Kantara Chapter 1 Day 13 Collections: దారుణంగా పడిపోయిన కాంతార బుకింగ్స్.. రిషబ్ శెట్టి మూవీకి ఎన్ని కోట్లంటే

ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ బ్యానర్‌ నిర్మించిన చిత్రం కాంతార చాప్టర్ 1. అక్టోబర్ 2వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఏకంగా 665 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సంచలనం సృష్టించింది. ఇదే ఊపులో ఒక్కో సినిమా రికార్డును బద్ధలు కొడుతూ టార్గెట్ దిశగా దూసుకెళ్తోంది కాంతార చాప్టర్ 1. ఈ సినిమాలో రిషబ్ శెట్టి, రుక్మిణీ వసంత్ హీరో హీరోయిన్లుగా నటించగా... విజయ్ కిరంగదూర్, చాలువే గౌడలు నిర్మాణ సారథ్యం వహించారు. ఈ చిత్రంలో జయరామ్, గుల్షన్ దేవయ్య, ప్రమోద్ శెట్టి, రాకేశ్ పూజారి, ప్రకాశ్ తుమినాడ్, దీపక్ రామ్ పనాజీ, హరిప్రసాద్ తదితరులు ఇతర కీలకపాత్రలు పోషించారు. అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా.. అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రాఫర్‌గా, సురేష్ మల్లయ్య ఎడిటింగ్ బాధ్యలు నిర్వర్తించారు. రిషబ్ శెట్టి హీరోగా, దర్శకుడిగా ఈ చిత్రం కోసం పనిచేశారు. ఈ నేపథ్యంలో కాంతార చాప్టర్ 1 సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? 11వ రోజు రిషబ్ శెట్టి మూవీ ఎన్ని కోట్లు రాబట్టిందో పరిశీలిస్తే..

కాంతార చాప్టర్ 1 బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి కాంతార చాప్టర్ 1కు 125 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యింది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే... నైజాంలో 40 కోట్లు, ఆంధ్రలో 45 కోట్లు, సీడెడ్ ఏరియాలో 15 కోట్లు చొప్పున తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల రూపాయల వ్యాపారం చేసింది. దాంతో కాంతార చాప్టర్ 1 తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ కావాలంటే 101 రూపాయల షేర్, 202 కోట్ల రూపాయలు గ్రాస్ రాబట్టాల్సి ఉంది.

Kantara Chapter 1 Day 13 Expected Box Office Collections Worldwide Rishab Shetty s Movie faces huge drop

కాంతార ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత?
అలాగే కర్ణాటక థియేట్రికల్ రైట్స్ 169 కోట్ల రూపాయలు, తమిళనాడు హక్కులు 13 కోట్ల రూపాయలు, కేరళ రైట్స్ 20 కోట్ల రూపాయలు, నార్త్ ఇండియా రైట్స్ 96 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ రైట్స్ 44.5 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా సుమారుగా 440 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రిషబ్ శెట్టి మూవీ లాభాల్లోకి రావాలంటే.. బాక్సాఫీస్ వద్ద దాదాపు 850 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టాల్సి ఉంటుంది అని ట్రేడ్ పండితులు వాల్యూ కట్టారు. కాంతార చాప్టర్ 1ని ప్రపంచవ్యాప్తంగా 4400 థియేటర్‌లలో విడుదల చేశారు.

కాంతార చాప్టర్ 1 పన్నెండు రోజుల కలెక్షన్స్
కాంతార చాప్టర్ 1కు పెయిడ్ ప్రీమియర్స్‌తో కలిపి ఇండియా వైడ్‌గా తొలి రోజున 61.85 కోట్ల రూపాయలు, రెండో రోజున 45.4 కోట్ల రూపాయలు, మూడో రోజున 55 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 63 కోట్ల రూపాయలు, ఐదో రోజున 31.5 కోట్ల రూపాయలు, ఆరో రోజున 34.25 కోట్ల రూపాయలు, ఏడో రోజున 25 కోట్ల రూపాయలు, ఎనిమిదవ రోజున 21.25 కోట్ల రూపాయలు, తొమ్మిదవ రోజున 22.35 కోట్ల రూపాయలు, పదో రోజున 39 కోట్ల రూపాయలు, పదకొండో రోజున 39.75 కోట్ల రూపాయలు, పన్నెండవ రోజున 13.5 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. దాంతో 12 రోజుల వరకు కాంతార చాప్టర్ 1కు ఇండియా వైడ్‌గా 452 కోట్ల రూపాయల నెట్.. 540 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు సాక్‌నిక్ చెప్పింది.

