Kantara Chapter 1 Box Office: ఛావా రికార్డ్ బ్రేక్... రిషబ్ శెట్టి మరో సంచలనం, కాంతారకు ఎన్ని కోట్లంటే?
రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన కాంతార చాప్టర్ 1 చిత్రం.. తన కలెక్షన్ల విధ్వంసం కొనసాగిస్తోంది. 800 కోట్లకు వసూళ్లతో ఒక్కొక్క సినిమా రికార్డును బద్ధలు కొడుతోంది. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్, చాలువే గౌడలు ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 2వ తేదీన విడుదలైన ఈ సినిమాలో రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటించగా.. యరామ్, గుల్షన్ దేవయ్య, ప్రమోద్ శెట్టి, రాకేశ్ పూజారి, ప్రకాశ్ తుమినాడ్, దీపక్ రామ్ పనాజీ, హరిప్రసాద్ తదితరులు ఇతర కీలకపాత్రలు పోషించారు. అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా.. అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రాఫర్‌గా, సురేష్ మల్లయ్య ఎడిటింగ్ బాధ్యలు నిర్వర్తించారు. తాజాగా కాంతార చాప్టర్ 1 మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఈ వివరాల్లోకి వెళితే...
కాంతార చాప్టర్ 1 బడ్జెట్ ఎంత?
కాంతార చాప్టర్ 1లో జనటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రచార కార్యక్రమాలతో కలిపి కాంతార చాప్టర్ 1కు 125 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యింది. కాంతార బ్రాండ్ నేమ్‌తో పాటు టీజర్, ట్రైలర్ల కారణంగా ఈ సినిమాకు భారీ బిజినెస్ జరిగింది. నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్ 96 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల రూపాయలు, కర్ణాటక థియేట్రికల్ రైట్స్ 169 కోట్ల రూపాయలు, తమిళనాడు హక్కులు 13 కోట్ల రూపాయలు, కేరళ రైట్స్ 20 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ రైట్స్ 44.5 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా సుమారుగా 440 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రిషబ్ శెట్టి మూవీ లాభాల్లోకి రావాలంటే.. బాక్సాఫీస్ వద్ద దాదాపు 850 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టాలని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు. కాంతార చాప్టర్ 1 చిత్రాన్ని వరల్డ్ వైడ్‌గా 4400 థియేటర్‌లలో విడుదల చేశారు.

కాంతార చాప్టర్ 1 కలెక్షన్స్
కాంతార చాప్టర్ 1కు పెయిడ్ ప్రీమియర్స్‌తో కలిపి ఇండియా వైడ్‌గా తొలి రోజున 61.85 కోట్ల రూపాయలు, రెండో రోజున 45.4 కోట్ల రూపాయలు, మూడో రోజున 55 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 63 కోట్ల రూపాయలు, ఐదో రోజున 31.5 కోట్ల రూపాయలు, ఆరో రోజున 34.25 కోట్ల రూపాయలు, ఏడో రోజున 25 కోట్ల రూపాయలు, ఎనిమిదవ రోజున 21.25 కోట్ల రూపాయలు, తొమ్మిదవ రోజున 22.35 కోట్ల రూపాయలు, పదో రోజున 39 కోట్ల రూపాయలు, పదకొండో రోజున 39.75 కోట్ల రూపాయలు, పన్నెండవ రోజున 13.5 కోట్ల రూపాయలు, పదమూడో రోజున 14 కోట్ల రూపాయలు, పద్నాలుగో రోజున 10.5 కోట్ల రూపాయలు, పదిహేనవ రోజున 8.85 కోట్ల రూపాయలు, పదహారవ రోజున 8.5 కోట్ల రూపాయలు, పదిహేడవ రోజున 12.5 కోట్ల రూపాయలు, పద్దెనిమిదవ రోజున 17 కోట్ల రూపాయలు, పందొమ్మిదవ రోజున 11.65 కోట్ల రూపాయలు, ఇరవయ్యో రోజున 11.75 కోట్ల రూపాయలు, ఇరవై ఒకటో రోజున 10.6 కోట్ల రూపాయలు, ఇరవై రెండవ రోజున 6.25 కోట్ల రూపాయలు, ఇరవై మూడో రోజున 3.06 కోట్ల రూపాయలు చొప్పున ఇండియాలో 567.16 కోట్ల రూపాయల నెట్... 675 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది కాంతార.
