Kantara Chapter 1 Day 14 Collections: 700 కోట్ల కలెక్షన్స్‌కి చేరువగా కాంతార... మరో రికార్డ్‌పై రిషబ్ శెట్టి క

రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ కాంతార చాప్టర్ 1. విజయదశమి కానుకగా అక్టోబర్ 2వ తేదీ విడుదలైన ఈ సినిమా కన్నడ చిత్ర పరిశ్రమను మరో మెట్టుపైకి ఎక్కించేలా హల్ చల్ చేస్తోంది. ఇప్పటికే 665 కోట్లకు పైగా వసూళ్లతో ఒక్క రికార్డును అధిగమిస్తూ చరిత్ర సృష్టిస్తోంది. 880 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లే ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో కాంతార చాప్టర్ 1 సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? 14వ రోజు రిషబ్ శెట్టి మూవీ ఎన్ని కోట్లు రాబట్టిందో పరిశీలిస్తే..

ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ బ్యానర్‌‌పై విజయ్ కిరంగదూర్, చాలువే గౌడలు కాంతార చాప్టర్‌ను నిర్మించారు. ఈ సినిమాకు రిషబ్ శెట్టి దర్శకత్వం వహించడంతో పాటు హీరోగానూ రెండు పాత్రలు పోషించారు. ఈ చిత్రం రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటించగా... జయరామ్, గుల్షన్ దేవయ్య, ప్రమోద్ శెట్టి, రాకేశ్ పూజారి, ప్రకాశ్ తుమినాడ్, దీపక్ రామ్ పనాజీ, హరిప్రసాద్ తదితరులు ఇతర కీలకపాత్రలు పోషించారు. అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా.. అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రాఫర్‌గా, సురేష్ మల్లయ్య ఎడిటింగ్ బాధ్యలు నిర్వర్తించారు.

Kantara Chapter 1 Day 14 Expected Box Office Collections Worldwide Rishab Shetty s Movie retain a solid count

కాంతార చాప్టర్ 1 బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి కాంతార చాప్టర్ 1కు 125 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యింది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే... నైజాంలో 40 కోట్లు, ఆంధ్రలో 45 కోట్లు, సీడెడ్ ఏరియాలో 15 కోట్లు చొప్పున తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల రూపాయల వ్యాపారం చేసింది. దాంతో కాంతార చాప్టర్ 1 తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ కావాలంటే 101 రూపాయల షేర్, 202 కోట్ల రూపాయలు గ్రాస్ రాబట్టాల్సి ఉంది.

కాంతార ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత?
అలాగే కర్ణాటక థియేట్రికల్ రైట్స్ 169 కోట్ల రూపాయలు, తమిళనాడు హక్కులు 13 కోట్ల రూపాయలు, కేరళ రైట్స్ 20 కోట్ల రూపాయలు, నార్త్ ఇండియా రైట్స్ 96 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ రైట్స్ 44.5 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా సుమారుగా 440 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రిషబ్ శెట్టి మూవీ లాభాల్లోకి రావాలంటే.. బాక్సాఫీస్ వద్ద దాదాపు 850 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టాల్సి ఉంటుంది అని ట్రేడ్ పండితులు వాల్యూ కట్టారు. కాంతార చాప్టర్ 1ని ప్రపంచవ్యాప్తంగా 4400 థియేటర్‌లలో విడుదల చేశారు.

కాంతార చాప్టర్ 1 పద్నాలుగు రోజుల కలెక్షన్స్
కాంతార చాప్టర్ 1కు పెయిడ్ ప్రీమియర్స్‌తో కలిపి ఇండియా వైడ్‌గా తొలి రోజున 61.85 కోట్ల రూపాయలు, రెండో రోజున 45.4 కోట్ల రూపాయలు, మూడో రోజున 55 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 63 కోట్ల రూపాయలు, ఐదో రోజున 31.5 కోట్ల రూపాయలు, ఆరో రోజున 34.25 కోట్ల రూపాయలు, ఏడో రోజున 25 కోట్ల రూపాయలు, ఎనిమిదవ రోజున 21.25 కోట్ల రూపాయలు, తొమ్మిదవ రోజున 22.35 కోట్ల రూపాయలు, పదో రోజున 39 కోట్ల రూపాయలు, పదకొండో రోజున 39.75 కోట్ల రూపాయలు, పన్నెండవ రోజున 13.5 కోట్ల రూపాయలు, పదమూడో రోజున 14 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. దాంతో 13 రోజుల వరకు కాంతార చాప్టర్ 1కు ఇండియా వైడ్‌గా 465.75 కోట్ల రూపాయల నెట్.. 556 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు సాక్‌నిక్ చెప్పింది.

