Kantara Chapter 1 Day 10 Collections: బాక్సాఫీస్ వద్ద కాంతార తాండవం... 10వ రోజు రిషబ్ మూవీకి ఎన్ని కోట్లంటే?
రికార్డ్ కలెక్షన్స్‌తో కాంతార చాప్టర్ 1 బాక్సాఫీస్ వద్ద రికార్డ్‌లు సృష్టిస్తోంది. వారం రోజుల్లోనే 500 కోట్లకు పైగా వసూళ్లతో కన్నడ సినిమా ఖ్యాతిని మరో మెట్టుపైకి ఎక్కించింది. కన్నడ, హిందీ, తెలుగు, ఓవర్సీస్ మార్కెట్‌లలో ఎదురులేకుండా సాగుతోంది. విజయదశమి కానుకగా అక్టోబర్ 2వ తేదీ విడుదలైన కాంతార చాప్టర్ 1 సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? 10వ రోజు రిషబ్ శెట్టి మూవీ ఎన్ని కోట్లు రాబట్టిందో పరిశీలిస్తే..
కాంతార చాప్టర్ 1లో రిషబ్ శెట్టికి జోడీగా రుక్మిణీ వసంత్ హీరోయిన్ నటించారు. జయరామ్, గుల్షన్ దేవయ్య, ప్రమోద్ శెట్టి, రాకేశ్ పూజారి, ప్రకాశ్ తుమినాడ్, దీపక్ రామ్ పనాజీ, హరిప్రసాద్ తదితరులు ఇతర కీలకపాత్రలు పోషించారు. అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా.. అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రాఫర్‌గా, సురేష్ మల్లయ్య ఎడిటింగ్ బాధ్యలు నిర్వర్తించారు. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరంగదూర్, చాలువే గౌడలు కాంతార చాప్టర్ 1ను నిర్మించగా రిషబ్ శెట్టి హీరోగా, దర్శకుడిగా రెండు పాత్రలు పోషించారు.
కాంతార చాప్టర్ 1 బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి కాంతార చాప్టర్ 1కు 125 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యింది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే... నైజాంలో 40 కోట్లు, ఆంధ్రలో 45 కోట్లు, సీడెడ్ ఏరియాలో 15 కోట్లు చొప్పున తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల రూపాయల వ్యాపారం చేసింది. దాంతో కాంతార చాప్టర్ 1 తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ కావాలంటే 101 రూపాయల షేర్, 202 కోట్ల రూపాయలు గ్రాస్ రాబట్టాల్సి ఉంది.
కాంతార ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత?
అలాగే కర్ణాటక థియేట్రికల్ రైట్స్ 169 కోట్ల రూపాయలు, తమిళనాడు హక్కులు 13 కోట్ల రూపాయలు, కేరళ రైట్స్ 20 కోట్ల రూపాయలు, నార్త్ ఇండియా రైట్స్ 96 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ రైట్స్ 44.5 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా సుమారుగా 440 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రిషబ్ శెట్టి మూవీ లాభాల్లోకి రావాలంటే.. బాక్సాఫీస్ వద్ద దాదాపు 850 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టాల్సి ఉంటుంది అని ట్రేడ్ పండితులు వాల్యూ కట్టారు. కాంతార చాప్టర్ 1ని ప్రపంచవ్యాప్తంగా 4400 థియేటర్‌లలో విడుదల చేశారు.

కాంతార చాప్టర్ 1 తొమ్మిది రోజుల కలెక్షన్స్
కాంతార చాప్టర్ 1కు పెయిడ్ ప్రీమియర్స్‌తో కలిపి ఇండియా వైడ్‌గా తొలి రోజున 61.85 కోట్ల రూపాయలు, రెండో రోజున 45.4 కోట్ల రూపాయలు, మూడో రోజున 55 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 63 కోట్ల రూపాయలు, ఐదో రోజున 31.5 కోట్ల రూపాయలు, ఆరో రోజున 34.25 కోట్ల రూపాయలు, ఏడో రోజున 25 కోట్ల రూపాయలు, ఎనిమిదవ రోజున 21.25 కోట్ల రూపాయలు, తొమ్మిదవ రోజున 22.35 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. దాంతో 9 రోజుల వరకు కాంతార చాప్టర్ 1కు ఇండియా వైడ్‌గా 359.75 కోట్ల రూపాయల నెట్.. 428.75 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.
