Kantara Chapter 1 Box Office: షారుఖ్ ఆల్ టైం రికార్డ్ బ్రేక్... కాంతారతో రిషబ్ శెట్టి సరికొత్త చరిత్ర

వరుస విజయాలతో ఊపు మీదున్న హోంబలే ఫిలింస్ సంస్థ.. భారతీయ ప్రేక్షకులకు అందించిన మరో బ్లాక్ బస్టర్ మూవీ కాంతార చాప్టర్ 1. మూడేళ్ల క్రితం వచ్చిన కాంతారకు ప్రీక్వెల్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు. రిషబ్ శెట్టి దర్శకుడిగా, హీరోగా రెండు పాత్రలు పోషించారు. ఈ సినిమాలో రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటించగా.. యరామ్, గుల్షన్ దేవయ్య, ప్రమోద్ శెట్టి, రాకేశ్ పూజారి, ప్రకాశ్ తుమినాడ్, దీపక్ రామ్ పనాజీ, హరిప్రసాద్ తదితరులు ఇతర కీలకపాత్రలు పోషించారు. అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా.. అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రాఫర్‌గా, సురేష్ మల్లయ్య ఎడిటింగ్ బాధ్యలు నిర్వర్తించారు. విజయదశమి కానుకగా అక్టోబర్ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన కాంతార చాప్టర్ 1.. సరికొత్త రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. తాజాగా హిందీలో ఓ రేర్ ఫీట్ సాధించింది. ఈ వివరాల్లోకి వెళితే..

కాంతార చాప్టర్ 1 బడ్జెట్ ఎంత?
కాంతార చాప్టర్ 1లో జనటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రచార కార్యక్రమాలతో కలిపి కాంతార చాప్టర్ 1కు 125 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యింది. కాంతార బ్రాండ్ నేమ్‌తో పాటు టీజర్, ట్రైలర్ల కారణంగా ఈ సినిమాకు భారీ బిజినెస్ జరిగింది. నార్త్ ఇండియాలో కాంతార చాప్టర్ 1 థియేట్రికల్ రైట్స్ 96 కోట్ల రూపాయల మేర బిజినెస్ చేసింది. దాంతో ఈ సినిమా ఇక్కడ బ్రేక్ ఈవెన్ కావాలంటే 100 కోట్ల రూపాయల షేర్, 200 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది.

Kantara Chapter 1 Box Office Rishab Shetty s Movie surpassed Shah Rukh Khan s Pathaan Net Collections in India

ఇక తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల రూపాయలు, కర్ణాటక థియేట్రికల్ రైట్స్ 169 కోట్ల రూపాయలు, తమిళనాడు హక్కులు 13 కోట్ల రూపాయలు, కేరళ రైట్స్ 20 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ రైట్స్ 44.5 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా సుమారుగా 440 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రిషబ్ శెట్టి మూవీ లాభాల్లోకి రావాలంటే.. బాక్సాఫీస్ వద్ద దాదాపు 850 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టాలని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు. కాంతార చాప్టర్ 1 చిత్రాన్ని వరల్డ్ వైడ్‌గా 4400 థియేటర్‌లలో విడుదల చేశారు.

హిందీలో కాంతార చాప్టర్ 1 కలెక్షన్స్
రిలీజ్ రోజు నుంచి కాంతార చాప్టర్ 1 హిందీ బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోస్తోంది. తొలి రోజున 18.5 కోట్ల రూపాయలు, రెండో రోజున 12.5 కోట్ల రూపాయలు, మూడో రోజున 19.5 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 23 కోట్ల రూపాయలు, ఐదో రోజున 8.75 కోట్ల రూపాయలు, ఆరో రోజున 11.25 కోట్ల రూపాయలు, ఏడో రోజున 8.5 కోట్ల రూపాయలు, ఎనిమిదవ రోజున 7 కోట్ల రూపాయలు, తొమ్మిదవ రోజున 7.25 కోట్ల రూపాయలు, పదో రోజున 14.25 కోట్ల రూపాయలు, పదకొండో రోజున 14.25 కోట్ల రూపాయలు, పన్నెండవ రోజున 4.5 కోట్ల రూపాయలు, పదమూడో రోజున 6.5 కోట్ల రూపాయలు, పద్నాలుగో రోజున 4 కోట్ల రూపాయలు, పదిహేనవ రోజున 3.5 కోట్ల రూపాయలు, పదహారవ రోజున 3.65 కోట్ల రూపాయలు, పదిహేడవ రోజున 4.5 కోట్ల రూపాయలు, పద్దెనిమిదవ రోజున 6 కోట్ల రూపాయలు, పందోమ్మిదో రోజున 3.5 కోట్ల రూపాయలు, ఇరవయ్యోవ రోజున 4 కోట్ల రూపాయలు, ఇరవై ఒకటో రోజున 4.25 కోట్ల రూపాయలు చొప్పున 188.9 కోట్ల రూపాయలు రాబట్టింది. తొలివారం 108.75 కోట్ల రూపాయలు, రెండో వారం 54.25 కోట్ల రూపాయలు చొప్పున కాంతార చాప్టర్ 1 వసూలు చేసింది. కర్ణాటకను మించి హిందీలో ఈ సినిమా వసూళ్లు రాబడుతోంది.

ఇండియాలో కాంతార కలెక్షన్స్
కాంతార చాప్టర్ 1 చిత్రం ఇండియాలో తొలి వారం 337.4 కోట్ల రూపాయలు, రెండో వారంలో 147.85 కోట్ల రూపాయలు చొప్పున 21 రోజుల వరకు ఇండియాలో 556.75 కోట్ల రూపాయల నికర వసూళ్లు, 664.35 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది. ఇండియాలోని ఇతర ప్రాంతాలలో కాంతార వసూళ్లు పరిశీలిస్తే.. కర్ణాటకలో 179.8 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 87.13 కోట్ల రూపాయలు, హిందీలో 188.9 కోట్ల రూపాయలు, తమిళనాడులో 57.86 కోట్ల రూపాయలు, మలయాళంలో 43.06 కోట్ల రూపాయలు రాబట్టింది.

ఇక ఓవర్సీస్ కలెక్షన్స్ విషయానికి వస్తే.. అక్టోబర్ 21 వరకు నార్త్ అమెరికాలో 4.6 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో 40.44 కోట్ల రూపాయలు) రాబట్టింది. యూకే, యూరప్, గల్ఫ్, మిడిల్ ఈస్ట్, తదితర దేశాలలో 68 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో కాంతార చాప్టర్ 1కు ఓవర్సీస్ నుంచి 108 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి రిషబ్ శెట్టి మూవీకి 21 రోజుల్లొో వరల్డ్ వైడ్‌గా 772.85 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి.

షారుఖ్ రికార్డ్ బద్ధలు
కాంతార చాప్టర్ 1 వసూళ్లతో రిషబ్ శెట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఏకంగా బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ రికార్డును బద్ధలు కొట్టాడు. షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ మూవీ తన టోటల్ రన్‌లో ఇండియాలో 543.22 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టగా... దానిని కాంతార చాప్టర్ 1 కేవలం 20 రోజుల్లో అధిగమించింది. 20 రోజుల్లో రిషబ్ శెట్టి చిత్రం 547.1 కోట్ల రూపాయల నికర వసూళ్లు సాధించి సరికొత్త రికార్డులు నెలకొల్పింది. అలాగే హిందీ మార్కెట్‌లో ఏకంగా 200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ రాబట్టినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. దాంతో డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ జోన్‌లోకి వచ్చేశారు. మరి రానున్న రోజుల్లో కాంతార చాప్టర్ 1 ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X