Kantara Chapter 1 3 Weeks Collections: కాంతార 3 వారాల కలెక్షన్స్... రిషబ్ శెట్టి మూవీ ఎంత రాబట్టిందంటే?

హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్, చాలువే గౌడలు నిర్మించిన చిత్రం కాంతార చాప్టర్ 1. అక్టోబర్ 2వ తేదీన విడుదలైన ఈ సినిమా రికార్డ్ కలెక్షన్స్‌తో దూసుకెళ్తూ.. కన్నడ చిత్ర పరిశ్రమను మరో మెట్టుపైకి ఎక్కించడంతో పాటు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు కాసుల వర్షం కురిపిస్తోంది. గతంలో వచ్చిన కాంతారకు ప్రీక్వెల్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు రిషబ్ శెట్టి. ఇందులో రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటించగా.. యరామ్, గుల్షన్ దేవయ్య, ప్రమోద్ శెట్టి, రాకేశ్ పూజారి, ప్రకాశ్ తుమినాడ్, దీపక్ రామ్ పనాజీ, హరిప్రసాద్ తదితరులు ఇతర కీలకపాత్రలు పోషించారు. అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా.. అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రాఫర్‌గా, సురేష్ మల్లయ్య ఎడిటింగ్ బాధ్యలు నిర్వర్తించారు. విడుదలై మూడు వారాలు కావొస్తుండటంతో కాంతార చాప్టర్ 1 ఇప్పటి వరకు ఎన్ని కోట్లు రాబట్టింది? ఏయే ఏరియాలలో ఎంత వసూలు చేసిందో పరిశీలిస్తే..

కాంతార చాప్టర్ 1 బడ్జెట్ ఎంత?
కాంతార చాప్టర్ 1లో జనటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రచార కార్యక్రమాలతో కలిపి కాంతార చాప్టర్ 1కు 125 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యింది. కాంతార బ్రాండ్ నేమ్‌తో పాటు టీజర్, ట్రైలర్ల కారణంగా ఈ సినిమాకు భారీ బిజినెస్ జరిగింది. నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్ 96 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల రూపాయలు, కర్ణాటక థియేట్రికల్ రైట్స్ 169 కోట్ల రూపాయలు, తమిళనాడు హక్కులు 13 కోట్ల రూపాయలు, కేరళ రైట్స్ 20 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ రైట్స్ 44.5 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా సుమారుగా 440 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రిషబ్ శెట్టి మూవీ లాభాల్లోకి రావాలంటే.. బాక్సాఫీస్ వద్ద దాదాపు 850 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టాలని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు. కాంతార చాప్టర్ 1 చిత్రాన్ని వరల్డ్ వైడ్‌గా 4400 థియేటర్‌లలో విడుదల చేశారు.

Kantara Chapter 1 Box Office Rishab Shetty s Movie 3 Weeks worldwide Collections Report

కాంతార చాప్టర్ 1 కలెక్షన్స్
కాంతార చాప్టర్ 1కు పెయిడ్ ప్రీమియర్స్‌తో కలిపి ఇండియా వైడ్‌గా తొలి రోజున 61.85 కోట్ల రూపాయలు, రెండో రోజున 45.4 కోట్ల రూపాయలు, మూడో రోజున 55 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 63 కోట్ల రూపాయలు, ఐదో రోజున 31.5 కోట్ల రూపాయలు, ఆరో రోజున 34.25 కోట్ల రూపాయలు, ఏడో రోజున 25 కోట్ల రూపాయలు, ఎనిమిదవ రోజున 21.25 కోట్ల రూపాయలు, తొమ్మిదవ రోజున 22.35 కోట్ల రూపాయలు, పదో రోజున 39 కోట్ల రూపాయలు, పదకొండో రోజున 39.75 కోట్ల రూపాయలు, పన్నెండవ రోజున 13.5 కోట్ల రూపాయలు, పదమూడో రోజున 14 కోట్ల రూపాయలు, పద్నాలుగో రోజున 10.5 కోట్ల రూపాయలు, పదిహేనవ రోజున 8.85 కోట్ల రూపాయలు, పదహారవ రోజున 8.5 కోట్ల రూపాయలు, పదిహేడవ రోజున 12.5 కోట్ల రూపాయలు, పద్దెనిమిదవ రోజున 17 కోట్ల రూపాయలు, పందొమ్మిదవ రోజున 11.65 కోట్ల రూపాయలు, ఇరవయ్యో రోజున 11.75 కోట్ల రూపాయలు, ఇరవై ఒకటో రోజున 10.6 కోట్ల రూపాయలు, ఇరవై రెండవ రోజున 6.25 కోట్ల రూపాయలు చొప్పున ఇండియాలో 563.7 కోట్ల రూపాయల నెట్... 672 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది కాంతార.

