ఆ థియేటర్‌లో కాంతార సంచలన రికార్డ్... 15 రోజుల్లో రిషబ్ శెట్టి మూవీకి ఎన్ని కోట్లంటే?

అక్టోబర్ 2న విడుదలైన కాంతార చాప్టర్ 1 చిత్రం అన్ని రికార్డులను తిరగరాస్తూ దూసుకెళ్తోంది. ఇప్పటికే 700 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం 800 కోట్ల మార్క్ వైపు పరుగులు తీస్తోంది. ఈ నేపథ్యంలో ఒక్కో ఏరియాలో ఒక్కో రికార్డ్‌ను బద్ధలు కొడుతోంది. కర్ణాటకలో 200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించిన తొలి కన్నడ సినిమాగా కేజీఎఫ్ 2 రికార్డ్‌ను కాంతార చాప్టర్ 1 బద్ధలు కొట్టింది. తాజాగా ఓ థియేటర్‌లో షోలు, కలెక్షన్స్ పరంగా రిషబ్ శెట్టి మూవీ ఓ రికార్డ్ సృష్టించింది. ఈ వివరాల్లోకి వెళితే..

రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరంగదూర్, చాలువే గౌడలు కాంతార చాప్టర్ 1 మూవీని నిర్మించారు. గతంలో వచ్చిన కాంతారకు సీక్వెల్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో రిషబ్ శెట్టి సరసన రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటించారు. జయరామ్, గుల్షన్ దేవయ్య, ప్రమోద్ శెట్టి, రాకేశ్ పూజారి, ప్రకాశ్ తుమినాడ్, దీపక్ రామ్ పనాజీ, హరిప్రసాద్ తదితరులు ఇతర కీలకపాత్రలు పోషించారు. అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా.. అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రాఫర్‌గా, సురేష్ మల్లయ్య ఎడిటర్‌గా పనిచేశారు.

Kantara Chapter 1 Box Office Rishab Shetty s Movie create record in PVR Orion Mall Bengaluru

కర్ణాటకలో కాంతార ప్రీ రిలీజ్ బిజినెస్
కాంతార చాప్టర్ 1 బడ్జెట్ ఎంత? నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి కాంతార చాప్టర్ 1కు 125 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యింది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే... కర్ణాటకలో రికార్డ్ స్థాయిలో 169 కోట్ల రూపాయల మేర రిషబ్ శెట్టి మూవీ బిజినెస్ చేసింది. ఇక్కడ కాంతార చాప్టర్ 1 లాభాల్లోకి రావాలంటే 170 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్... 340 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ కట్టారు.

కాంతార వరల్డ్ వైడ్ బిజినెస్ట్ & బ్రేక్ ఈవెన్ టార్గెట్
కాంతార చాప్టర్ 1 ప్రీ రిలీజ్ బిజినెస్ ఇక ఇతర రాష్ట్రాల్లో కాంతార చాప్టర్ 1 ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే.... తెలుగులో 100 కోట్ల రూపాయలు, తమిళనాడు హక్కులు 13 కోట్ల రూపాయలు, కేరళ రైట్స్ 20 కోట్ల రూపాయలు, నార్త్ ఇండియా రైట్స్ 96 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ రైట్స్ 44.5 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా సుమారుగా 440 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రిషబ్ శెట్టి మూవీ లాభాల్లోకి రావాలంటే.. బాక్సాఫీస్ వద్ద దాదాపు 850 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టాల్సి ఉంటుంది అని ట్రేడ్ పండితులు వాల్యూ కట్టారు. కాంతార చాప్టర్ 1ని ప్రపంచవ్యాప్తంగా 4400 థియేటర్‌లలో విడుదల చేశారు