కాంతార చాప్టర్ 1 ఓవర్సీస్ కలెక్షన్
రిషబ్ శెట్టి మూవీకి నార్త్ అమెరికాలో 4.7 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో 41.27 కోట్ల రూపాయలు) వసూలు అవ్వగా.. యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, గల్ఫ్, మిడిల్ ఈస్ట్, యూరప్ తదితర దేశాలలో ఈ సినిమాకు 67 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. దాంతో మొత్తంగా ఓవర్సీస్‌లో కాంతార చాప్టర్ 1కు 109 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ వసూళ్లు కలిపి ఈ సినిమాకు ఇప్పటి వరకు వరల్డ్ వైడ్‌గా 794 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్లు సాక్‌నిక్ తెలిపింది.
తెలుగు రాష్ట్రాల్లో కాంతార వసూళ్లు
తెలుగులో పెయిడ్ ప్రీమియర్స్‌తో కలిపి ఈ సినిమాకు తొలి రోజున 13 కోట్ల రూపాయలు, రెండో రోజున 11.5 కోట్ల రూపాయలు, మూడో రోజున 11.25 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 11.5 కోట్ల రూపాయలు, ఐదో రోజున 5.4 కోట్ల రూపాయలు, ఆరో రోజున 4.75 కోట్ల రూపాయలు, ఏడో రోజున 3.5 కోట్ల రూపాయలు, ఎనిమిదవ రోజున 2.65 కోట్ల రూపాయలు, తొమ్మిదవ రోజున 3.25 కోట్ల రూపాయలు, పదో రోజున 5 కోట్ల రూపాయలు, పదకొండో రోజున 4.85 కోట్ల రూపాయలు, పన్నెండో రోజున 1.35 కోట్ల రూపాయలు, పదమూడో రోజున 1.5 కోట్ల రూపాయ, పద్నాలుగో రోజున 1.1 కోట్ల రూపాయలు, పదిహేనవ రోజున 90 లక్షలు, పదహారో రోజున 65 లక్షల రూపాయలు, పదిహేడవ రోజున 1.1 కోట్లు, పద్దెనిమిదవ రోజున 1.4 కోట్ల రూపాయలు, పందొమ్మిదవ రోజున కోటి రూపాయలు, ఇరవయ్యో రోజున 85 లక్షల రూపాయలు, ఇరవై ఒకటో రోజున 40 లక్షల రూపాయలు, ఇరవై రెండవ రోజున 25 లక్షల రూపాయలు, ఇరవై మూడో రోజున 16 లక్షల రూపాయలు చొప్పున 87.60 కోట్ల రూపాయల నికర వసూళ్లను సాధించింది.
ఛావాను క్రాస్ చేసిన కాంతార చాప్టర్ 1
ఇండియాలోని రాష్ట్రాల వారీగా కాంతార చాప్టర్ 1 వసూళ్లు పరిశీలిస్తే... కర్ణాటకలో 225.75 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాలలో 102.95 కోట్ల రూపాయలు, తమిళనాడులో 66.7 కోట్ల రూపాయలు, కేరళలలో 53.35 కోట్ల రూపాయలు, హిందీ+ రెస్టాఫ్ ఇండియాలో 223.85 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 109 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇప్పటికే హిందీ, కన్నడంలో 200 కోట్ల మార్క్ దాటిన కాంతార చాప్టర్ 1 పలు రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. దక్షిణాదిలోని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 50 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ మార్క్‌ను అధిగమించింది.
తాజాగా రిషబ్ శెట్టి మూవీ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. విక్కీ కౌశల్, రష్మిక మందన్నల ఛావా టోటల్ కలెక్షన్స్‌ను అధిగమించింది. ఛావా తన లైఫ్ టైం రన్‌లో 807 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టగా.. దానిని కాంతార కేవలం మూడు వారాల్లోనే 817 కోట్ల రూపాయలు రాబట్టినట్లు ప్రముఖ క్రిటిక్ రమేశ్ బాలా ట్వీట్ చేశారు. శని, ఆదివారాల్లో కాంతార మరిన్ని వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని తద్వారా 900 కోట్ల క్లబ్‌కు మరింత చేరువ అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











