Kantara Chapter 1 Box Office: ఆస్ట్రేలియాలో చరిత్ర తిరగరాసిన కాంతార.. రిషబ్ శెట్టి సరికొత్త రికార్డ్
రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా తెరకెక్కిన చిత్రం కాంతార చాప్టర్ 1. జయరామ్, గుల్షన్ దేవయ్య, ప్రమోద్ శెట్టి, రాకేశ్ పూజారి, ప్రకాశ్ తుమినాడ్, దీపక్ రామ్ పనాజీ, హరిప్రసాద్ తదితరులు ఇతర కీలకపాత్రలు పోషించారు. అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా.. అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రాఫర్‌గా, సురేష్ మల్లయ్య ఎడిటింగ్ బాధ్యలు నిర్వర్తించారు. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్, చాలువే గౌడలు నిర్మాతలుగా వ్యవహరించారు. విజయదశమి కానుకగా అక్టోబర్ 2వ తేదీన విడుదలైన ఈ సినిమా రికార్డ్ కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. తాజాగా ఆస్ట్రేలియాలో కాంతార చాప్టర్ 1 సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ వివరాల్లోకి వెళితే..
కాంతార చాప్టర్ 1 బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రచార కార్యక్రమాలతో కలిపి కాంతార చాప్టర్ 1కు 125 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యింది. కాంతార బ్రాండ్ నేమ్‌తో పాటు టీజర్, ట్రైలర్ల కారణంగా ఈ సినిమాకు భారీ బిజినెస్ జరిగింది. నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్ 96 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల రూపాయలు, కర్ణాటక థియేట్రికల్ రైట్స్ 169 కోట్ల రూపాయలు, తమిళనాడు హక్కులు 13 కోట్ల రూపాయలు, కేరళ రైట్స్ 20 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ రైట్స్ 44.5 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా సుమారుగా 440 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రిషబ్ శెట్టి మూవీ లాభాల్లోకి రావాలంటే.. బాక్సాఫీస్ వద్ద దాదాపు 850 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టాలని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు. కాంతార చాప్టర్ 1 చిత్రాన్ని వరల్డ్ వైడ్‌గా 4400 థియేటర్‌లలో విడుదల చేశారు.

కాంతార చాప్టర్ 1 కలెక్షన్స్
కాంతార చాప్టర్ 1కు పెయిడ్ ప్రీమియర్స్‌తో కలిపి ఇండియా వైడ్‌గా తొలి రోజున 61.85 కోట్ల రూపాయలు, రెండో రోజున 45.4 కోట్ల రూపాయలు, మూడో రోజున 55 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 63 కోట్ల రూపాయలు, ఐదో రోజున 31.5 కోట్ల రూపాయలు, ఆరో రోజున 34.25 కోట్ల రూపాయలు, ఏడో రోజున 25 కోట్ల రూపాయలు, ఎనిమిదవ రోజున 21.25 కోట్ల రూపాయలు, తొమ్మిదవ రోజున 22.35 కోట్ల రూపాయలు, పదో రోజున 39 కోట్ల రూపాయలు, పదకొండో రోజున 39.75 కోట్ల రూపాయలు, పన్నెండవ రోజున 13.5 కోట్ల రూపాయలు, పదమూడో రోజున 14 కోట్ల రూపాయలు, పద్నాలుగో రోజున 10.5 కోట్ల రూపాయలు, పదిహేనవ రోజున 8.85 కోట్ల రూపాయలు, పదహారవ రోజున 8.5 కోట్ల రూపాయలు, పదిహేడవ రోజున 12.5 కోట్ల రూపాయలు, పద్దెనిమిదవ రోజున 17 కోట్ల రూపాయలు, పందొమ్మిదవ రోజున 11.65 కోట్ల రూపాయలు, ఇరవయ్యో రోజున 11.75 కోట్ల రూపాయలు, ఇరవై ఒకటో రోజున 10.6 కోట్ల రూపాయలు, ఇరవై రెండవ రోజున 6.25 కోట్ల రూపాయలు, ఇరవై మూడో రోజున 6.1 కోట్ల రూపాయలు, ఇరవై నాలుగో రోజున 9 కోట్ల రూపాయలు, ఇరవై ఐదో రోజున 10.4 కోట్ల రూపాయలు, ఇరవై ఆరో రోజున 3.25 కోట్ల రూపాయలు చొప్పున ఇండియాలో 592.52 కోట్ల రూపాయల నెట్... 703 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది కాంతార. రిషబ్ శెట్టి మూవీకి తొలి వారం ఇండియా వైడ్ 337.4 కోట్ల రూపాయలు, రెండో వారంలో 147.85 కోట్ల రసూపాయలు, మూడో వారంలో 78.85 కోట్ల రూపాయలు చొప్పున వసూలు చేసింది కాంతార.