కాంతార చాప్టర్ 1 ఓవర్సీస్ కలెక్షన్
విడుదలకు ముందు నుంచే కాంతార చాప్టర్ 1 ఓవర్సీస్‌‌లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ప్రత్యేకించి నార్త్ అమెరికాలో ఈ సినిమా సత్తా చాటుతోంది. యూఎస్ఏ, కెనడాలలో 3 వారాల వరకు ఈ సినిమా 4.7 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో 41 కోట్ల రూపాయలు) రాబట్టినట్లుగా తెలుస్తోంది. ఇతర దేశాల నుంచి మరో 67 కోట్లు వసూలు చేసిన కాంతార చాప్టర్ 1.. ఓవర్సీస్‌లో 100 కోట్ల మార్కును అందుకుంది. ఈ ఏడాది ఓవర్సీస్‌లో కూలీ, సైయారా, ఎంపురాన్, లోకా చాప్టర్ 1 తర్వాత 100 కోట్ల మార్క్ దాటిన ఐదో సినిమాగా కాంతార నిలిచింది. ఇప్పటి వరకు విదేశాల్లో ఈ సినిమాకు 108.65 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది.

తెలుగు రాష్ట్రాల్లో కాంతార వసూళ్లు
తెలుగులో పెయిడ్ ప్రీమియర్స్‌తో కలిపి ఈ సినిమాకు తొలి రోజున 13 కోట్ల రూపాయలు, రెండో రోజున 11.5 కోట్ల రూపాయలు, మూడో రోజున 11.25 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 11.5 కోట్ల రూపాయలు, ఐదో రోజున 5.4 కోట్ల రూపాయలు, ఆరో రోజున 4.75 కోట్ల రూపాయలు, ఏడో రోజున 3.5 కోట్ల రూపాయలు, ఎనిమిదవ రోజున 2.65 కోట్ల రూపాయలు, తొమ్మిదవ రోజున 3.25 కోట్ల రూపాయలు, పదో రోజున 5 కోట్ల రూపాయలు, పదకొండో రోజున 4.85 కోట్ల రూపాయలు, పన్నెండో రోజున 1.35 కోట్ల రూపాయలు, పదమూడో రోజున 1.5 కోట్ల రూపాయ, పద్నాలుగో రోజున 1.1 కోట్ల రూపాయలు, పదిహేనవ రోజున 90 లక్షలు, పదహారో రోజున 65 లక్షల రూపాయలు, పదిహేడవ రోజున 1.1 కోట్లు, పద్దెనిమిదవ రోజున 1.4 కోట్ల రూపాయలు, పందొమ్మిదవ రోజున కోటి రూపాయలు, ఇరవయ్యో రోజున 85 లక్షల రూపాయలు, ఇరవై ఒకటో రోజున 40 లక్షల రూపాయలు, ఇరవై రెండవ రోజున 25 లక్షల రూపాయలు చొప్పున 87.4 కోట్ల రూపాయల నికర వసూళ్లను సాధించింది.

తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారీగా కాంతార వసూళ్లు పరిశీలిస్తే.. నైజాంలో 30.70 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 9.53 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 8.85 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరిలో 3.85 కోట్ల రూపాయలు, వెస్ట్ గోదావరిలో 3 కోట్ల రూపాయలు, గుంటూరులో 3.80 కోట్ల రూపాయలు, కృష్ణాలో 4.30 కోట్ల రూపాయలు, నెల్లూరులో 2.75 కోట్ల రూపాయల చొప్పున 65 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది.

కాంతార 3 వారాల కలెక్షన్స్
కాంతార చాప్టర్ 1కు తొలి వారం 337.4 కోట్ల రూపాయలు, రెండో వారం 147.85 కోట్ల రూపాయలు, మూడో వారంలో 78.5 కోట్ల రూపాయలు రాబట్టింది. మూడు వారాల వరకు కర్ణాటకలో 231 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 104 కోట్ల రూపాయలు, తమిళనాడులో 67.5 కోట్ల రూపాయలు, కేరళలో 54.5 కోట్ల రూపాయలు, హిందీ + రెస్టాఫ్ ఇండియాలో 226 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 108 కోట్ల రూపాయల చొప్పున 790 కోట్ల రూపాయలకు పైగా రాబట్టి.. 800 కోట్ల మార్క్ వైపు వేగంగా అడుగులు వేస్తోంది. ఈ వీకెండ్‌లోగా రిషబ్ శెట్టి ఈ ఫీట్ అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X