడలు నిర్మించిన చిత్రం కాంతార చాప్టర్ 1. గతంలో వచ్చిన కాంతారకు ప్రీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కింది. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటించింది. జయరామ్, గుల్షన్ దేవయ్య, ప్రమోద్ శెట్టి, రాకేశ్ పూజారి, ప్రకాశ్ తుమినాడ్, దీపక్ రామ్ పనాజీ, హరిప్రసాద్ తదితరులు ఇతర కీలకపాత్రలు పోషించారు. అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా.. అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రాఫర్‌గా, సురేష్ మల్లయ్య ఎడిటింగ్ బాధ్యలు నిర్వర్తించారు. విజయదశమి కానుకగా అక్టోబర్ 2వ తేదీన విడుదలైంది. ఈ నేపథ్యంలో కాంతార చాప్టర్ 1 మూవీకి బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఈ సినిమాకు లాభమెంత? నష్టమెంత? అనే వివరాల్లోకి వెళితే..
కాంతార చాప్టర్ 1 బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రచార కార్యక్రమాలతో కలిపి కాంతార చాప్టర్ 1కు 125 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యింది. కాంతార బ్రాండ్ నేమ్‌తో పాటు టీజర్, ట్రైలర్ల కారణంగా ఈ సినిమాకు భారీ బిజినెస్ జరిగింది. నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్ 96 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల రూపాయలు, కర్ణాటక థియేట్రికల్ రైట్స్ 169 కోట్ల రూపాయలు, తమిళనాడు హక్కులు 13 కోట్ల రూపాయలు, కేరళ రైట్స్ 20 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ రైట్స్ 44.5 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా సుమారుగా 440 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రిషబ్ శెట్టి మూవీ లాభాల్లోకి రావాలంటే.. బాక్సాఫీస్ వద్ద దాదాపు 850 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టాలని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు. కాంతార చాప్టర్ 1 చిత్రాన్ని వరల్డ్ వైడ్‌గా 4400 థియేటర్‌లలో విడుదల చేశారు.

కాంతార చాప్టర్ 1 కలెక్షన్స్
తొలి రోజు ఇండియా వైడ్‌గా 61.85 కోట్ల రూపాయల రికార్డ్ ఓపెనింగ్స్ రాబట్టిన కాంతార చాప్టర్ 1 మూవీ.. ఫస్ట్ వీక్ 337.4 కోట్ల రూపాయలు... రెండో వారంలో 147.85 కోట్ల రూపాయలు.. మూడో వారంలో 78.85 కోట్ల రూపాయలు.. నాలుగో వారంలో 37.6 కోట్ల రూపాయలు, ముప్పయ్యోవ రోజున 1.85 కోట్ల రూపాయలు, ముప్పయి ఒకటో రోజున 3.6 కోట్ల రూపాయలు చొప్పున ఇండియాలో 607.15 కోట్ల రూపాయలు... 723.75 కోట్ల రూపాయలు గ్రాస్ రాబట్టినట్లు సాక్‌నిక్ నివేదించింది.
కాంతార ఓవర్సీస్ కలెక్షన్స్ పరిశీలిస్తే.. నార్త్ అమెరికాలో ఇప్పటి వరకు ఈ చిత్రం 4.8 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు 42.61 కోట్ల రూపాయలు) రాబట్టింది. ఇక యూకే, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, గల్ఫ్, మిడిల్ ఈస్ట్ దేశాలలో 78 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఇప్పటి వరకు కాంతార చాప్టర్ 1కు ఓవర్సీస్‌లో 110.5 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ వసూళ్లు కలిపి కాంతార చాప్టర్ 1కు ఇప్పటి వరకు 834.25 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. తద్వారా కేజీఎఫ్ 2 తర్వాత అత్యధిక కలెక్షన్స్ సాధించిన రెండవ కన్నడ చిత్రంగా కాంతార చాప్టర్ 1 రికార్డుల్లోకెక్కింది. అలాగే అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల్లో కాంతార చాప్టర్ 1 మూవీ 13వ స్థానంలో నిలిచింది. 2025లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమా ఇదే కావడం విశేషం.
తెలుగు రాష్ట్రాల్లో కాంతార చాప్టర్ 1 కలెక్షన్స్
తెలుగు రాష్ట్రాల్లో పెయిడ్ ప్రీమియర్స్‌తో కలిపి కాంతార చాప్టర్ 1కు తొలి రోజున 13 కోట్ల రూపాయలు వసూలు చేయగా.. తొలి వారం 63.55 కోట్ల రూపాయలు, రెండో వారం 18.15 కోట్ల రూపాయలు, మూడో వారం 5.7 కోట్ల రూపాయలు, నాలుగో వారం 2.2 కోట్ల రూపాయలు, ముప్పయ్యో రోజున 30 లక్షల రూపాయలు, ముప్పయి ఒకటవ రోజున 10 లక్షల రూపాయలు చొప్పున ఇప్పటి వరకు ఆంధ్రా, నైజాంలలో 89.73 కోట్ల రూపాయల నికర వసూళ్లు రాబట్టింది.
ఇండియాలోని రాష్ట్రాల వారీగా కాంతార చాప్టర్ 1 ఇప్పటి వరకు రాబట్టిన గ్రాస్ వసూళ్లు చూస్తే... కర్ణాటకలో 240.75 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 105.73 కోట్ల రూపాయలు, తమిళనాడులో 71 కోట్ల రూపాయలు, కేరళలో 55.62 కోట్ల రూపాయలు, హిందీలో 246.4 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
కాంతార చాప్టర్ 1కు లాభమెంత? నష్టమెంత?
వరుస విజయాలతో ఊపు మీదున్న హోంబలే ఫిలింస్ అధినేతలు విజయ్ కిరగందూర్, చాలువే గౌడలకు కాంతార చాప్టర్ 1 మరోసారి భారీ లాభాలను తెచ్చిపెట్టింది. ఎన్ని సినిమాలు పోటీ వచ్చినా వాటన్నింటిని అధిగమించి బాక్సాఫీస్ వద్ద కనక వర్షం కురిపించింది. అయితే చాలా ఏరియాలలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కాలేదు. తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల రూపాయల షేర్ రాబట్టాల్సి ఉండగా.. 75 కోట్లు మాత్రమే వసూలు చేసి డిస్ట్రిబ్యూటర్లకు 25 కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చింది. కర్ణాటకలోనూ ఇదే పరిస్ధితి నెలకొంది. అక్కడ 170 కోట్ల రూపాయల షేర్‌కి గాను కేవలం 140 కోట్లే రాబట్టింది. అయితే తమిళనాడు, కేరళ, హిందీలో మాత్రం కాంతార చాప్టర్ 1 చిత్రం డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలను అందించింది.
తమిళనాడులో 26 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేయాల్సి ఉండగా.. 71 కోట్లు రాబట్టింది. కేరళలో 40 కోట్లు రాబట్టాల్సి ఉండగా.. 56 కోట్ల రూపాయలు తెచ్చిపెట్టింది. ఇక హిందీలో 200 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టాల్సి ఉండగా.. 241 కోట్లు వసూలు చేసింది. ఓవరాల్ బిజినెస్ ప్రకారం చూస్తే 850 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేయాల్సి ఉండగా... ఇప్పటి వరకు 835 కోట్ల రూపాయల గ్రాస్, 430 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 20 కోట్ల రూపాయలు రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అయితే ఓటీటీ, శాటిలైట్, ఆడియో రైట్స్ కింద నిర్మాతలకు డబుల్ ప్రాఫిట్ వచ్చినట్లుగా ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.


Click it and Unblock the Notifications











