కాంతార వసూళ్ల విధ్వంసం... కేజీఎఫ్ 2 రికార్డ్ బ్రేక్, కన్నడ గడ్డపై రిషబ్ శెట్టి సరికొత్త చరిత్ర
రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరంగదూర్, చాలువే గౌడలు నిర్మించిన చిత్రం కాంతార చాప్టర్ 1. గతంలో వచ్చిన కాంతారకు సీక్వెల్‌గా ఈ సినిమాను నిర్మించారు. కాంతార చాప్టర్ 1లో రిషబ్ శెట్టి సరసన రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటించారు. జయరామ్, గుల్షన్ దేవయ్య, ప్రమోద్ శెట్టి, రాకేశ్ పూజారి, ప్రకాశ్ తుమినాడ్, దీపక్ రామ్ పనాజీ, హరిప్రసాద్ తదితరులు ఇతర కీలకపాత్రలు పోషించారు. అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా.. అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రాఫర్‌గా, సురేష్ మల్లయ్య ఎడిటర్‌గా పనిచేశారు. విజయదశమి కానుకగా అక్టోబర్ 2వ తేదీ ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్ రోజు నుంచి నేటి వరకు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోన్న కాంతార చాప్టర్ 1.. తాజాగా కర్ణాటకలో మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఈ వివరాల్లోకి వెళితే..
కర్ణాటకలో కాంతార ప్రీ రిలీజ్ బిజినెస్
కాంతార చాప్టర్ 1 బడ్జెట్ ఎంత? నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి కాంతార చాప్టర్ 1కు 125 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యింది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే... కర్ణాటకలో రికార్డ్ స్థాయిలో 169 కోట్ల రూపాయల మేర రిషబ్ శెట్టి మూవీ బిజినెస్ చేసింది. ఇక్కడ కాంతార చాప్టర్ 1 లాభాల్లోకి రావాలంటే 170 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్... 340 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ కట్టారు.

కాంతార వరల్డ్ వైడ్ బిజినెస్ట్ & బ్రేక్ ఈవెన్ టార్గెట్
కాంతార చాప్టర్ 1 ప్రీ రిలీజ్ బిజినెస్ ఇక ఇతర రాష్ట్రాల్లో కాంతార చాప్టర్ 1 ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే.... తెలుగులో 100 కోట్ల రూపాయలు, తమిళనాడు హక్కులు 13 కోట్ల రూపాయలు, కేరళ రైట్స్ 20 కోట్ల రూపాయలు, నార్త్ ఇండియా రైట్స్ 96 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ రైట్స్ 44.5 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా సుమారుగా 440 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రిషబ్ శెట్టి మూవీ లాభాల్లోకి రావాలంటే.. బాక్సాఫీస్ వద్ద దాదాపు 850 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టాల్సి ఉంటుంది అని ట్రేడ్ పండితులు వాల్యూ కట్టారు. కాంతార చాప్టర్ 1ని ప్రపంచవ్యాప్తంగా 4400 థియేటర్‌లలో విడుదల చేశారు
కర్ణాటకలో కాంతార చాప్టర్ 1 కలెక్షన్స్
తొలిరోజున కర్ణాటకలో ఈ మూవీకి 19.6 కోట్ల రూపాయలు, రెండో రోజున 13.5 కోట్ల రూపాయలు, మూడో రోజున 14.5 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 16.75 కోట్ల రూపాయలు, ఐదో రోజున 12 కోట్ల రూపాయలు, ఆరో రోజున 13.5 కోట్ల రూపాయలు, ఏడో రోజున 9.25 కోట్ల రూపాయలు, ఎనిమిదో రోజున 7.85 కోట్ల రూపాయలు, తొమ్మిదో రోజున 7.5 కోట్ల రూపాయలు, పదో రోజున 11.50 కోట్ల రూపాయల, పదకొండవ రోజున 12 కోట్ల రూపాయలు, పన్నెండవ రోజున 4.75 కోట్ల రూపాయలు, పదమూడో రోజున 3.9 కోట్ల రూపాయలు, పద్నాలగో రోజున 3.35 కోట్ల రూపాయలు, పదిహేనవ రోజున 2.7 కోట్ల రూపాయలు, పదహారో రోజున 3.05 కోట్ల రూపాయలు చొప్పున కర్ణాటకలో ఇప్పటి వరకు నికరంగా 155.7 కోట్ల రూపాయలు వసూలు చేసింది కాంతార. అలాగే తొలివారం ఇక్కడ 106.95 కోట్ల రూపాయలు, రెండో వారం 45.7 కోట్ల రూపాయలు చొప్పున రాబట్టాడు రిషబ్ శెట్టి.
కేజీఎఫ్ 2 రికార్డులు బ్రేక్
కర్ణాటకలో అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడ సినిమాగా ప్రశాంత్ నీల్ - యశ్‌ల చిత్రం నిలిచింది. ఈ సినిమా తన టోటల్ థియేట్రికల్ రన్‌లో కర్ణాటకలో 182.96 కోట్ల రూపాయలు రాబట్టి సంచలనం సృష్టించింది. అయితే కాంతార చాప్టర్ 1 కేవలం 16 రోజుల్లోనే ఈ రికార్డును తిరగరాసింది. కర్ణాటకలో సోలోగా 200 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించిన తొలి కన్నడ సినిమాగా రిషబ్ శెట్టి చిత్రం అరుదైన ఘనతను సాధించింది. ఇప్పటికే కర్ణాటకలో అత్యంత వేగంగా 100 కోట్ల రూపాయలు, 150 కోట్ల రూపాయలు రాబట్టిన ఘనత కూడా కాంతార చాప్టర్ 1దే.
కాంతార చాప్టర్ 1 కలెక్షన్స్
కాంతార చాప్టర్ 1కు ఇండియాలోని ఇతర రాష్ట్రాల్లోని వసూళ్లు పరిశీలిస్తే.. కర్ణాటకలో 155.7 కోట్ల రూపాయలు, తెలుగులో 82.54 కోట్ల రూపాయలు, హిందీలో 166.5 కోట్ల రూపాయలు, తమిళంలో 50.72 కోట్ల రూపాయలు, మలయాళంలో 38.91 కోట్ల రూపాయలు వచ్చాయి. దాంతో ఇండియా వైడ్ ఇప్పటి వరకు 494.37 కోట్ల రూపాయల నెట్... 579.5 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు సాక్‌నిక్ తెలిపింది. ఇక ఓవర్సీస్‌లోనూ కాంతార వసూళ్ల వర్షం కురిపిస్తోంది. నార్త్ అమెరికాలో ఈ చిత్రం ఇప్పటి వరకు 4.4 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో 38.69 కోట్ల రూపాయలు) వసూలు చేసింది. ఇతర దేశాలలో 63 కోట్ల కలెక్ట్ చేసింది. దాంతో ఓవరాల్‌గా ఓవర్సీస్‌లో కాంతార చాప్టర్ 1 ఇప్పటి వరకు 101 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి ఈ సినిమా ఇప్పటి వరకు వరల్డ్ వైడ్‌గా 681 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసినట్లు సాక్‌నిక్ తెలిపింది. అయితే కాంతార చాప్టర్ 1 రెండు వారాల్లోనే వరల్డ్ వైడ్‌గా 717.50 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ అధికారికంగా ప్రకటించింది.


Click it and Unblock the Notifications