కాంతార చాప్టర్ 1 ఓవర్సీస్ కలెక్షన్స్
నార్త్ అమెరికాలో కాంతార చాప్టర్ 1కు 4.3 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో 37.98 కోట్ల రూపాయలు) వసూలు చేసింది. మిగిలిన దేశాల నుంచి 62 కోట్ల రూపాయలు రావడంతో ఓవర్సీస్‌లో కాంతార చిత్రం 100 కోట్ల ల్యాండ్ మార్క్ దాటింది. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ వసూళ్లు కలిపి కాంతార చాప్టర్ 1కు వరల్డ్ వైడ్‌గా 656 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు సాక్‌నిక్ తెలిపింది.

తెలుగు రాష్ట్రాల్లో కాంతార చాప్టర్ 1 కలెక్షన్స్
తెలుగులో పెయిడ్ ప్రీమియర్స్‌తో కలిపి ఈ సినిమాకు తొలి రోజున 13 కోట్ల రూపాయలు, రెండో రోజున 11.5 కోట్ల రూపాయలు, మూడో రోజున 11.25 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 11.5 కోట్ల రూపాయలు, ఐదో రోజున 5.4 కోట్ల రూపాయలు, ఆరో రోజున 4.75 కోట్ల రూపాయలు, ఏడో రోజున 3.5 కోట్ల రూపాయలు, ఎనిమిదవ రోజున 2.65 కోట్ల రూపాయలు, తొమ్మిదవ రోజున 3.25 కోట్ల రూపాయలు, పదో రోజున 5 కోట్ల రూపాయలు, పదకొండో రోజున 4.85 కోట్ల రూపాయలు, పన్నెండో రోజున 1.35 కోట్ల రూపాయలు, పదమూడో రోజున 1.5 కోట్ల రూపాయలు చొప్పున 79.8 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించినట్లు సాక్‌నిక్ తెలిపింది.

తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారీగా కాంతార వసూళ్లు పరిశీలిస్తే.. నైజాంలో 27.75 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 9 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 8.50 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరిలో 3.65 కోట్ల రూపాయలు, వెస్ట్ గోదావరిలో 2.63 కోట్ల రూపాయలు, గుంటూరులో 3.45 కోట్ల రూపాయలు, కృష్ణాలో 4 కోట్ల రూపాయలు, నెల్లూరులో 2.35 కోట్ల రూపాయల చొప్పున రాబట్టింది.

ఇండియాలోని వివిధ ప్రాంతాల్లో కాంతార చాప్టర్ 1 వసూళ్లు పరిశీలిస్తే.. కర్ణాటకలో ఈ సినిమా 146.45 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాలలో 79.8 కోట్ల రూపాయలు, హిందీలో 155.35 కోట్ల రూపాయలు, తమిళనాడులో 47.4 కోట్ల రూపాయలు, మలయాళంలో 3.75 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 100 కోట్ల రూపాయల చొప్పున రాబట్టినట్లు సాక్‌నిక్ తెలిపింది.

కాంతార 14వ రోజు కలెక్షన్స్
కాంతార చాప్టర్ 1పై వర్కింగ్ డేస్ గట్టి ప్రభావం చూపుతున్నాయి. వీకెండ్‌లో ఊచకోత కోసిన కాంతార మూవీకి సోమవారం నుంచి బుకింగ్స్ క్షీణిస్తూ వచ్చాయి. అయితే తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వసూళ్లు పడిపోతుండగా హిందీ, కన్నడ, ఓవర్సీస్ మార్కెట్లు రిషబ్ శెట్టి మూవీని నిలబెడుతున్నాయి. 14వ రోజైన బుధవారం కూడా కాంతారకు వసూళ్లు పడిపోయాయి. ఈ సినిమాకు బుధవారం సాయంత్రం 4 గంటల వరకు కన్నడలో 13 శాతం, తెలుగులో 12 శాతం, హిందీలో 8 శాతం, తమిళ్‌లో 17 శాతం చొప్పున ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ తెలిపింది.

దాంతో 14వ రోజు కాంతార చాప్టర్ 1కు కన్నడలో 3 కోట్ల రూపాయలు, తెలుగులో 1.5 కోట్ల రూపాయలు, హిందీలో 5 కోట్ల రూపాయలు, తమిళం, మళయాళం+ రెస్టాఫ్ ఇండియాలో కలిపి కోటి రూపాయలు, ఓవర్సీస్‌లో కోటి రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా 12 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. దాంతో 14 రోజుల వరకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 695 కోట్ల రూపాయల వసూళ్లు సాధించి మరికొద్దిగంటల్లో 700 కోట్ల రూపాయల క్లబ్‌లోకి అడుగుపెట్టనుంది కాంతార.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X