కాంతార చాప్టర్ 1 ఓవర్సీస్ కలెక్షన్స్
నార్త్ అమెరికాలో కాంతార చాప్టర్ 1కు 4.2 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో 37.9 కోట్ల రూపాయలు) వసూలు చేసింది. మిగిలిన యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూరప్, గల్ఫ్, మిడిల్ ఈస్ట్, లాటిన్ అమెరికా తదితర దేశాలలో ఈ సినిమాకు 58 కోట్ల రూపాయలు వచ్చాయి. దాంతో ఓవర్సీస్‌లో మొత్తంగా కాంతార చాప్టర్ 1కు 96 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ వసూళ్లు కలిపి కాంతార చాప్టర్ 1కు వరల్డ్ వైడ్‌గా 640 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు సాక్‌నిక్ తెలిపింది.

తెలుగు రాష్ట్రాల్లో కాంతార చాప్టర్ 1 కలెక్షన్స్
తెలుగులో పెయిడ్ ప్రీమియర్స్‌తో కలిపి ఈ సినిమాకు తొలి రోజున 13 కోట్ల రూపాయలు, రెండో రోజున 11.5 కోట్ల రూపాయలు, మూడో రోజున 11.25 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 11.5 కోట్ల రూపాయలు, ఐదో రోజున 5.4 కోట్ల రూపాయలు, ఆరో రోజున 4.75 కోట్ల రూపాయలు, ఏడో రోజున 3.5 కోట్ల రూపాయలు, ఎనిమిదవ రోజున 2.65 కోట్ల రూపాయలు, తొమ్మిదవ రోజున 3.25 కోట్ల రూపాయలు, పదో రోజున 5 కోట్ల రూపాయలు, పదకొండో రోజున 4.85 కోట్ల రూపాయలు, పన్నెండో రోజున 1.35 కోట్ల రూపాయల చొప్పున 78.15 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించినట్లు సాక్‌నిక్ తెలిపింది.

తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారీగా కాంతార వసూళ్లు పరిశీలిస్తే.. నైజాంలో 27.67 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 8.89 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 8.21 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరిలో 3.50 కోట్ల రూపాయలు, వెస్ట్ గోదావరిలో 2.45 కోట్ల రూపాయలు, గుంటూరులో 3.30 కోట్ల రూపాయలు, కృష్ణాలో 3.90 కోట్ల రూపాయలు, నెల్లూరులో 2.25 కోట్ల రూపాయల చొప్పున రాబట్టింది.

ఇండియాలోని వివిధ ప్రాంతాల్లో కాంతార చాప్టర్ 1 వసూళ్లు పరిశీలిస్తే.. కర్ణాటకలో ఈ సినిమా 150 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాలలో 78.15 కోట్ల రూపాయలు, హిందీలో 150 కోట్ల రూపాయలు, తమిళనాడులో 46 కోట్ల రూపాయలు, మలయాళంలో 36 కోట్ల రూపాయలు చొప్పున రాబట్టినట్లు సాక్‌నిక్ తెలిపింది.

కాంతార 13వ రోజు కలెక్షన్స్
వర్కింగ్ డే కావడంతో కాంతార బుకింగ్స్ డల్ అయ్యాయి. నిన్న సోమవారం కూడా ఇండియాలో కేవలం 13.5 కోట్ల రూపాయలు రాబట్టగా... మంగళవారం బుకింగ్స్ మరింత పడిపోయాయి. 13వ రోజైన మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు కన్నడంలో 14 శాతం, తెలుగులో 13 శాతం, హిందీలో 13 శాతం, తమిళంలో 18 శాతం చొప్పున థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ డేటా చెబుతోంది. దాంతో 13వ రోజు కాంతార చాప్టర్‌ 1కు తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల రూపాయలు, కన్నడంలో 4 కోట్ల రూపాయలు, హిందీలో 6 కోట్ల రూపాయలు, తమిళం, మళయాళం+ రెస్టాఫ్ ఇండియా కలిపి కోటి రూపాయలు, ఓవర్సీస్‌లో కోటి రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా 15 కోట్ల రూపాయల గ్రాస్ రాబడుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. దాంతో 13 రోజుల వరకు కాంతార చాప్టర్ 1 ప్రపంచవ్యాప్తంగా 685 కోట్ల రూపాయల కలెక్షన్స్ అందుకుంటుందని భావిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X