Kantara: Chapter 1 Box Office: కాంతార చాప్టర్ 1 రేర్ ఫీట్... బాహుబలి సరసన రిషబ్ శెట్టి మూవీ

కాంతారకు ప్రీక్వెల్‌గా రిషబ్ శెట్టి తెరకెక్కించిన మూవీ కాంతార చాప్టర్ 1 అంచనాలను అందుకుంటూ కలెక్షన్స్ సాధిస్తూ వెళ్తోంది. కేవలం వారం రోజుల్లోనే 500 కోట్లకు పైగా వసూళ్లతో సంచలనం సృష్టిస్తోంది. టైగర్ 3, వార్ 2 తదితర చిత్రాల లైఫ్ టైం కలెక్షన్స్‌ రికార్డులను అధిగమిస్తూ దూసుకెళ్తోంది. తాజాగా రిషబ్ శెట్టి మూవీ... బాహుబలి మాదిరిగా ఓ రేర్ రికార్డుకు చేరువైంది. ఈ వివరాల్లోకి వెళితే..

కాంతార చాప్టర్ 1 బడ్జెట్ ఎంత?
ఈ సినిమాలో రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటించారు. జయరామ్, గుల్షన్ దేవయ్య, ప్రమోద్ శెట్టి, రాకేశ్ పూజారి, ప్రకాశ్ తుమినాడ్, దీపక్ రామ్ పనాజీ, హరిప్రసాద్ తదితరులు ఇతర కీలకపాత్రలు పోషించారు. అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా.. అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రాఫర్‌గా, సురేష్ మల్లయ్య ఎడిటింగ్ బాధ్యలు నిర్వర్తించారు. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరంగదూర్, చాలువే గౌడలు కాంతార చాప్టర్ 1ను నిర్మించగా... అక్టోబర్ 2వ తేదీ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది.

Kantara Chapter 1 Box Office Rishab Shetty s Movie is likely to repeat Baahubali 2 feat

నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి కాంతార చాప్టర్ 1కు 125 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యింది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే... నైజాంలో 40 కోట్లు, ఆంధ్రలో 45 కోట్లు, సీడెడ్ ఏరియాలో 15 కోట్లు చొప్పున తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల రూపాయల వ్యాపారం చేసింది. దాంతో కాంతార చాప్టర్ 1 తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ కావాలంటే 101 రూపాయల షేర్, 202 కోట్ల రూపాయలు గ్రాస్ రాబట్టాల్సి ఉంది.

కాంతార ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత?
అలాగే కర్ణాటక థియేట్రికల్ రైట్స్ 169 కోట్ల రూపాయలు, తమిళనాడు హక్కులు 13 కోట్ల రూపాయలు, కేరళ రైట్స్ 20 కోట్ల రూపాయలు, నార్త్ ఇండియా రైట్స్ 96 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ రైట్స్ 44.5 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా సుమారుగా 440 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రిషబ్ శెట్టి మూవీ లాభాల్లోకి రావాలంటే.. బాక్సాఫీస్ వద్ద దాదాపు 850 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టాల్సి ఉంటుంది అని ట్రేడ్ పండితులు వాల్యూ కట్టారు. కాంతార చాప్టర్ 1ని ప్రపంచవ్యాప్తంగా 4400 థియేటర్‌లలో విడుదల చేశారు.

కాంతార చాప్టర్ 1 కలెక్షన్స్
కాంతార చాప్టర్ 1కు పెయిడ్ ప్రీమియర్స్‌తో కలిపి ఇండియా వైడ్‌గా తొలి రోజున 61.85 కోట్ల రూపాయలు, రెండో రోజున 45.4 కోట్ల రూపాయలు, మూడో రోజున 55 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 63 కోట్ల రూపాయలు, ఐదో రోజున 31.5 కోట్ల రూపాయలు, ఆరో రోజున 34.25 కోట్ల రూపాయలు, ఏడో రోజున 25 కోట్ల రూపాయలు, ఎనిమిదవ రోజున 21.25 కోట్ల రూపాయలు, తొమ్మిదవ రోజున 22.35 కోట్ల రూపాయల కలెక్షన్స్ అందుకుంది. దాంతో ఈ సినిమాకు 9 రోజుల వరకు ఇండియాలో 359.75 కోట్ల రూపాయల నెట్.. 428.75 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు సాక్‌నిక్ తెలిపింది. అయితే కాంతార చాప్టర్ 1 తొలి వారంలోనే వరల్డ్ వైడ్‌గా 509.25 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ తెలిపింది.

కాంతార చాప్టర్ 1 ఓవర్సీస్ కలెక్షన్స్
కాంతార ఓవర్సీస్ కలెక్షన్స్ పరిశీలిస్తే... ఒక్క నార్త్ అమెరికాలో ఇప్పటి వరకు 3.5 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో 31.5 కోట్ల రూపాయలు) రాబట్టింది. ఇక యూకే, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, గల్ఫ్, మిడిల్ ఈస్ట్ తదితర దేశాలలో 44 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టింది. దాంతో ఓవరాల్‌గా ఓవర్సీస్ మార్కెట్‌లో ఇప్పటి వరకు కాంతార చాప్టర్ 1 మూవీ 75 కోట్ల రూపాయల కలెక్షన్స్ అందుకున్నట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

ఇండియాలోని వివిధ ప్రాంతాల్లో 9 రోజుల వరకు కాంతార చాప్టర్ 1 వసూళ్లు పరిశీలిస్తే.. కర్ణాటకలో 114.7 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాలలో 66.8 కోట్ల రూపాయలు, హిందీలో 115.75 కోట్ల రూపాయలు, తమిళనాడులో 34 కోట్ల రూపాయలు, మలయాళంలో 28.5 కోట్ల రూపాయలు చొప్పున రాబట్టినట్లు సాక్‌నిక్ తెలిపింది.

బాహుబలి రికార్డ్‌కు చేరువగా కాంతార
ఈ కలెక్షన్స్‌తో కాంతార చాప్టర్ 1 ఓ అరుదైన రికార్డుకు చేరువైంది. అది కూడా బాహుబలి 2 సరసన నిలిచే ఛాన్స్‌కు అడుగు దూరంలో నిలిచింది. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి 2 చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 100 కోట్ల రూపాయలకు పైగా నెట్ కలెక్షన్స్ రాబట్టింది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయ చిత్రంగా నిలిచింది. తాజాగా కాంతార చాప్టర్ 1 మూవీ కూడా ఈ ఫీట్‌కు అడుగు దూరంలో నిలిచింది. రిషబ్ శెట్టి మూవీ ఇప్పటికే హిందీలో కేవలం వారం రోజుల్లోనే 115.75 కోట్ల రూపాయలు, కన్నడంలో 114.7 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అయితే తెలుగులో 66.8 కోట్ల రూపాయలు రాబట్టినట్లు సాక్‌నిక్ చెబుతున్నప్పటికీ అనధికారిక లెక్కల ప్రకారం ఇది 80 కోట్లుగా ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ లెక్కన త్వరలోనే కాంతార చాప్టర్ 1 కూడా మూడు భాషల్లో 100 కోట్ల రూపాయల నెట్ వసూలు చేసిన మూవీగా నిలిచే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X