కాంతార చాప్టర్ 1 ఓవర్సీస్ కలెక్షన్
కొత్త సినిమాల సందడి ఉన్నప్పటికీ నార్త్ అమెరికాలో కాంతార చాప్టర్ 1కు మంచి ఆదరణ లభిస్తోంది. ఇప్పటి వరకు యూఎస్ఏ, కెనడాలలో రిషబ్ శెట్టి చిత్రం 4.7 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో 41.51 కోట్ల రూపాయలు) రాబట్టింది. మిగిలిన దేశాల నుంచి 68 కోట్ల కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఓవర్సీస్‌లో ఇప్పటి వరకు రిషబ్ శెట్టి మూవీకి 110 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి ఈ చిత్రం ఇప్పటి వరకు వరల్డ్ వైడ్‌గా 813 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తద్వారా 800 కోట్ల రూపాయల క్లబ్‌లోకి చేరిన మరో కన్నడ మూవీగా నిలిచింది.
తెలుగు రాష్ట్రాల్లో కాంతార వసూళ్లు
తెలుగులో పెయిడ్ ప్రీమియర్స్‌తో కలిపి ఈ సినిమాకు తొలి రోజున 13 కోట్ల రూపాయలు, రెండో రోజున 11.5 కోట్ల రూపాయలు, మూడో రోజున 11.25 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 11.5 కోట్ల రూపాయలు, ఐదో రోజున 5.4 కోట్ల రూపాయలు, ఆరో రోజున 4.75 కోట్ల రూపాయలు, ఏడో రోజున 3.5 కోట్ల రూపాయలు, ఎనిమిదవ రోజున 2.65 కోట్ల రూపాయలు, తొమ్మిదవ రోజున 3.25 కోట్ల రూపాయలు, పదో రోజున 5 కోట్ల రూపాయలు, పదకొండో రోజున 4.85 కోట్ల రూపాయలు, పన్నెండో రోజున 1.35 కోట్ల రూపాయలు, పదమూడో రోజున 1.5 కోట్ల రూపాయ, పద్నాలుగో రోజున 1.1 కోట్ల రూపాయలు, పదిహేనవ రోజున 90 లక్షలు, పదహారో రోజున 65 లక్షల రూపాయలు, పదిహేడవ రోజున 1.1 కోట్లు, పద్దెనిమిదవ రోజున 1.4 కోట్ల రూపాయలు, పందొమ్మిదవ రోజున కోటి రూపాయలు, ఇరవయ్యో రోజున 85 లక్షల రూపాయలు, ఇరవై ఒకటో రోజున 40 లక్షల రూపాయలు, ఇరవై రెండవ రోజున 25 లక్షల రూపాయలు, ఇరవై మూడో రోజున 25 లక్షల రూపాయలు, ఇరవై నాలుగో రోజున 60 లక్షల రూపాయలు, ఇరవై ఐదో రోజున 75 లక్షల రూపాపయలు, ఇరవై ఆరో రోజున 14 లక్షల రూపాయలు చొప్పున 89.14 కోట్ల రూపాయలు రాబట్టింది.
ఇండియాలోని పలు ప్రాంతాల్లో కాంతార చాప్టర్ 1 వసూళ్లు పరిశీలిస్తే... కర్ణాటకలో 236.05 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 104.85 కోట్ల రూపాయలు, తమిళనాడులో 69.7 కోట్ల రూపాయలు, కేరళలో 54.9 కోట్ల రూపాయలు, హిందీలో 237.5 కోట్ల రూపాయలు చొప్పున వసూళ్లు రాబట్టింది.
ఆస్ట్రేలియాలో కాంతార రికార్డ్
భారత్‌తో పాటు ఓవర్సీస్‌లోనూ ప్రభంజనం సృష్టిస్తోన్న ఈ సినిమా తాజాగా ఆస్ట్రేలియాలో అరుదైన ఘనతను సాధించింది. 2025లో ఆస్ట్రేలియాలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. అక్టోబర్ 26 వరకు రిషబ్ శెట్టి మూవీ 1.80 మిలియన్ల ఆస్ట్రేలియా డాలర్లు ( భారత కరెన్సీలో 10.5 కోట్ల రూపాయలు) రాబట్టింది. ఓవర్సీస్ మార్కెట్‌లో నార్త్ అమెరికా స్థాయిలో కాంతారకు వసూళ్లను అందిస్తోంది ఆస్ట్రేలియా. మరి థియేట్రికల్ రన్ ముగిసేసరికి రిషబ్ శెట్టి మూవీకి కంగారూ గడ్డపై ఎన్ని కోట్లు వస్తాయో చూడాలి.


Click it and Unblock the Notifications











