Kantara Chapter 1 Day 12 Collections: 700 కోట్ల కలెక్షన్లకు చేరువగా కాంతారా.. కన్నడలో సంచలన రికార్డు
దక్షిణాదిలో అగ్ర సినీ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మాత విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న చిత్రం కాంతార చాప్టర్ 1. రిషబ్ శెట్టి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. జయరాం, గుల్షన్ దేవయ్య, రాకేష్ పూజారీ తదితరులు నటిస్తున్నారు. ఈ మూవీకి ఛాలువే గౌడ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రఫిని, కేఎం ప్రకాశ్, శోభిత్ శెట్టి ఎడిటింగ్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. అజనీష్ లోక్‌నాథ్ బీ మ్యూజిక్ అందిస్తున్నారు. అయితే కంతార చిత్రం సంచలన విజయం సాధించడంతో ఈ చిత్రంపై బిజినెస్ పరంగాను, కంటెంట్ పరంగాను అంచనాలు పెరిగాయి. ఈ క్రమంలో ఈ సినిమా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ వివరాల్లోకి వెళితే..
కాంతర చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద బారీ వసూళ్లు రాబట్టడంతో కాంతార చాప్టర్ 1 సినిమాకు భారీగా బిజినెస్ జరిగింది. ఈ చిత్రం నైజాం థియేట్రికల్ హక్కులు 40 కోట్ల రూపాయలు, ఆంధ్రా రైట్స్ 45 కోట్ల రూపాయలు, సీడెడ్ 15 కోట్ల రూపాయల మేర అమ్ముడుపోయాయి. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ మూవీ 100 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ కావాలంటే.. కనీసం 170 కోట్ల రూపాయల మేర వసూలు చేయాల్సిన పరిస్థితి ఉంది.

ఇక తెలుగేతర రాష్ట్రాల బిజినెస్ విషయానికి వస్తే.. కర్ణాటక హక్కులు రికార్డు స్థాయిలో 169 కోట్ల రూపాయలు, తమిళనాడు హక్కులు 13 కోట్ల రూపాయలు, కేరళ రైట్స్ 20 కోట్ల రూపాయలు, నార్త్ ఇండియా రైట్స్ 96 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ రైట్స్ 44.5 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా సుమారుగా 440 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. కనీసం 850 కోట్ల రూపాయల మేర కలెక్షన్లను రాబట్టాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
భారీ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని ప్రారంభించిన కాంతారా చాప్టర్ 1 చిత్రం విడుదలైన అన్ని చోట్ల, అన్ని భాషల్లోను సంచలన రీతిలో కలెక్షన్లు రాబడుతున్నది. ఈ సినిమా తొలి వారం రోజుల్లో 340 కోట్ల రూపాయలు ఇండియాలో వసూలు చేసింది. ఈ చిత్రం కన్నడలో 107 కోట్ల రూపాయలు, తెలుగులో 65 కోట్ల రూపాయలు, హిందీలో 110 కోట్ల రూపాయలు, తమిళంలో 32 కోట్ల రూపాయలు, మలయాళంలో 30 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 340 కోట్ల రాబట్టింది.
ఇక కాంతార చిత్రం రెండో వారంలో కూడా రికార్డు స్థాయిలో కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇండియాలో ఈ చిత్రం 9వ రోజున 23 కోట్ల రూపాయలు, 10వ రోజున 40 కోట్ల రూపాయలు, 11వ రోజున 40 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ఈ చిత్రం 440 కోట్లకుపైగా నెట్ కలెక్షన్లను సాధించింది. ఇక 12వ రోజున కూడా 10 కోట్లకుపైగానే వసూళ్లను సాధించే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రం ఇండియాలో 450 కోట్ల రూపాయల నెట్, 550 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక కాంతార చిత్రం ఓవర్సీస్‌లో సంచలన రీతిలో రికార్డు క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నది. విదేశీ గడ్డపై 100 కోట్లు వసూలు చేసిన కన్నడ చిత్రంగా రికార్డు క్రియేట్ చేయనున్నది. ఈ చిత్రం ఇప్పటికే 90 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 665 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టిందని చిత్ర యూనిట్ వెల్లడించింది. త్వరలోనే 700 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్ల మైలురాయిని దాటే అవకాశం ఉంది. కన్నడలో ఈ చిత్రం 200 కోట్ల రూపాయలు, 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన దక్షిణా భారత సినిమాగా, తెలుగు, తమిళ, మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన డబ్బింగ్ చిత్రంగా రికార్డు క్రియేట్ చేయనున్నది.


Click it and Unblock the Notifications











