కాంతార చాప్టర్ 1 బాక్సాఫీస్ సంచలనం... 10 రోజుల్లో కర్ణాటక లెక్కలు మార్చేసిన రిషబ్ శెట్టి

కాంతారకు ప్రీక్వెల్‌గా రిషబ్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కాంతార చాప్టర్ 1. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరంగదూర్, చాలువే గౌడలు ఈ సినిమాను నిర్మించారు. రుక్మిణీ వసంత్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించారు. జయరామ్, గుల్షన్ దేవయ్య, ప్రమోద్ శెట్టి, రాకేశ్ పూజారి, ప్రకాశ్ తుమినాడ్, దీపక్ రామ్ పనాజీ, హరిప్రసాద్ తదితరులు ఇతర కీలకపాత్రలు పోషించారు. అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా.. అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రాఫర్‌గా, సురేష్ మల్లయ్య ఎడిటర్‌గా పనిచేశారు. విజయదశమి కానుకగా అక్టోబర్ 2వ తేదీ ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాంతార చాప్టర్ 1 దేశ, విదేశాలలో రికార్డ్ కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. ఇప్పటికే 500 కోట్ల క్లబ్‌లోకి చేరిన ఈ సినిమా... తన సొంత రాష్ట్రం కర్ణాటకలోనూ ప్రభంజనం సృష్టిస్తోంది. కాంతార చాప్టర్ 1 బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఇప్పటి వరకు కర్ణాటకలో ఎన్ని కోట్ల కలెక్షన్స్ రాబట్టిందో పరిశీలిస్తే..

కాంతార చాప్టర్ 1 బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి కాంతార చాప్టర్ 1కు 125 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యింది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే... కర్ణాటకలో రికార్డ్ స్థాయిలో 169 కోట్ల రూపాయల మేర రిషబ్ శెట్టి మూవీ బిజినెస్ చేసింది. ఇక్కడ కాంతార చాప్టర్ 1 లాభాల్లోకి రావాలంటే 170 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్... 340 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ కట్టారు.

Kantara Chapter 1 Box Office Rishab Shetty s Movie sets new benchmark in Karnataka

కాంతార చాప్టర్ 1 ప్రీ రిలీజ్ బిజినెస్
ఇక ఇతర రాష్ట్రాల్లో కాంతార చాప్టర్ 1 ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే.... తెలుగులో 100 కోట్ల రూపాయలు, తమిళనాడు హక్కులు 13 కోట్ల రూపాయలు, కేరళ రైట్స్ 20 కోట్ల రూపాయలు, నార్త్ ఇండియా రైట్స్ 96 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ రైట్స్ 44.5 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా సుమారుగా 440 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రిషబ్ శెట్టి మూవీ లాభాల్లోకి రావాలంటే.. బాక్సాఫీస్ వద్ద దాదాపు 850 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టాల్సి ఉంటుంది అని ట్రేడ్ పండితులు వాల్యూ కట్టారు. కాంతార చాప్టర్ 1ని ప్రపంచవ్యాప్తంగా 4400 థియేటర్‌లలో విడుదల చేశారు.

కాంతార చాప్టర్ 1 వసూళ్లు
కాంతార చాప్టర్ 1కు పెయిడ్ ప్రీమియర్స్‌తో కలిపి ఇండియా వైడ్‌గా తొలి రోజున 61.85 కోట్ల రూపాయలు, రెండో రోజున 45.4 కోట్ల రూపాయలు, మూడో రోజున 55 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 63 కోట్ల రూపాయలు, ఐదో రోజున 31.5 కోట్ల రూపాయలు, ఆరో రోజున 34.25 కోట్ల రూపాయలు, ఏడో రోజున 25 కోట్ల రూపాయలు, ఎనిమిదవ రోజున 21.25 కోట్ల రూపాయలు, తొమ్మిదవ రోజున 22.35 కోట్ల రూపాయలు, పదవ రోజున 38.5 కోట్ల రూపాయలు చొప్పున ఇండియాలో 398.15 కోట్ల రూపాయల నెట్... 474.5 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది.

కాంతార చాప్టర్ 1 ఓవర్సీస్ కలెక్షన్స్
కాంతార ఓవర్సీస్ కలెక్షన్స్ చూస్తే... ఇప్పటి వరకు నార్త్ అమెరికాలో ఈ చిత్రం 3.8 కోట్ల రూపాయల కలెక్షన్స్ (భారత కరెన్సీలో 33.71 కోట్ల రూపాయలు) రాబట్టి 4 మిలియన్ల దిశగా పరుగులు తీస్తోంది. యూరప్, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, గల్ఫ్, మిడిల్ ఈస్ట్ తదితర దేశాలలో ఈ చిత్రానికి 46 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. దాంతో ఓవర్సీస్‌ నుంచి 80 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది రిషబ్ శెట్టి మూవీ. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ వసూళ్లు కలిపి ఇప్పటి వరకు కాంతార చాప్టర్ 1కు 10 రోజుల్లో వరల్డ్ వైడ్‌గా 555 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి.

ఇండియాలోని ఇతర రాష్ట్రాలలో కాంతార కలెక్షన్స్ పరిశీలిస్తే... తెలుగు రాష్ట్రాల్లో 72.05 కోట్ల రూపాయలు, హిందీలో 130 కోట్ల రూపాయలు, తమిళనాడులో 38.75 కోట్ల రూపాయలు, మలయాళంలో 31.65 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 80 కోట్ల రూపాయలు రాబట్టింది రిషబ్ శెట్టి మూవీ.

కర్ణాటకలో కాంతార చాప్టర్ 1 కలెక్షన్స్
సొంత రాష్ట్రం కర్ణాటకలో కాంతార చాప్టర్ 1కు తొలిరోజున 19.6 కోట్ల రూపాయలు, రెండో రోజున 13.5 కోట్ల రూపాయలు, మూడో రోజున 14.5 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 16.75 కోట్ల రూపాయలు, ఐదో రోజున 12 కోట్ల రూపాయలు, ఆరో రోజున 13.5 కోట్ల రూపాయలు, ఏడో రోజున 9.25 కోట్ల రూపాయలు, ఎనిమిదో రోజున 7.85 కోట్ల రూపాయలు, తొమ్మిదో రోజున 7.5 కోట్ల రూపాయలు, పదో రోజున 11.25 కోట్ల రూపాయల చొప్పున కర్ణాటకలో ఇప్పటి వరకు నికరంగా 125.7 కోట్ల రూపాయలు... 151 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ కలెక్టె చేసింది.

కర్ణాటకలో తన దూకుడుతో కాంతార చాప్టర్ 1 సరికొత్త బెంచ్ మార్క్ సృష్టించింది. తొలి ఆరు రోజుల్లోనే అత్యంత వేగంగా కర్ణాటకలో 100 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా... ఈ తర్వాత కేవలం 10 రోజుల్లోనే 150 కోట్ల మార్క్ అందుకుని మరో రికార్డ్‌ను కైవసం చేసుకుంది. 200 కోట్ల రూపాయల మార్క్ దిశగా పరుగులు తీస్తోంది. అదే జరిగితే కర్ణాటకలో 200 కోట్ల రూపాయల గ్రాస్ అందుకున్న తొలి మూవీగా కాంతార చాప్టర్ 1 నిలవనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X