కర్ణాటకలో కాంతార చాప్టర్ 1 కలెక్షన్స్
తొలిరోజున కర్ణాటకలో ఈ మూవీకి 19.6 కోట్ల రూపాయలు, రెండో రోజున 13.5 కోట్ల రూపాయలు, మూడో రోజున 14.5 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 16.75 కోట్ల రూపాయలు, ఐదో రోజున 12 కోట్ల రూపాయలు, ఆరో రోజున 13.5 కోట్ల రూపాయలు, ఏడో రోజున 9.25 కోట్ల రూపాయలు, ఎనిమిదో రోజున 7.85 కోట్ల రూపాయలు, తొమ్మిదో రోజున 7.5 కోట్ల రూపాయలు, పదో రోజున 11.50 కోట్ల రూపాయల, పదకొండవ రోజున 12 కోట్ల రూపాయలు, పన్నెండవ రోజున 4.75 కోట్ల రూపాయలు, పదమూడో రోజున 3.9 కోట్ల రూపాయలు, పద్నాగులో రోజున 3.35 కోట్ల రూపాయలు, పదిహేనవ రోజున 2.7 కోట్ల రూపాయలు, పదహారో రోజున 2.85 కోట్ల రూపాయలు, పదిహేడో రోజున 4.65 కోట్ల రూపాయలు చొప్పున కర్ణాటకలో ఇప్పటి వరకు నికరంగా 160.15 కోట్ల రూపాయలు వసూలు చేసింది కాంతార. అలాగే తొలివారం ఇక్కడ 106.95 కోట్ల రూపాయలు, రెండో వారం 45.7 కోట్ల రూపాయలు చొప్పున రాబట్టాడు రిషబ్ శెట్టి.

ఆ థియేటర్‌లో కాంతార రికార్డ్
కర్ణాటక వ్యాప్తంగా కాంతార చాప్టర్ 1కు తిరుగులేని ఆదరణ లభిస్తోంది. విడుదలై 15 రోజులు దాటుతున్నా అక్కడ థియేటర్‌లలో హౌస్‌ఫుల్ బోర్డ్స్ కనిపిస్తూనే ఉన్నాయి. రాష్ట్ర రాజధాని బెంగళూరుతో పాటు ప్రధాన నగరాలైన మైసూర్, మంగళూరు, హుబ్లీ- ధార్వాడ్, హాసన్, బళ్లారి, దావణగెరె తదితర ప్రాంతాల్లో థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదవుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే దేశంలోని అతిపెద్ద మల్టీప్లెక్స్ చైన్ అయిన పీవీఆర్‌‌కు చెందిన బెంగళూరులోని పీవీఆర్ ఓరియన్ మాల్‌‌లో కాంతార చాప్టర్ 1 కలెక్షన్స్, షోల పరంగా అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకుంది. ఇక్కడ 15 రోజుల నుంచి 550కి పైగా షోలు ప్రదర్శితమై... ఒక్క థియేటర్‌లోనే 5 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. వీకెండ్ కావడంతో శని, ఆదివారాల్లో ఓరియన్ మాల్‌లో భారీగా బుకింగ్స్ నమోదైనట్లుగా తెలుస్తోంది. మరి రానున్న రోజుల్లో కాంతార చాప్టర్ 1 ఈ థియేటర్‌లో ఏ స్థాయిలో వసూళ్లు రాబడుతుందో చూడాలి.

కాంతార చాప్టర్ 1 కలెక్షన్స్
కాంతార చాప్టర్ 1కు 17 రోజుల వరకు ఇండియాలోని ఇతర రాష్ట్రాల్లోని వసూళ్లు పరిశీలిస్తే.. కర్ణాటకలో 160.15 కోట్ల రూపాయలు, తెలుగులో 83.45 కోట్ల రూపాయలు, హిందీలో 171.15 కోట్ల రూపాయలు, తమిళంలో 51.75 కోట్ల రూపాయలు, మలయాళంలో 39.75 కోట్ల రూపాయలు వచ్చాయి. దాంతో ఇండియా వైడ్ ఇప్పటి వరకు 506.25 కోట్ల రూపాయల నెట్... 589.5 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు సాక్‌నిక్ తెలిపింది. ఇక ఓవర్సీస్‌లోకాంతార చాప్టర్ 1 ఇప్పటి వరకు 104.5 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి ఈ సినిమా ఇప్పటి వరకు వరల్డ్ వైడ్‌గా 694 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసినట్లు సాక్‌నిక్ తెలిపింది. అయితే కాంతార చాప్టర్ 1 రెండు వారాల్లోనే వరల్డ్ వైడ్‌గా 717.50 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ అధికారికంగా ప్రకటించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X