కాంతార చాప్టర్ 1 ఓవర్సీస్ కలెక్షన్స్
రిషబ్ శెట్టి మూవీ నార్త్ అమెరికాలో స్ట్రాంగ్ హోల్డ్ సాధించింది. అడ్వాన్స్ బుకింగ్‌లో దుమ్మురేపిన ఈ చిత్రం... నేటికీ పట్టు నిలబెట్టుకుంది. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ నుంచి గట్టి పోటీ ఎదురవుతున్నా 9 రోజుల వరకు కాంతార చాప్టర్ 1 నార్త్ అమెరికాలో 3.5 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో 31.5 కోట్ల రూపాయలు) రాబట్టింది. ఈ వీకెండ్‌లో ఎట్టి పరిస్ధితుల్లోనూ 4 మిలియన్ల క్లబ్‌లో చేరేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. ఇక ఓవర్సీస్ మార్కెట్‌లోని కీలక దేశాలైన యూకే, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, గల్ఫ్, మిడిల్ ఈస్ట్ తదితర దేశాల్లో 9 రోజుల వరకు 44 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టింది. దాంతో మొత్తంగా ఓవర్సీస్‌లో రిషబ్ శెట్టి మూవీకి 75 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. ఈ వీకెండ్‌లో కాంతార ఇక్కడ 100 కోట్ల క్లబ్‌లోకి చేరుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో కాంతార చాప్టర్ 1 కలెక్షన్స్
తెలుగులో పెయిడ్ ప్రీమియర్స్‌తో కలిపి ఈ సినిమాకు తొలి రోజున 13 కోట్ల రూపాయలు, రెండో రోజున 11.5 కోట్ల రూపాయలు, మూడో రోజున 11.25 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 11.5 కోట్ల రూపాయలు, ఐదో రోజున 5.4 కోట్ల రూపాయలు, ఆరో రోజున 4.75 కోట్ల రూపాయలు, ఏడో రోజున 3.5 కోట్ల రూపాయలు, ఎనిమిదవ రోజున 2.65 కోట్ల రూపాయలు, తొమ్మిదవ రోజున 3.25 కోట్ల రూపాయలు చొప్పున 66.8 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించింది.
తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారీగా కాంతార వసూళ్లు పరిశీలిస్తే.. నైజాంలో 23 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 8 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 7.50 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరిలో 3.35 కోట్ల రూపాయలు, వెస్ట్ గోదావరిలో 2.25 కోట్ల రూపాయలు, గుంటూరులో 3 కోట్ల రూపాయలు, కృష్ణాలో 3.75 కోట్ల రూపాయలు, నెల్లూరులో 2 కోట్ల రూపాయల చొప్పున రాబట్టింది.
ఇండియాలోని వివిధ ప్రాంతాల్లో కాంతార చాప్టర్ 1 వసూళ్లు పరిశీలిస్తే.. కర్ణాటకలో 114.7 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాలలో 66.8 కోట్ల రూపాయలు, హిందీలో 115.75 కోట్ల రూపాయలు, తమిళనాడులో 34 కోట్ల రూపాయలు, మలయాళంలో 28.5 కోట్ల రూపాయలు చొప్పున రాబట్టినట్లు సాక్‌నిక్ తెలిపింది. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి 504 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు సాక్‌నిక్ చెప్పింది.
కాంతార 10వ రోజు కలెక్షన్స్
వీకెండ్ కావడంతో కాంతార చాప్టర్ 1కు మంచి బుకింగ్స్ జరుగుతున్నాయి. 10వ రోజైన శనివారం సాయంత్రం 4 గంటల వరకు కన్నడంలో 40 శాతం, తెలుగులో 26 శాతం, హిందీలో 17 శాతం చొప్పున థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ డేటా చెబుతోంది. దాంతో 10వ రోజు కాంతార చాప్టర్ 1కు తెలుగు రాష్ట్రాల్లో 6 కోట్ల రూపాయలు, కన్నడంలో 12 కోట్ల రూపాయలు, హిందీలో 12 కోట్ల రూపాయలు, తమిళం, మళయాళం+ రెస్టాఫ్ ఇండియా కలిపి 2 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 2 కోట్ల రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా 35 కోట్ల రూపాయల గ్రాస్ రాబడుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. దాంతో 10 రోజుల వరకు కాంతార చాప్టర్ 1 ప్రపంచవ్యాప్తంగా 570 కోట్ల రూపాయల కలెక్షన్స్ అందుకుంటుందని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











